ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -237 87- ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్-2(చివరి భాగం )

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -237

87- ,అమెరికా విస్తృత జీవిత శక్తుల ప్రతీక –ధామస్ ఉల్ఫ్-2(చివరి భాగం )

ఉల్ఫ్ మరణానంతరం ప్రచురింప బడిన ‘’వెబ్ అండ్ ది రాక్ ‘’,యు కం నాట్ గొ హోం అగైన్ ‘’లోను గాంట్-వెబర్ పాత్రను కాలం తో బాటు మారి ముసలితనం తో ఉన్నట్లు చిత్రించాడు .ఆపాత్ర దయనీయంగా ,వాస్తవ విరుద్ధంగా ,ఒక్కోసారి పారనయిక్ గా కనిపిస్తుంది .అతడు అతనికంటే ఎక్కువ వాడనిపిస్తాడు .తన బలహీనలతలు తెలిసిన వాడు .ఆత్మసానుభూతి ని అవహేళనతో జోడించాడు .ఆతను అమెరికా ఆర్టిస్ట్ గా కాక అమెరికా చిహ్నంగా దర్శనమిస్తాడు .పాతను నిరాకరిస్తూ ,తమదికాని సంప్రదాయాన్ని కాదంటూ ఎమర్సన్ విట్మన్ లలాగా దుఃఖిస్తూ ఆ దేశం లోనే ఆ మట్టి తోనే తమ జీవితాలను తామే వెలిగించుకొంటూ ,శక్తి సామర్ధ్యాలు సమకూర్చుకొంటూ ,తమ భాషా సంస్కృతులను కాపాడు కొంటూ ,తమ కళా సారాన్ని అనుభవిస్తూ జీవించాలి అనే సందేశం కనిపిస్తుంది .

  ఈ విషయాన్ని రూపు చెందించే సమయం ఆయనకు లేక పోయింది .తన ఆకలి హృదయాన్ని సంతృప్తి పరచలేక పోయాడు .’’Billion forms of America ,the savage violence ,and the dense complexity of all its swarming life ‘’ను రూపొందించ లేక పోయాడు .1938 జులై లో జబ్బుపడి మందుకు అలవాటుపడ్డాడు .న్యుమోనియా వచ్చి కోలుకొంటూ కాంప్లికేషన్స్ పెరిగి సెరిబ్రల్ ఇన్ఫెక్షన్ ఏర్పడి  ఆపరేషన్ చేయాల్సి వచ్చి  .బాల్టిమోర్ లో జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్ లో 15-9-1938 న 38 వ పుట్టిన రోజు 15 రోజుల్లో వస్తుందనగా ధామస్ ఉల్ఫ్ చనిపోయాడు .ఆయన తప్పులు చాలా ఉన్నాయి వాటి నిగ్గు తేల్చాల్సింది విమర్శకులే .’’one can only respect Wolfe for his determination to realize himself on the higher level and to be satisfied with nothing short of greatness ‘’అన్నాడు బెర్నార్డ్ డీ వోటో.అతని రచనా సర్వస్వం ఆవేశాత్మక ప్రక్రియ (ఫోర్సింగ్ ప్రాసెస్ ).అతను చెప్పిన ప్రతి మాటలో ఇంతకూ ముందు యే మానవుడూ భూమి మనిషి గూర్చి చెప్పని అద్భుత ఆశ్చర్య కర విషయాలున్నాయి  .ప్రపంచం మొత్తం మీద వీటిని ఇంత గొప్పగా అర్ధం చేసుకొని ఇంత అద్భుతంగా చెప్పిన వారు లేరు అనిపిస్తాడు .అతనిది హింసాత్మక ప్రయత్నచరిత్ర  అంటారు (వయలెన్స్ ఎండేవర్ ).అతని వెబ్ అండ్ ది రాక్ అతని రచనల్లో గొప్పది అన్నాడు జేబీ .ప్రీస్త్లి .

