ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -231
85-అమెరికా ప్రజారంజక సంప్రదాయ స్వర మాధుర్య సంగీతకారుడు –జార్జ్ జెష్విన్
‘’తనకు తగిన తేజస్సు తో జీవించాడు ‘’ అని మెచ్చుకొనే అమెరికా ప్రజారంజక సాంప్రదాయ స్వరమాదుర్య సంగీత కర్త జార్జ్ జెష్విన్.38 ఏళ్ళకే అకస్మాత్తు సంఘటనలో మరణించే దాకా అమెరికాలోని ప్రజాదరణ సంగీతాన్ని గొప్ప మలుపు తిప్పట మేకాక పశ్చిమ దేశాల లో సంగీత నాడిని వేగం చేసిన వాడు .అమెరికాలో న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో 26-9-1898 న జన్మించాడు .తల్లి మార్రిస్. తండ్రి రోజ బ్రస్కిన్ జెర్ష్విన్ .చిన్నతనం అంతా మాన్ హాటన్ లోని లోయర్ ఈస్ట్ సైడ్ లో గడిచింది .తండ్రి అనేక పనులలో అంటే రెస్టారెంటులు ,రష్యన్ ,టర్కిష్ బాత్ లు ,బేకరీలు సిగార్ స్టోర్స్ ,ప్పోల్ పార్లర్ లలో ఇప్పుడు గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ అని పిలిచే బ్రిటన్ బీచ్ రేస్ ట్రాక్ దగ్గర పనులు చేసేవాడు .ఎక్కడా స్తిరంగా ఉండక ఎప్పుడూ ఏదో చోటికి మారు తూ ఉండేవారు .ఒక వ్యాపారాన్ని అమ్మేసి ఇంకో దాన్ని ప్రారంభించినప్పుడు ఆయనతో పాటే కుటుంబమూ ‘’జెండాపై కపిరాజు ‘’అంటూ అక్కడికి వెళ్ళేదన్నమాట .అన్న ఇరా తమ్ముడు జార్జ్ తాము దాదాపు 25 చోటుల్లో ,అపార్ట్ మెంట్ లలో మారుతూ బతికామని చెప్పుకొన్నారు .సెకండ్ ఎవెన్యు లోకి మారినప్పుడు తల్లి ఒక పియానో కొన్నది .అప్పటికి జార్జ్ వయసు 12 .
ఈ పియాని అన్న ఇరా కోసమే కొన్నా ,తమ్ముడు జార్జ్ దాని దగ్గర కూర్చుని ఎడమ చేత్తో చక్కగా వాయించేవాడు .తర్వాత చార్లెస్ హామ్బ్రిద్జర్ వద్ద చోపిన్ ,డేబూసీ ల సంగీతాన్ని నేర్చాడు .ఈ చార్లెస్ జార్జ్ కి సంగీతంలోని ప్రాధమిక విషయాలు టెక్నిక్ లు క్షుణ్ణం గా నేర్పాడు .దీనితో హై స్కూల్ ఆఫ్ కామర్స్ లో ఉదయం అసెంబ్లీకి సౌసా మార్చ్ సాంగ్ లు వాయించే నైపుణ్యం వచ్చింది .15 వ ఏట నే ప్రొఫెషనల్ అయి పోయి ,ఒక మ్యూజిక్ పబ్లిషింగ్ సంస్థలో వారానికి 15 డాలర్ల జీతం తో చేరాడు .సాంగ్ స్లాగ్గర్ లతోకలిసి వాడే విల్లీ హౌసెస్ ,లకు వెళ్లి అక్కడ జరిగే వాటిని రిపోర్ట్ చేస్తూ ,ఆచరణ యోగ్య మైన స్వరాలు కట్టేవాడు .మూడేళ్ళ తర్వాత స్వంత ఒక పాట పబ్లిష్ అయింది .21 వ ఏట ‘’లాలా లూసేల్లి ‘’అనే కామెడి కి 1919 లో మొత్తం సంగీతాన్ని కూర్చాడు .అదే ఏడాది టిన్ పాల్ అల్లే లో పాటగాడు ఆల్జాల్సన్ స్వీనీ తో రాక్ పాటలు పాడటం తో జార్జ్ పేరు దేశమంతా మారు మోగింది .
స్వీనీ ఒక నమూనా (ప్రోటో టైప్ )పాటఆనాటి మూస సెంటిమెంటల్ మ్యూజిక్ కామేడీలకు అతి భిన్నంగా ఉండి విప్లవాత్మకమైంది .ఇది అప్పటిదాకా ఉన్న పాత వియన్నీస్ ఒపెరెట్టాఫాషన్ లకు కాపీగా కాకుండా ,పూర్తీ గా మార్పు చేసి వేగవంతమైన ,విపరీత ఆశ్చర్యాన్ని కలిగించేట్లు ,ఉత్తేజం ,వినోదాల సంగీత విందు ఇచ్చింది .ఇందులో అన్నీ పరమ ఆశ్చర్య కరాలే .అందులోని స్వదేశ భావన ఆరాధన హాస్యపు గుబాళింపు తో మేళవించి ,పదాలు ,సంగీతం చాలా సరదాగా కలిసిపోయి ,విపరీతమైన శ్లేష తో ఆది నుంచి అంతం దాకా నమ్మకాన్ని విశ్వాసాన్ని అందించింది .ముఖ్యం గా ఇందులో స్వదేశీయ అమెరికా హృదయ ధ్వని భాసించి ఇదీ మా అసలైన సంగీతం అని రుజువు చేసింది .
