ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -229 84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ –2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -229

84-అమెరికా దక్షిణ ప్రాంత సాహిత్య లహరికి నోబెల్ పొందిన –విలియం ఫాక్నర్ –2

ఫాక్నర్ అంతగా ప్రసిద్ధి చెందక పోయినా ఆయన గురించి జనం బాగా చెప్పుకొనేవారు .ఆయన డార్క్ మేజిక్ ,దెయ్యాలు రిరిగే తీర భూముల  భీకర అందాల గురించి చర్చించుకొనేవారు .ఆ ప్రదేశం ఎందుకు దెయ్యాల ఆవాసభూమి అయిందో పాల్క్నర్ ఎప్పుడూ విడమరచి చెప్పలేదు కాని చావు ,పతనం ఆయన రాసిన వాటిలో ఉన్నాయి .అందుకే ఆయన రచనలు ‘’dark grandeur of destruction ‘’అని పించాయి .ఆ భూములు వాటి యజమానులు బానిసత్వం వలన బలసి పోయారని అన్నాడు .అరిస్టాక్రసి ,ధనదాహం తో వాళ్ళు ధైర్యం  గౌరవాలను పోగొట్టుకొన్నారు .దీనిని వ్యతిరేకించే ఆయన, వాళ్ళ ఓటములను కధలుగా చెప్పాడు .వాళ్ళందరూ శాపోపహతులు అంటూ ఫాక్నర్ ‘’this whole land the whole of South is cursed ‘’అన్నాడు అందులోని పాత్ర మెక్ కాల్సిం ‘’అక్కడి నుంచి వచ్చిన మేమంతా నల్లవాళ్ళు తెల్ల వాళ్ళు పోషింపబడి ఆ శాపం లోనే ఉండిపోయాం ‘’అని అరుస్తాడు .

32 వ ఏట ఇద్దరుపిల్లల తల్లి ఎస్టెల్లా ఓల్డ్ హాం ఫ్రాంక్లిన్ ను పెళ్ళిచేసుకొన్నాడు .ఈ పెళ్లి వలన ఒక శిశువు పుట్టి చనిపోయింది .తర్వాత కూతురు జిల్ పుట్టి ఆయనకు గర్వ కారణమైంది .తరువాతి నవల ‘’ఆస్ ఐ లేడైయింగ్ ‘’ను బొగ్గు ప్లాంట్ లో పని చేస్తుండగా వీల్బారో వెనక కూర్చుని రాశానని చెప్పుకున్నాడు .ఇందులో బంద్రెంస్ అనే పేద తెల్ల వాడి గురించి ఆడీ బ్రన్దేన్ అనే కొండ జాతి అమ్మాయి గురించి ,ఆమె కుటుంబ బాధలగురించి ,ఆమె శరీర మాంసం శిధిలమై పోతుండా గా ఆమెను జెఫర్సన్ సేమిటరికి చేర్చటం , ఆమె శరీరాన్ని పీక్కు తినటానికి ఆకాశం లో గద్దలు రాబందులు తిరుగుతూ భయోత్పాతాన్ని కల్పించటాన్ని ఆమె కొడుకు పిచ్చివాడిగా మారటం భర్త పెట్టుడు పళ్ళ తో తనకు  భార్య శవాన్ని పూడ్చటానికి పలుగూ పారా అప్పుగా  ఇచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం  పరమ హృదయ విదారకంగా రాశాడు ఫాక్నర్ .విషయం నిరాసక్తమైనదే అయినా ఆయన నిర్వహించిన తీరుతో అది ,గుండెలోకి సూటిగా దూసుకుపోయే శబ్దజాలం తో ,ముడి కవిత్వంతో ‘’బాక్ వుడ్స్ ఎపిక్ ‘’అయింది .సమాప్తానికి ముందు అందులోని ఒక పాత్ర మానవుని నిష్ప్రయోజకత ను వ్యక్తీకరిస్తుంది ఇది ఫాక్నర్ గొంతు అని భావం అని మనం గ్రహించాలి-అతడే మన్నాడో ఆ పాత్ర మాటల్లో ఇంకా గొప్పగా ఉంటుంది చూడండి –‘’ How do our lives ravel into the no wind ,no sound ,the weary gestures wearily recapi tulant  echoes of ld compulsions with no hand on no strings –in sun set we fall into furious attitudes ,dead gestures of dolls ‘’ఇలాంటి స్టేట్మెంట్ కౌంటర్ పాయింట్ గా ‘’ఇలియట్ రాసిన ‘’హాలో మెన్ ‘’కు దీటుగా అనిపిస్తుంది –ఒక్కసారి ఇలియట్ కవిత్వం లోకి దీనికోసం తొంగి చూద్దాం –

‘’shape without form ,shade without color –paralyzed force ,gesture without motion –remember us –if at all –not as lost –violent souls  but only –as the hollow men –the stuffed men ‘’

