ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -234 86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -234

86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-2

హెమింగ్వే  ఒక కొత్త దృగ్విషయం గా ఉండేవాడు .ఈస్తేటేస్ లో అతను అథ్లెట్ .ఆరడుగుల పొడవు సింహం తల ,పురుషాహంకార చాతీ తో ఒక ప్రైజ్ రింగ్ లోకి ప్రేవేశించినట్లు రూమ్ లో కి ప్రవేశించేవాడు .ఆయన గొప్ప బాక్సర్ మాత్రమే కాదు దానిలో శిక్షణ కూడా ఇచ్చే గురూజీ కూడా .దవడ కింద చలాకీగా కొట్టటం ఆయన నేర్చిన గొప్ప పాఠం.25 లో జర్నలిస్ట్ కంటే రచయిత కావాలనుకొని మొదటిచిన్న పుస్తకం వదిలాడు .ఏదో ఒక అనామక ప్రెస్ లో అంతగా ఆకర్షణ లేని విధంగా అది ప్రింట్ అయింది .దానికి ‘’త్రీ స్టోరీస్ అండ్ టెన్ పోయెమ్స్ ‘’అని పేరుపెట్టాడు .కొద్దికాలానికే రెండవది ‘’ఇన్ అవర్ టైం ‘’అచ్చు వేశాడు . ఎక్కువగా సంప్రదాయాన్ని పట్టుకు పాకులాడినట్లని పించింది .యుద్ధానంతర పరిస్తితి ,ఎపిగ్రాఫ్ లతో ఉంది .దీన్నే కొంత మార్చి 1924 లో న్యు యార్క్ నుండి ‘’ఇన్ అవర్ టైం ‘’గా ప్రచురించాడు .ఇందులో ఆయన శక్తి వంతుడైనసృజనాత్మక  రచయిత అనిపిస్తాడు .కాని ఇంకా పరిపక్వానికి రాని ,జీవితం ,కళ అంటే ఏమిటో తెలీని వాడుగా కనిపించాడు .ఇదొక నవల గా ఉంటుంది .ప్రతి అధ్యాయానికి శీర్షిక ,పాత్రల మధ్య సమన్వయం ఉంటుంది .నిజంగా ఇది చిన్నకదల సమాహారమే కాని ఒకదానికొకటి సంబంధం కలిగి పాత దానికి శబ్ద చిత్రం అనిపిస్తుంది .ఏక సూత్రత ఉండటం విశేషం .చూడగా ఈ రెండూ వేరు వేరుగా అనిపిస్తాయి .ఇందులో యుద్ధం ,హింస అకస్మాత్తు చావులు ఉంటాయి .మరోరకం గా అతని బాల్య స్వీయ చరిత్ర తండ్రితో చేపలు పట్టే విశేషాలున్నాయి..యుద్ధానికి ముందుకూడా లోకం లో శాంతి లేదని బాధ పడటం చూస్తాం .25 లో ఉగ్రవాద ౦ ,పెద్ద పెద్ద విషాద సంఘటనలలో ఏర్పడిన క్రౌర్యం అంటే ఆయనకు మోజుగా ఉండేది .ప్రతి రోజు జీవితం లో విషాదం ,క్రూరత్వం ,హృదయం లేని భావం అతన్ని బాగా పీడించేవి .వీటినన్నిటిని ‘’టోరెంట్స్ ఆఫ్ స్ప్రింగ్ ‘’లో రాశాడు .ఇది షేర్ వుడ్ ఆండర్సన్ కు నివాళి గానే కనిపించినా పరిహాసమూ ధ్వనిస్తుంది .ఆండర్సన్ చెప్పే సెక్సువల్ మిస్టి సిజం ‘’లాస్ట్ జెనరేషన్ ‘’కు పూజనీయమైంది .శాంతికోసం ఆరాటం అందులో కనిపించకపోవటం ఆ సిద్ధాంతం లో హెమింగ్వే కు కనిపించింది .

      హెమింగ్వే ఆకస్మాత్ ప్రాభవానికి ఆయన దృక్పధం, శైలి ముఖ్యకారణాలు .ఈ రెండు కూడా ఆగ్రహం లోంచి వచ్చినవే .వేలాది యువకుల నిరాశా నిస్పృహలు ,స్థితి త్రుణీకరణం ,ఆశల వైఫల్యం పై ఆయనకు కోపం ఎక్కువ .ఈ కోపం స్టాయిజం ముసుగులో కాని ఆ తరం సాంఘికంగా విలువలపరంగా తగినంత స్థాయిలో లేకపోవటం ఆయనకు బాధ కలిగించింది .కూలి పోయిన ప్రపంచం లో స్త్రీ పురుషులు ఏదో రకంగా సర్దుకు పోతూ ,చిద్రమైన బోహిమియన్ లలాగా జీవించటం చూసి ‘’ది సన్ ఆల్సో రైజేస్ ‘’రాసి పెద్ద సంచలనమే సృస్టించాడు .మంత్రముగ్ధంగా బిగపట్టిన నరాలతో హింసాత్మకంగా ,పిచ్చి సంగీతం కోసం ,మరింత కిక్కిచ్చే మద్యం కోసం అరవటం కనిపిస్తుంది .ప్రేమ లేని సెక్స్ ,సెక్స్ లేని ప్రేమ ఇందులో పుష్కలం .

ఇందులోని హీరోలు బుల్ ఫైటర్లు  ,హంటర్లు ,క్రీడాకారులు ,ఆదిమానవులు .వీరంతా 20 వ శతాబ్ది బలహీన సంస్కృతికి ప్రతినిధులు .హెమింగ్వే వారి ప్రవక్త .వారి కస్టాలు బాధలు వేదనల కన్నీరు నిరాశా నిస్పృహ లపై సానుభూతి చూపాడు .వీళ్ళను తాను అధిగామించినవాడు .ఆయన రచయితమాత్రమేకాక ,,ఫైటర్ ,ప్రిమిటివ్   ,భౌతిక కార్యాన్ని ఘనంగా చెప్పినవాడు .చాలా ముక్కు సూటిగా అత్యంత సరళంగా ,యే అల౦కారం లేని విధంగా రాయటం ఆయన ప్రత్యేకత .’’his tone was dry and flat but the implications were exciting .-the dialogues were as as artlessly plastic as conversation  but they were un cannily precise and almost unbearably intense ‘. .ఈ దివాలా ప్రపంచాన్ని సమాజాన్నీ  ఆయన తిరస్కరించాడు .తన స్వంత శబ్ద ప్రపంచాన్ని సృష్టించుకొని శబ్ద బ్రహ్మ అనిపించాడు .ఆయనది ఒక భాషా విద్యాలయమే అయింది .సాహిత్య విప్లవం కోరుకొన్నాడు ..ఆయన విధానాన్ని రచయితలూ అనుకరించటానికి ఉబలాట పడ్డారు .కొందరు మాత్రం ఆయన రచనలు చదవ లేదని  ప్రగల్భాలు పలికారు .ఆయన అండర్ స్టేట్ మెంట్ లు  ఉడికే రక్తానికి ప్రతినిదులయ్యాయి .ఫాషన్ కూడా అయింది .’’sick brutality and twisted sentimentality లను వింతగా జోడించి రాయటం ఆయన ప్రత్యేకత .At twenty –seven Hemingway had set the keynote for a new kind of literature .it was felt half the young writers tried to imitate him and the other half tried not ‘’

Inline image 1

Inline image 2Inline image 3
   సశేషం

        మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-7-16 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.