దీని తర్వాత వచ్చిన పాటలన్నీ చాలా హాయిగా తేలిగ్గా లాబ దాయకంగా ప్రవ హి౦చాయి .ఇలాంటి స్వరాలు మాధుర్యం ఇంతకూ ముందు ఎన్నడూ అమెరికన్ దియేటర్ లో వినిపించనే లేదు ఇదొక విప్లవం .అమెరికన్ మూలాల లో పాదాలు ఉంచి నరాల ఉత్తుంగ ఉత్తేజం తో బ్రాడ్వే మ్యూజికల్స్ కు అనేక ప్రైవేట్ పాటలకు స్వరాలు కూర్చి స్వదేశీ భావసుమాలకు పరిమళాలు అద్ది రస భరితం చేశాడు .అలాంటి వాటిలో ‘’ఐ గాట్ రిధం ‘’,సమ్ బడి లవ్స్ మి ‘’మే బి ‘’,’’లిజా ‘’,అవర్ లవ్ ఈజ్ హియర్ టు స్టే’’చాలా ప్రసిద్ధమైనవి .శారీరకంగానూ ఆయన చాలెంజింగ్ గానే ఉన్నాడు .ఎత్తుగా సన్నగా ఉన్న పర్సనాలిటి .ముఖం నలుపు సన్నం .నుదురుఎత్తు గా ఉండేది .మొత్తం మీదచూస్తే అసీరియన్ శిల్పం లాగా ఉండేవాడు .వేగవంతంగా నవ్వేవాడు. తనకు తగిన తేజం తో గోచరి౦ చేవాడు .ప్రజలను నమ్మక పోవటం లేదుకాని వాళ్ళను అర్ధం చేసుకొనే అవసరం ఉండేదికాదు .జీవితాంతం పెళ్లి చేసుకొనే లేదు .పియానో నే ఆయన పెళ్ళాం ఆంతరంగిక సహచరి .పియానో ఉంటె అన్నీ మర్చిపోయి అందులోనే ఆనందం తృప్తీ పొందేవాడు .ఇతర పియానిస్ట్ లు గదిలో ఉన్నా ఆయన ద్రుష్టి అంతా తన పియానో మీదే ఉండేది అంతటి తాదాత్మ్యం ఆయనది .’’చూడండి –నేను వాయిస్తుంటే అందరూ హాపీ ,కాని ఇతరు లెవరైనా వాయిస్తుంటే నేను దయనీయం గా ఉంటాను ‘’అని చెప్పాడు .సంప్రదాయ సంగీతకారుల సంగీతంపై బాగా ఇష్టం ఉన్నా ,సమకాలికుల స్వరాలు కొన్ని నచ్చినా ,మెచ్చుకొన్నా ,పియానో దగ్గర ఉంటె మాత్రం వాళ్ళను ఎవర్నీ మెచ్చిన దాఖలాలు లేవు .’’ఆయనతో సాయంత్రం గడపటం అంటే అది జేష్విన్ సాయంత్రమే ‘’అన్నాడు ఆయన స్నేహితుడు ,సాటి పియానిస్ట్ ఆస్కార్ లేవెంట్ . మరోసారి తన పాటకు మెరుగు పెట్టు కొంటూ ’’నా సంగీతం ఇంకో వందేళ్ళ తర్వాత ఎవరైనా వాయిస్తారా ?’’అని ఆస్కార్ ను అడిగితే ‘’తప్పకుండా నువ్వు వాళ్ళ మధ్య ఉంటే ‘’అని నీరసంగా జవాబు చెప్పాడు ఆస్కార్ .