వయసు 30 మధ్యలో ఉండగా సీరియస్ నవలల తో విజయం సాధించాలనుకొన్నాడు .’’సాన్ క్ట్యుయరి ‘’రాసి అబ్బే చాలా చీప్ గా కాసులకోసం కక్కూర్తి గా రాసినట్లుంది   అనుకొన్నాడు .నమ్మ శక్యం కాని దృశ్యాలు హింసాత్మకంగా ,వేశ్యా గృహం లో పూర్తిగా జరిగే కధగా దారుణ వాస్తవికంగా రాశాడు .ఇది కూడా అతని సౌత్ లాండ్ లో జరిగే నిత్య కృత్య రేపులు ,దిగాజారుడులే .సెన్సార్ వాళ్ళు కత్తెర వేశారు కాని కనక వర్షం కురిపించింది .దీన్ని అదనుగా తీసుకొని హాలీ వుడ్ స్క్రీన్ ట్రీట్ మెంట్ రాయటానికి ఆహ్వానించింది .అక్కడ కద అంతా మారి పల్చనై ‘’ది స్టోరీ ఆఫ్ టెంపుల్ డ్రీకర్ ‘’గా విడుదలైంది .మిగిలిన కొన్ని కధలను సినిమాలు తియ్యటం కోసం ఆయన్ను పెట్టుకొన్నారు .డబ్బు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు చలో హాలీ వుడ్ .కనుక బతకటానికి వేరే ఉద్యోగం అక్కర్లేకుండా పోయింది .పోస్ట్ మాస్టర్ గా ఎలా నిర్వాకం చేశాడో ఇక్కడ స్క్రిప్ట్ రైటర్ గా అలానే చేశాడు .ఒక దానికి స్టూడియో లో కాకుండా ఇంటి దగ్గరే రాయటానికి అనుమతి తీసుకొన్నాడు .ఈయన అద్దెకున్న ఇల్లు వెదికి  డైరెక్టర్  వెడితే మనవాడు మిసిసిపి కి జంప్ జిలానీ అయ్యాడని తెలిసి పర్మిషన్ అడగటం ఒక సాకు మాత్రమే అని అర్ధమైంది .

   పూర్తిగా ఊహా ప్రపంచాన్ని సృష్టించాలన్న కోరికతో ‘’యాక్న పటా వాఫా ‘’సాగా సీరియల్ గా రాయ దలచి అతి భీకర ,మహా విపత్ భరిత ,అత్యంత వేదనా భరిత నవల ఇది వరకెన్నడూఅమెరికాలో  రాయని విధంగా రాశాడు .అందులో ‘’లైట్ ఇన్ ఆగస్ట్ ‘’లో కుళ్ళి శిధిలమై పోతున్న నాగరకతను కళ్ళకు కట్టించాడు .ఇందులో రెండుకధలున్నాయి ఒకటి గర్భిణి అయిన ఒక పర్వత ప్రాంత అమ్మాయి కడుపులోని బిడ్డకు తండ్రి అయిన వాడిని వెదకటం ,సెక్స్ కోరికలతో సతమతమవుతూ నీగ్రోలకు సాయం చేసే తన ప్రేమ గూడులో చిక్కిన ఒక కుర్ర వాడిని చెడగొట్టి తానూ నాశనం అయ్యే  ఒక ముసలి మెయిడ్ కద..’’అబ్సలాం అబ్సలాం ‘’అనేది ఒక మేలో డ్రామా ఇందులో కోరిక ,సమ్మోహన బుద్ధి ,వావి వరసలు లేని శృంగారం లతో పతనమైన ఒక  వంశ చరిత్ర ఉంది .కధను అనేక పాత్రలద్వారా అసందర్భంగా చెప్పించినా నిర్మాణం వెనుకా ముందూ ప్రస్తావన లతో ఫాక్నర్ లోని ద్వైవీ భావాన్ని బయట పెడుతుంది .మానవత్వ  హుందాతనంతో పాటు నీగ్రో ,అన్నా ఆమె అన్నా అయిష్టత గోచరిస్తుంది ‘’ది అన్ వాన్క్విషెడ్’’లో మరో కుటుంబ కద ఉంది  ,రాసిన  ప్రచురితమైన అనేక కధలలో తన తాత గారి వ్యక్తిత్వ ఆరాధనా ఆయన ‘’సార్టోరిస్ ‘’వంశానికిచెందిన వాడుగా నిలబెట్టాడు .’’వైల్డ్ పామ్స్ ‘’ది హామ్లెట్ ‘’,ఇంట్రూడర్ఇన్ ది డస్ట్ ‘’మొదలైనవి ఈ  శ్రుమ్ఖలానికి చెందినవే .మాల్కం కౌలీ ‘’ది పోర్టబుల్ ఫాక్నర్ ‘’లో ‘’part of the same living pattern .In this pattern and not the printed volumes in which part of it is recorded that Faulkner ‘s real achievement ..he has little need to construct .,he needs only to call upon what is already waaiting for him ‘’అంటూ చక్కగా చెప్పాడు .

  50 వ ఏట ఫాక్నర్ జాతీయ వ్యక్తి అయ్యాడు .ప్రముఖ రచయితగా గుర్తింపు పొంది రచయితల సంఘాలకు ,సాహిత్య సమావేశాలకు దూరమైనాడు .విమర్శను దూషించేవాడు కాదు .న్యు క్ర్తిటిక్ ల పై యే అభిప్రాయం ఆయనకు లేదు .కళా ఈస్తెటిక్స్ మొదలైన వాటికి దూరంగా ఉండేవాడు ‘’నేనొక సామాన్య రైతును.ఏదో అప్పుడప్పుడు కధలు రాస్తాను  ‘’అని చెప్పుకునేవాడు .ఈ రైతు రచయిత కే ఎంతో విశిష్టమైన నోబెల్ సాహిత్య బహుమతిని నవంబర్ 1949 లో అందజేసి గౌరవించింది నోబెల్ పురస్కార సంస్థ .ఈ వార్తను  భార్య ఆయనకు చెప్పేదాకా తెలియనే తెలియదు .

Inline image 1  Inline image 2Inline image 3

 సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-16 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.