ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -235 86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-3(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -235

86-అమెరికన్ క్లాసిక్ సాహిత్యం తో నోబెల్ పొందిన –ఎర్నెస్ట్ హెమింగ్వే-3(చివరిభాగం )

పారిస్ లోఉంటూ , టైరోల్ లో స్కైయింగ్  స్పెయిన్ వెళ్లి బుల్ ఫైట్ లతో కాలక్షేపం చేసేవాడు హెమింగ్వే .ఈకాలం లో ఆయన అత్యుత్తమ కధలను రాశాడు .1927 లో మొదటి పెళ్లి విడాకులతో పూర్తీ అవగానే పాలీన్ పీఫెర్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు మగ పిల్లలని  కన్నాడు .అమెరిక వెళ్లి మరో చిన్న కదా సంపుటి ‘’మెన్ వితోట్ వుమెన్ ‘’ప్రచురించాడు .కి వెస్ట్ కు వెళ్లి నైపుణ్యం గల చేపల వేటకాడయ్యాడు .అధిక శ్రమవలన ఆయన పాత గాయాలు మళ్ళీ ఇబ్బంది పెట్టాయి .1928 లో ‘’ఫేర్ వెల్ టు ఆర్మ్స్ ‘’నవల పూర్తీ చేశాడు .చిన్నకదను పుస్తక ప్రమాణంగా ద్వైవీ భావం తో ప్రేమ ,యుద్ధ పతనాలను జోడించి రాశాడు .చిన్న కధలోని సమాప్తం నవలలో దుఃఖ విచారాలయ్యాయి ‘’.మరణ మృదంగం ‘’అని ఆయన విమర్శకులు అన్నట్లు ఆయన రచనల్లో అది పూర్తిగా ఆక్రమించింది .దీనినే ‘’డెత్ ఇన్ ది  ఆఫ్టర్ నూన్ లో బుల్ ఫైటింగ్ ను ఒక కళ గా ,అదొక ప్రత్యేక ఉన్నత శైలి వధ గా వర్ణించాడు .ఏదో రకమైన ప్రమాదం ఉన్న ప్రేమ ను వదిలి బుల్ ఫైటింగ్ లో పడ్డాడు .కాని అనుభవ రాహిత్యం ఇబ్బందిపాలు చేసింది ..బొక్కలు (బొమికలు )విరిగి ఒళ్ళు పుళ్లు అయి అసలే నిప్పుల బాధలో ఉన్నవాడికి మరింత ఇబ్బంది కలిగింది .ఈ బాధల్లోంచే ఒక్కోసారి వినోదం ,మరోసారి ప్రకాశ వంతం కలిగిస్తూ రచనలు చేశాడు .’’విన్నర్ టేక్ నధింగ్ ‘’ ‘’గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా ‘’లలో బుల్ ఫైటింగ్ బదులు వేటకు ప్రాదాన్యమిచ్చాడు .’’టు హావ్ అండ్ జావ్ నాట్ ‘’లో చావు ,కరిగిపోవటం లను కలిపి రాశాడు .ఈ కద కీ వెస్ట్ లో జరిగింది .ఇక్కడ చావు మరో తరహాగా ఉంటుంది .39 లో ప్రవేశించిన హెమింగ్వే స్పానిష్ రిపబ్లిక్ కూలి పోవటం తో  ఆదవాని ప్రపంచమంతా ప్రతిధ్వనించినట్లు అనిపించింది .హెమింగ్వే ఫాసిస్ట్  వ్యతిరేకి .’’ప్రపంచ రక్షకులు ‘’అని పించుకొంటున్నవారిని ఇంకా పూర్తిగా  సమర్ధించ లేదాయన .అతని హారీ మార్గాన్ ఒక మోసకారి స్మగ్లర్ పేద్దహీరో గా కుళ్ళిపోతున్న సమాజానికి ఉద్దారకుడిగా ,ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడయ్యాడు .ఇందులో లక్ష్య నినాదం ‘’ఇప్పుడెవరూ ఒంటరికాదు ‘’.వేధించే సాంఘిక సమస్య హెమింగ్వే కు కొత్త .కనుక పుస్తకం రెండు భాగాలుగా రాసి ప్రచురించాడు .