తప్పులెన్నిఉన్నా రచనలో శిఖరారోహణ చేశాడు ‘’I believe that we are lost in America ‘’అని అరిపిస్తాడు నిజమైన అమెరికాను ఆవిష్కరించే పని మనది అన్నాడు .The true discovery of America is before us .I think the true fulfillment of our spirit ,of our people ,of our mighty and immortal land ,is yet to come ‘’అని కలవరి౦చిన వాడు ధామస్ ఉల్ఫ్ .ఎంతో కస్టపడి ఎంతో దూరం ప్రయాణించి సంపూర్ణత్వం సాధించాడు .ఆయన కాల దేశాలకు అతీతమైన భావన ఉన్నవాడు .శైలిని తృణీకరించి ,అనుభవ సారాన్ని మానవ హృదయ భారాన్ని ఒక గుండు సూది మొనమీదనిలబెట్టిన వాడు .’’నేను కవిగా నే ఉంటాను తప్ప ఇంకా ఏదీ కాను ‘’అన్నాడు .ఉల్ఫ్ మరణానంతరం విడుదలైన రెండు పుస్తకాలు ‘’ది ఫేస్ ఆఫ్ ఎ నేషన్ ‘’,అనేది కవితా సంపుటి .’’ఎ స్టోన్ ,ఎ లీఫ్ ,ఎ డోర్ ‘’అనే వచనాలను కవిత్వీకరించిన సంపుటి .సహజ కవి అయినా వచన మాధ్యమాన్ని ఎంచుకొన్నాడు .తాను  కవి అని ఆయనే గుర్తించలేక పోయాడు .’’లుక్ హోం వర్డ్ ఏంజెల్ ‘’లో నగ్న సౌందర్య కవిత్వాన్ని ఒలక బోశాడు .ఆ కవితా వైభవాన్ని చూద్దాం –

‘’Which of us has known his brother ?which of us has – -looked into his father’s heart ?which of us has not –remained forever prison pent ?which of us is not-forever  a stranger and alone ‘

అతని కవితా శైలి పై లూయీ అంటర్ మేయర్ ‘’Wolfe ‘s diffuse style ,such a passage is so perfectly shaped ,so classic in design ,that its clear and almost formal rhythms reveal ,the spirit free of the heavy flesh .They speak for the clairvoyant poet ,beyond life out living death ,completed and fulfilled ‘’అని ఖచ్చితంగా ఎస్టిమేట్ చేశాడు .తన తరానికి మహా గొప్ప ప్రతిభ ఉన్నవాడు ఉల్ఫ్ అన్నాడు విలియం ఫాక్నర్ .బీట్ జెనరేషన్ కు చెందినజాక్ కరౌక్ ,రే బ్రాడ్ బరి ,ఫిలిప్ రాత్ బెట్టి స్మిత్  లపై ఉల్ఫ్ ప్రభావం చాలా ఎక్కువ .స్వీయ చరిత్ర రాసిన  వారిలో  సర్వ ప్రధముడు ఉల్ఫ్ .నార్త్ కరోలీనాకు చెందిన మహా రచయిత .అతని ప్రసిద్ధ పద బంధం ‘’ఫియర్ అండ్ లోదింగ్ ‘’భయం ,ద్వేషం ‘’.

ధామస్ ఉల్ఫ్ సొసైటీ ఏర్పడి ఆయన సాహిత్యాధ్యయనానికి కృషి చేస్తోంది .నార్త్ కరోలిన లోని ఆయన ఇల్లు ఎస్టేట్ జాతీయ సంపదగా రక్షింప బడుతోంది .యెన్ సైక్లో పీడియా   బ్రిటాన్నికా లో ‘’Wolfe was gifted with the faculty of almost total recall, and his fiction is characterized by an intense consciousness of scene and place, together with what is often an extraordinary lyric power. In Look Homeward, Angel and Of Time and the River, Wolfe was able to imbue his life story and the figures of his parents with a lofty romantic quality that has epic and mythopoeic overtones. Powerful emotional evocation and literal reporting are combined in his fiction, and he often alternates between dramatically effective episodes of recollection and highly charged passages of rhetoric. Though The Web and the Rock and You Can’t Go Home Again contain episodes of great vividness, they are too often uncontrolled in their form and fail to sustain the epic tone of Look Homeward, Angel, which has become an American classic.’’అని రాశారు .అయన కోటబుల్ కోట్స్ కొన్ని చూద్దాం –

Culture is the arts elevated to a set of beliefs.

One belongs to New York instantly. One belongs to it as much in five minutes as in five years.

The reason a writer writes a book is to forget a book and the reason a reader reads one is to remember it.

Inline image 1  Inline image 3
Inline image 2                   ఉల్ఫ్ ఎస్టేట్

Inline image 4Inline image 5Inline image 6Inline image 7

     సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-16- ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.