వయసు ఇరవై లలో ఉండగా ఆయనకు నాటకీయంగా కొత్త జీవితం ప్రారంభమైంది .బాండ్ లీడర్ పాల్ వైట్ మన్ డాన్స్ మ్యూజిక్ ను ఉద్ధరించాలనుకొన్నాడు .ఆధునిక సంగీత ప్రయోగం పేరుతొ ఒక సంగీత కచేరి ని లింకన్ పుట్టిన రోజు 1924 లో ఆలోలియన్ హాల్ లో నిర్వహించాడు .అంతకు ముందేజనవరిలో వైట్ మాన్ ప్రెస్ వాళ్లకు జేర్శ్విన్ తన స్వంతపాట పాడుతారని ప్రకటించాడు .అందరి కంటే జేర్శ్విన్ ఎక్కువ ఆశ్చర్య పోయాడు ‘’నువ్వు ఏదో ఒక రోజు నా కు ఒక కాన్సేర్ట్ పీస్ రాయాలి ‘’అని అడిగాడు .’’ఏదో ఒకరోజు రాస్తాలే ‘’అన్నాడు యదా లాపంగా .పేపర్లో ప్రకటన చూశాక ఆ సంఘటన జ్ఞాపకమొచ్చి ,వెంటనే పనికి ఉపక్రమించాడు .ఒక సరదా విషయం తీసుకొని నోట్ బుక్ లో రాసుకొని దాన్నే ప్రార౦భ గీతంగా పాడాలనుకొన్నాడు .అది క్లారినెట్ పై సుదీర్ఘంగా ఉదాత్త అనుదాత్తాలతో సాగింది .అలా౦టి పాట ఆకాల౦ లో ఎవరూ వాయించటానికి సాహసిమ్చేవారుకాడు . అతి కష్టమైనదికూడా . .జేష్విన్ దాన్ని గొప్ప పద బంధం తో ,పై స్థాయిలో ‘’రాప్సోడి ఇన్ బ్లూ’’తో మొదలయ్యేటట్లు రాశాడు ..ఈ రాఫ్సోడి ని మూడు వారాల్లో పూర్తీ చేశాడు .దీన్ని అప్పుడు అక్కడ ప్రదర్శిస్తే దాని ప్రభావం చెప్ప తరంకాక విపరీతంగా విజయ వంతమైంది .సాగతీత ,పాత వాసనలతో విసుగెత్తిన జనాలకు ఇది కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చింది .సీరియస్ సంగీతం పై పిచ్చ అభిమానమేర్పడింది .దాని వేగం ,తీక్ష్ణత అందులోని పరోక్ష ఇతి వృత్తానికి అన్నితరగతుల వారు మురిసి పోయారు అందరూ కొంతకాలం దాకా దీన్ని గురించే మాట్లాడుకొనేవాళ్ళు .రాఫ్సోడి అమెరికన్ ట్రేడ్ మార్క్ అయి పోయింది .అమెరికా చరిత్రలో ఇంత అద్భుతమైనది అంతకు ము౦దుకాని ఆ తర్వాత కాని రాలేదు ,అంత తరచుగా వినబడలేదు అంత ప్రపంచ ప్రసిద్ధం కాలేదు .’’సన్ ఆఫ్ ది సాయిల్ ఇన్ మ్యూజిక్’’ అని పించుకొన్నాడు జేర్శ్విన్ .
ఇంకా విస్తరించాలి అని అభిమానులు కోరుకున్నారు .అందుకే చిన్న కమ్మర్షియల్ బిట్స్ దగ్గర్నుంచి పెద్ద పెద్ద వాటిదాకా పనిచేసి అందరికి సంతృప్తి కల్గించాడు .వైట్ మాన్ అరెంజర్ అయిన ఫెర్డే గ్రోఫే రాఫ్సోల్ది ‘’కి ఆర్కెస్ట్రా సమకూర్చాడు .ఇక స్వంత ఏర్పాటు చేసుకోవాలనుకొన్నాడు జార్జ్ ..కాలక్షేపానికి ఎప్పుడైనా టెన్నిస్ ఆడేవాడు స్పోర్ట్స్ కు దూరం .దీనికి బదులు స్టుడియోలలో రాబిన్ గోల్డ్ ఆర్క్ ,జోసెఫ్ శిలింజర్ వంటి ముఖ్య సంగీత కారులతో కూర్చుని కాలం గడిపేవాడు .జార్జ్ కూర్చిన ‘’టిన్ పాన్ అల్లే ‘’శిల్లిన్జర్ కు బాగా నచ్చి అందులోవింత ట్రయేడ్,టేట్రాడ్స్ వలన కలిగిన గణిత కీలక భావనలు అంతకు పూర్వం తెలియని హై పిచ్ స్కేల్స్ ,అవి తీగల నిర్మాణం తో సంబంధం కలిగి ఉండటం ఆశ్చర్యం కలిగించి ‘’rhythmic groups resulting from the interference of several synchronized periodicities ‘’ ,’’groups with the fractioning around the axis of symmetry ‘’అని రాశాడు .
రాఫ్సోడి ప్రదర్శన తర్వాత ‘’కంసేర్టో f’’ లో సోలోయిస్ట్ అవతారమెత్తాడు .దీన్ని వాల్టర్ డాం రాష్ న్యు యార్క్ సి౦ ఫనికి చేశాడు ‘’యాన్ అమెరికన్ ఇన్ పారిస్ ‘’,సెకండ్ రాఫ్సోడి’’’’రాఫ్సోడి ఇన్ రివర్స్ ‘’వంటివి ఎన్నో చేశాడు .The rhapsody in blue was amounting adventure in excitement full of the flamboyant youth and pulsing energy of the nation .The jazz driven ‘’concerto ‘’widened Gershwin ;s gamut ‘’దీనిలో ఏముంది అంటే –‘’the nerves ,repressions and complexities of the modern world ‘’అమెరికన్ జాతీయాలను యాన్ అమెరికన్ ఇన్ పారిస్ ,సెకండ్ రాఫ్సోడి’’లు మరింత విస్తృతం చేశాయి .ఈ పాటలతో నగరాలు పల్లెలు వీది వీధినా మారు మోగాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-28-7-16 –ఉయ్యూరు