  చావు కోరిక ,పునరుత్పత్తి  సిద్ధాంతం లను కలిపి ‘’ది ఫిఫ్త్ కాలం ‘’నాటకం గా రాశాడు .దీన్ని నవల చదివినంత హాయిగా చదువుకో వచ్చు .యుద్ధ పరిణామాలలో విఫల ప్రేమ ఉంది .హీరోకు చంపటం లో అర్ధం ఉందనిపిస్తుంది .19 38 లో ఈనాటకం తో కలిపి కొన్ని ఆయన ప్రసిద్ధకధలతో చేర్చి ‘’ది ఫిఫ్త్ కాలం అండ్ ది ఫస్ట్ ఫార్తీనైన్ స్టోరీస్ ‘’గా తెచ్చాడు .ఇవి హాలీవుడ్ సినిమాలకు గొప్ప వరమైనాయి .వీటిలోనూ చావువాసనే వుంది .45 వ ఏట హెమింగ్వే అతని అతిపెద్ద ,అతి ప్రాముఖ్యమైన నవల ‘’ఫర్ హూం ది బెల్ టాల్స్ ‘’రాశాడు .పూర్వపు ఆలోచనే అయిన చావు ,జీవితం దీనిలోనూ ప్రాధాన్యం పొందింది .స్పెయిన్ లో ఫాసిస్ట్ లపై లాయలిస్ట్ ల పోరాటం గుర్తించాడు .మానవ స్వేచ్చకు  బాధ్యతకు భంగం కలిగించే వాటిపై నిరసన గళమే ఆయన .పూర్వం ఆయన కు కీట్స్ కవి చెప్పిన ‘’many a time I have been half in love with easeful death ‘’భావనకు వ్యతిరేకి .జీవితాన్ని ప్రమాద పరచే ప్రేమ అంటే ఆయనకు చాలా ఇష్టం .చావు నిరాశామయమని ,చావు కు అర్ధం లేదని అనుకొనేవాడు .ఇప్పుడు ఆయనకు జీవిచటం లో మరణించటం లో ప్రయోజనం ఉందని తెలిసింది .దానికి కారణం కూడా ఉంటుందని అన్నాడు .స్పానిష్ యుద్ధం పై ఆయన రిపోర్ట్ లో స్పానిష్ ప్రజల పై అధ్యయనం పెద్దగా లేదని కాని అది ఎపిక్ ధైర్యాన్ని ,అనుకంపను కలిగిస్తుందని అంటారు .గెరిల్లాలపై సానుభూతి చూపాడు .మానవత్వం పై పెద్ద ఆశ కనిపిస్తుంది .అంటే కాదు మొదటి సారిగా సోదరత్వం గోచరిస్తుంది .

   కాని లాయలిస్ట్ ల ఓటమి త్యాగం ,సంతోషం ,సహవాసాలు ఆయన్ను  సిగ్గుపడేట్లు చేశాయి .చివరికి ఇవి ఆయనలో పూర్తిగా మృగ్యమైపోయాయి .ఎనిమిదేళ్ళ తర్వాత ‘’అక్రాస్ ది రివర్ అండ్ ఇంటూ ది ట్రీస్  ‘’రాశాడు .ఎంతో ఆశగా ఎదురు చూసిన జనానికి చుక్కలు చూపించి నిరాశ కలిగించింది .రచనా విధానం పేలవమై విసుగు పుట్టించింది .కాని చావు మళ్ళీ ప్రత్యక్షమైంది ‘’ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ ‘’లో .54 వయసు .చిన్ననవలె కాని మనిషి అదృష్టం తో డీకోనటం కద.జీవించటానికి ,మరణింప చెయ్యటానికి ప్రబలమైన ప్రకృతి శక్తులతో మనిషి పోరాటాన్ని గొప్ప గా చిత్రించాడు .ట్రాజిక్ డిగ్నిటి కి పట్టం కట్టాడు .ఇలాంటి కధను ఇంతకూ ముందు హెమింగ్వే కాని ఆయన సమకాలికులు కాని రాయనే లేదు .క్లాసిక్ అయింది .నవల లో ఓల్డ్ మాన్ తో చెప్పించిన మాటలు గొప్ప జీవిత సత్యాలు అన్వేషణా ఫలితాలూను –‘’Now we  are  joined together And  no one to help either one of us .Fish I love you and respect you very much .You are my brother –you are killing me ,fish .but you have a right to .Never have I seen a greater ,or more beautiful or calmer or more noble thing than you .,brother .Come on and kill me .I do not care who kills who ‘’.ఆ మహా మీనాన్ని చంపెదాకా టెన్షన్ బాగా పోషింప బడింది .గొప్ప భావోద్రేకాన్ని ,మహా ప్రతీకాత్మకంగా తెలియ జేశాడు .1953 లో దీనికి పులిట్జర్  బహుమతి లభించినందుకు అతని అభిమానులు యెగిరి గంతేసి పాతికేళ్ళు ఆలస్యంగా వచ్చిందని అంటే  వ్యతిరేకులు ఆశ్చర్యం తో ముక్కున వేలేసుకొన్నారు .మరుసటి ఏడాదే నోబెల్ పురస్కారం అయన  ‘’style making mastership ‘’శైలీ విన్యాసం లో అద్వితీయతకు ‘’ లభించింది .ఆయన తనను తానూ కాల్చుకొని చనిపోకముందే నోబెల్ సంస్థ ఆయన్ను సత్కరిమ్చాలను కొన్నది .1954జనవరిలో రేడియో లో అకస్మాత్తుగా హెమింగ్వే మరణ వార్త ప్రసార మైంది .భార్యతో ఆఫ్రికాకు సఫారి కోసం వెళ్ళాడు .వీళ్ళు ప్రయాణం చేసే విమానం ముక్కలై ఎగువ నైలు నదీ ప్రాంతం లో  కూలిప్రేలి పోయింది ..ఇంకేముంది ప్రసార మాధ్యమాలు ‘’మహా గొప్ప నవలా కారుడు హెమింగ్వే మరణించాడని ‘’మరణాన్ని ఆనందంగా అనుభవించాడు అని శీర్షికలు పెట్టి ప్రసారం చేశాయి .అప్పటిదాకా హెమింగ్వే రచనలను చదవని వేలాది మంది చావు ఆయన సాధారణ కదా విషయం అని ఎప్పటికప్పుడు చావు సమీపానికి వచ్చి తప్పించుకొంటాడని  తెలుసు కొన్నారు .మర్నాడు ఉదయం పత్రికలూ ఆయన చావ లేదని రెండు సార్లు మృత్యువు కోరలలోంచి బ్రతికి బయట పడ్డ రచయిత అని పతాక శీర్షికలతో రాశాయి .కూలిన విమానం లో నుంచి నెమ్మదిగా ఇద్దరూ పాకు కొంటూ బయట పడ్డారు   ఒక మోటార్ లాంచ్ రక్షించి౦ది ..రక్షణ విమానం వచ్చి తీసుకొని వెడుతుండగా అది అగ్నిప్రమాదానికి గురై మళ్ళీ భార్యా భర్తలిద్దరూ బ్రతికి బయట పడ్డారు .అప్పుడు ఆయన ‘’My luck –she is still running good ‘’అన్నాడు .

