ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -232
85-అమెరికా ప్రజారంజక సంప్రదాయ స్వర మాధుర్య సంగీతకారుడు –జార్జ్ జెష్విన్ –2(చివరిభాగం )
లిబ్రటిస్ట్ లయిన జార్జెస్ ఎస్.కాఫ్మన్ ,మోరీ రిస్కిండ్ ల ప్రోత్సాహం తో జేష్క్విన్ మరో కొత్త ఇదివరకు ఎన్నడూ ప్రయత్నించని అమెరికా సంస్కృతీ –మ్యూజికల్ సెటైర్ పై తన ముద్ర వేశాడు .యుద్ధం ,రాజకీయం ,బడా బిజినెస్ ,,ఉన్నత విషయాలలో డోల్లతనాలను సరదాగా నవ్విస్తూ’’స్ట్రైక్ అప్ ది బాండ్ ఆఫ్ దీఐ సింగ్ ‘’ద్వారా బయట పెట్టాడు .దీనికి ‘’పులిట్జర్ ప్రైజ్ ‘’వచ్చింది .మొదటి సారిగా ఒక మ్యూజికల్ కామెడీకి ఈ బహుమతి రావటం చారిత్రాత్మకమైనది .అలాగే ‘’లెట్ దెంఈట్ కేక్ ‘’అనేది మరొకటి .వీటికి అన్న ఇరా లిరిక్స్ రాశాడు .ఈ రెండు 1930 -33 మధ్య వచ్చాయి .ఈ త్రయం కొత్త కోణాలలో భావాలతో పూర్వం కేవలం వినోదం అన్న దానికి భిన్నం గా గొప్ప సృజనాత్మకంగా దియేటర్ సంగీతానికి సొగసులద్దారు .
1933 లో జేర్శ్విన్ ‘’పోర్జీ అండ్ బెస్స్ ‘అనే మొదటి అసలైన అమెరికన్ మ్యూజిక్ డ్రామాకు స్కెచెస్ తయారు చేశాడు .’’డు బోస్ హేవార్డ్’’ నవల ఫోక్ ఒపేరా ఆధారంగా దీన్ని రెండు ఏళ్ళ లో తయారు చేశాడు .ఇందులో ఆర్కేస్ట్రై జేషన్ కే తొమ్మిది నెలలు పట్టింది .కోరికలు భయాలు ,సంతోషాలు కలిసి గొప్ప వైవిధ్యం తో రూపు దిద్దాడు .అలాగే జోలపాట ‘’సమ్మర్ టైం ‘’బాగా పాప్యులర్ అయింది .అరడజను దాకా రాసినా పూర్తీ శాస్త్రీయ బద్ధ సంగీతం లో రాయలేదు అన్నాడు ఆస్కార్ లెవంట్ .’’he could never accustom to such restraints as sonatas ,rondos ,or any of the classic molds .the thematic fluency ,the easy going rhythmic freedom of the rhapsody or un restricted fantasy was his natural genre ‘’అన్నాడు ఆస్కార్ .వయసు 30 కి రాకముందు 30 మ్యూజికల్ కామెడీలు స్టేజ్ కి సినిమాలకు రాశాడు .1936 లో సోదరు లిద్దరూ మళ్ళీ కాలి ఫోర్నియా చేరారు .అప్పటికే నాలుగవ సినిమా ‘’ది గోల్ద్విన్ ఫాలీస్ ‘’కు సంతోషంగా సంగీతం కూరుస్తున్నాడు .అకస్మాత్తుగా తలనెప్పి వచ్చి బాధ పడ్డాడు .మొదట్లో స్నేహితులు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు .ఇవి హాలీ వుడ్ కు వ్యతిరేక మైన డిఫెన్స్ మేకానిజానికి చెందిన సైకో సోమాటిక్ న్యూరోటిక్ ప్రొటెస్ట్ లనుకొన్నారు .ఒక్కసారిగా అతని పియానో టెక్నిక్ విఫలమవటం తో స్టూడియో లోనే కుప్ప కూలాడు .డాక్టర్ దగ్గరకు వెంటనే తీసుకు వెళ్ళారు .అక్కడ కూడా ఆయన దీన్ని సీరియస్ గా భావించలేదు .అతన్ని పరీక్షించి నెర్వస్ బ్రేక్ డౌన్ అని చెప్పారు .రెండవ సారి వచ్చింది .ఎక్స్ రే రిపోర్ట్ అత్యవసరమైంది .మెదడులో కణితి పెరిగిందని గుర్తించారు .ఎమర్జెన్సి ఆపరేషన్ చేశారు .కాని కోలుకోలేదు లాస్ ఏంజెల్స్ లో 11 -7-19 37 న 39 వ ఏట సంగీత శిఖరారోహణ చేసిన జార్జ్ జేష్విన్ అకస్మాత్తుగా అమరుడైనాడు .మరిన్ని సృజనలతో మెరిపించి మురిపించాల్సిన సంగీత కర్త బ్రెయిన్ ట్యూమర్ తో మరణించాడు .
ఆయన చనిపోయిన సుమారు 20 ఏళ్ళకు కూడా ఆయన సంగీతం తరచుగా వినటం మెచ్చుకోవటం జరుగుతోంది .అతని పెద్ద రచనలు అంతగొప్పవి కావని విమర్శకాభి ప్రాయం .కాని ఆయన జీనియస్ ను ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదు .రికార్డ్ కంపెనీలు ఆయన పాత పాటలను దుమ్ము దులిపి బయటికి తీసి కొత్త తరానికి అందిస్తూ ఆన౦దించేట్లు చేస్తున్నాయి .ఎన్నో సంగీత స్వరాలను కూర్చి పరవశింప చేయటమేకాక పూర్వం ఎప్పుడూలేనిసరికొత్త విధానం ప్రవేశ పెట్టాడు .పాప్యులర్ ,క్లాసిక్ సంగీతానికి మధ్య ఉన్న అడ్డంకులను తొలగించి లేక ఫార్మల్ నాన్ ఫార్మల్ సంగీత హద్దుల్ని చెరిపేసి విలువైన అమర సంగీతాన్ని అందించాడు .1955 లో ‘’పోర్జి అండ్ బీస్ ‘’ని ప్రదర్శిస్తూ యూరప్ అంతా చుట్టిన కంపెనీకి ప్రజలు బ్రహ్మ రధం పట్టారు .అంటే ఇప్పటికీ సంగీత ప్రపంచం లో రష్యాతోపాటు అనేక దేశాలలో అతని కీర్తి స్థిరంగా సురక్షణలోనే ఉంది అని తేలింది .””He had pronounced the tone and the tempo of his age –he had given music a new racy speech and for the first time in history an American accent ‘’.
ఆతని ఎస్టేట్ అన్నకు ,తల్లికి సంక్రమించింది .అతని సంగీతం పై వచ్చే రాయల్టీ, కాపీరైట్ హక్కులు ఆ కుటుంబానికే దక్కాయి .ఆతను సంపాదించిన డబ్బును లెక్కేసి గార్డియన్ పత్రిక అన్నికాలాలోని సంగీత కారుల కంటే అత్యంత సంపన్నుడు అని తేల్చింది .మిచిగన్ యూనివర్సిటి లో అతనిపేర ఒక సంగీత కళాశాల ఏర్పరచారు .ఆయనకు వచ్చిన అవార్డులు చాలా విలువైనవి –కంగ్రేషనల్ గోల్డ్ మెడల్ ,స్పెషల్ పులిట్జర్ ప్రైజ్ ,ఇరా జార్జ్ సోదరులకు జీవన సాఫల్య పురస్కారం ,లాంగ్ ఐలాండ్ మ్యూజిక్ హాల్ లో పేరు చేర్చారు .ఆర్కెస్ట్రా తో చేసినవి 10 ,సోలో పియానో లు 2 ,ఒపెరాలు 2 ,లండన్ మ్యూజికల్స్1 , ,బ్రాడ్వే మ్యూజికల్స్ 18 ,సినిమాలకు 5 జేర్శ్విన్ సంగీతం సమకూర్చాడు
.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-7-16 –ఉయ్యూరు