 హెమింగ్వే ఏదిరాసినా సంచలం సృష్టించింది .విమర్శకులు తమపని తాము చేసుకుపోతున్నారు .ఆయన క్యూబా లో  పూర్వపు యుద్ధ విలేకరి నాలుగవ భార్య మేరీ వెల్ష్ ని 1946 లో పెళ్లి చేసుకొని తో హేపీ హేపీ గా ఉన్నాడు. అతని శైలి గొప్పతనం గురించి చెప్పలేక పోతున్నారు.ఫోర్డ్ మాడాక్స్ ఫోర్డ్ ‘’ Hemingway ‘s words strike you ,each one as if they  were pebbles fetched fresh from a brook ..They live and shine each in its place .’’అని గొప్ప విశ్లేషణ చేశాడు .జీవద్భాష తో ఆయన మాటలు ఒక దానితో ఒకటి పోటీ పడతాయి .’’His style is distinctly the man hard ,clean ,close clipped persistently masculine –his very adjectives  are appropriately ,even aggressively athletic and accurate .’’ఇంతటి గొప్ప రచయిత అయినా ఆయన చదువురాని బాస్కెట్ బాల్ ఆటగాడిలా మాట్లాడే వాడు .ఇది ఆయనలో పెద్ద లోపం .తాను  చావును చావుకోసం చూడనని చంపటం అనేది తిరుగు బాటుకు ,దాని అమలుకు పోరాటభావన  అన్నాడు .

1950 చివరిదాకా రచన చేస్తూనే ఉన్నాడు .1959  లో స్పెయిన్ వెళ్లి లైఫ్ మేగజైన్ కు బుల్ ఫైటింగ్ పై పరిశోధనాత్మక వ్యాసాలు రాశాడు .1960 లో క్యూబా వెళ్లి ‘’లైఫ్ ‘’కోసం పది వేలమాటల రచన ప్రారంభిస్తేఅది విపరీతంగా పెరిగి పోయింది .హాచ్నర్ సాయం తో దాన్ని నలభై వేలమాటలకు కుది౦చాడు .కాని ముద్రాపకులు  పూర్తీ స్క్రిప్ట్ ఇవ్వమని అడిగితే లక్షా ముప్పై వేల మాటలతో రాసిచ్చాడు .హెమింగ్వే దారి తప్పుతూ కంగారుగా ఉన్నట్లు అనిపించేవాడు .1960 జులై లో భార్యతోకలిసి క్యూబా వదిలాడు మళ్ళీ రాలేక పోయాడు .లైఫ్ మేగజైన్ ఫ్రంట్ కవర్ పేజి కోసం స్పెయిన్ వెళ్ళాడు .కొద్దిరోజుల్లో తీవ్రమైన జబ్బు చేసిందని చావు బతుకులలో ఉన్నాడని వార్తా ప్రసారమైంది .కాని భార్యకు ఆయనకులాసాగానే ఉన్నాడని కేబుల్ వచ్చింది .అక్కడ ఒక్కడే పక్కకే అంకితమై ఉన్నాడు .తాను  బ్రేక్ డౌన్ లో ఉన్నానని గ్రహించాడు .లైఫ్ మేగజైన్ లో ‘ డేంజరస్ సమ్మర్ ‘’1960 సెప్టెంబర్ లో మంచి రివ్యూలతో వచ్చింది .అక్టోబర్ లో స్పెయిన్ వదిలి న్యూయార్క్ చేరాడు .భార్య మేరి అపార్ట్ మెంట్ వదిలి వెళ్ళనన్నాడు తనమీద ఎవరో నిఘా ఉన్నారని అనుమాన పడ్డాడు .వెంటనే ఆమె ఇడాహోకు తీసుకువెళ్ళి డాక్టర్ కు చూపించింది .డబ్బు కోసం రక్షణ కోసం ఇబ్బందిపడ్డాడు .అమెరికా ఎఫ్ బి ఐ అనపై నిఘా పెట్టి౦ద నుకొన్నాడు .మేయో హాస్పిటల్ లో ఉన్నాడు .ఆరోగ్యం తగ్గగా జూన్ లో డిశ్చార్జ్ అయ్యాడు .1961 ఏప్రిల్ లో కేట్చెం చేరారు .మే లో ఆతనివద్ద పెద్ద షాట్ గన్ ఉన్నట్లు భార్య గ్రహించింది .భయపడి సన్  వాలీ హాస్పిటల్ లో చేర్పించింది .మళ్ళీ మేయో లో చేరి షాక్ ట్రీట్మెంట్ తీసుకొన్నాడు .జూన్ లో డిశ్చార్జ్ అయి 30 కి ఇంటికి వెళ్ళాడు .19 61 జులై 2 న తన డబుల్ బారెల్ షాట్ గన్ తో కాల్చుకొని చనిపోయాడు .

చనిపోయేముందు హెమింగ్వే పరిస్థితి తండ్రి ఆత్మ హత్య చేసుకొన్నా దాని లాగానే ఉంది .హీమో క్రోమాటిస్  అనే మానసిక వ్యాధి తండ్రినుంచి ఆయనకు సంక్రమించింది .హీమో క్రోమోటాసిస్ కూడా ఉందని ఆయన అమితంగా తాగేవాడని  ఆ తర్వాత రిపోర్ట్ లలో తేలింది .ఆయన సోదరి సోదరుడు కూడా ఆత్మహత్య తోనే చనిపోయారు .

Hemingway’s style was fundamentally shaped “in reaction to [his] experience of world war”. After World War I, he and other modernists “lost faith in the central institutions of Western civilization” by reacting against the elaborate style of 19th-century writers and by creating a style “in which meaning is established through dialogue, through action, and silences—a fiction in which nothing crucial—or at least very little—is stated explicitly.”[18]

Hemingway learned to “get the most from the least, how to prune language, how to multiply intensities and how to tell nothing but the truth in a way that allowed for telling more than the truth.”[168] Hemingway called his style the Iceberg Theory: the facts float above water; the supporting structure and symbolism operate out of sight.[168] The concept of the iceberg theory is sometimes referred to as the “theory of omission”. Hemingway believed the writer could describe one thing (such as Nick Adams fishing in “The Big Two-Hearted River”) though an entirely different thing occurs below the surface (Nick Adams concentrating on fishing to the extent that he does not have to think about anything Hemingway habitually used the word “and” in place of commas

Fiedler believes Hemingway inverts the American literary theme of the evil “Dark Woman” versus the good “Light Woman”. The dark woman—Brett Ashley of The Sun Also Rises—is a goddess; the light woman—Margot Macomber of “The Short Happy Life of Francis Macomber“—is a murderess.[181] Robert Scholes admits that early Hemingway stories, such as “A Very Short Story“, present “a male character favorably and a female unfavorably”.[184] According to Rena Sanderson, early Hemingway critics lauded his male-centric world of masculine pursuits, and the fiction divided women into “castrators or love-slaves”.

Inline image 1

Inline image 2Inline image 3

  సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-7-16 –ఉయ్యూరు


గబ్బిట దుర్గా ప్రసాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.