ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -238 88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి- ఆండ్రూ మాల్రక్స్

   ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -238

88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి-  ఆండ్రూ మాల్రక్స్

యాభై రెండేళ్ళ వయసులో నవలాకారుడు రాజకీయ వేత్త ,వామ భావాలనుండి,రియాక్షనరి కుడి భావాలకు మారి ,అమెరికా వెళ్లి రాజకీయాలు మానవ మనుగడను భయపెట్టిబెదిరిస్తున్నాయని ,కళ ఒక్కటే అందర్నీ కలిపి ఉంచే ఏకైక సాధనాం అని చెప్పిన వాడు ఫ్రెంచ్ నవలా కారుడు  ఆండ్రే మాల్రక్స్ .ఈ విషయాన్ని తన ‘’ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ ‘’మ్యూజియం వితౌట్ వాల్స్ ‘’లో చెబుతూసంపూర్ణ కళ తప్ప  అన్ని సంపూర్ణ విషయాలు అదృశ్యమైపోతాయి అన్నాడు.నూతన మానవత్వం ,ఆధ్యాత్మిక వాస్తవం ,కళ  ‘’నూతన మతంలో ఒక భాగం .ప్రతి ఉద్గ్రంధమూ  సూటిగానో ,బహిర్గాతంగానో గుడ్డి విధి పై మానవ విజయాలను తెలియ జెప్పేవే .కళాకారుడు తన శక్తితో తెలుసుకొని ఆవిష్కరిస్తాడు .దానికి మానవత్వ పలుకుబడిని కలిగిస్తాడు .కాల గర్భం లో కలిసి పోకుండా నిలిచినా అవన్నీగడచి పోయిన  మానవ నాగరకత యొక్క లోపలి స్వరాలే (ఇన్నర్ వాయిస్ ).ఈ సజీవ ,ఇంకా అమరం కాని  దేవతలను చేరే స్వరం దాని సాఫల్యత కోసం అవిశ్రాంత మరణ వాద్య బృందమే అవుతుంది .అన్ని నాగరకతల కళ లో ఇది సర్వ సాధారణం .అది దైవ ఘటన కు వ్యతిరేకమైన రక్షణనె వ్యక్త పరుస్తుంది ‘’అన్నాడు మాల్రక్స్ .

  మాల్రక్స్ చెప్పే ‘’డిఫెన్స్ ఎగైనెస్ట్ ఫెటాలిటి’’అతనిలో భిన్న రూపాలద్వారావ్యక్తమైంది .అనేక జీవుల ఉద్ధరణకు దారి తీసింది .3-11-1901 న మాల్రక్స్ పారిస్ లో పుట్టాడు .తండ్రి సమర్ధుడైన సంపన్నుడైన సివిల్ ఉద్యోగి .కొడుకు ఉన్నత విద్య లో  రాణించాలనుకొన్నాడు .లైసె కాండో ర్సేట్ లో క్లాసిక్స్ చదివి పారిస్ స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ లాంగ్వేజెస్ లో చేరి సంస్కృత ,చైనా భాషలతో పాటు ఆర్కియాలజీ కూడా క్షుణ్ణం గా నేర్చాడు .ఇరవై వ ఏట మొదటి వచన పద్యాన్ని రాసి ప్రచురించాడు .జర్మన్ జ్యూయిష్ ఫైనాన్సేర్ కూతురు క్లారా గోల్డ్ ష్క్మిత్ ను పెళ్లి చేసుకొన్నాడు .23 వ ఏట ఇండో చైనాకు తండ్రితో వెళ్లి ఆర్కియాలజికల్ పరిశోధనలో గడిపాడు .పురాతన స్థలాలను త్రవ్వించి శిధిల దేవాలయాలను ,భూ గర్భం లోని బౌద్ధ శిల్పాలను వెలికి తీయించాడు .ఏడాది కాలం ఈ పనిలో గడిపి గతం పై బోర్ కొత్త వర్తమానం పై అభిరుచితో కాలనీ ప్రజల స్థితి గతుల అన్వేషణలో పడ్డాడు .’’అన్నమైట్ తిరుగు బాటు ‘’కు ఆకర్షితుడై ‘’అన్నాం లీగ్ ‘’లో చేరి దాని స్వాతంత్ర్య పోరాటం లో భాగస్వామి అయ్యాడు .చైనా సరిహద్దు దాటి లోపలి ప్రవేశించి మాల్రక్స్ రాజకీయాలలో పూర్తిగా మునిగిపోయాడు .1925 నేషనల్ లిబరేషన్  ఉద్యమం లో పాల్గొని సన్యట్ సేన్ స్థాపించిన కోమిటాంగ్ లో చేరి అసోసియేట్ సెక్రెటరి జనరల్ అయ్యాడు .చాంగ్ కై షేక్ సహ సభ్యుడుగా ఉన్న కమిటీ ఆఫ్ ట్వెల్వ్ లో పని చేస్తూ కాంటన్ తిరుగు బాటులో పాల్గొని కోమిటాంగ్ కు కమ్యూనిస్ట్ పార్టీ ల సయోధ్య కుదిర్చాడు .అతని వాగ్ధాటి ,ఉత్సాహం గుర్తింప బడి క్వా౦ టంగ్ క్వాన్ గ్సి ప్రాంతాల ప్రాపగాండా కమీషనర్ గా నియమింప బడ్డాడు .26 వ ఏట పూర్తీ తిరుగు బాటు దారుడని పించుకొన్నాడు .

   ఇండో చైనా ,షాంఘై ,హాంగ్ కాంగ్ లలో చూసిన దారుణ పరిస్థితులన్నీ మొదటి మూడు నవలలో చేరాయి అధికారానికి డిమాండ్ లు దానికోసం కార్యా చరణ వీటిలో కనిపిస్తాయి .’’ది కాన్కరర్స్ ‘’లో హీరో చైనాలో సోవియెట్  ప్రతినిధి .19 25 లో హాంగ్ కాంగ్ సమ్మె కు ప్రాపగాండా చేస్తాడు .దీన్ని ట్రాట్స్కి ‘’romanticized chronicle of revolution ‘’అన్నాడు .కాని మాల్రక్స్ అది వ్యక్తికీ సామూహిక చర్యకు ఉన్న సంబంధమేకాని సామూహిక చర్య మాత్రమే కాదు అన్నాడు .ఏడాది తర్వాత వచ్చిన ‘’ది రాయల్ వే’’లో కంబోడియాలోని పురాతత్వ విషయాలు న్నా అందులో మాల్రక్స్ ఏకాకి జీవితం ,మావుడు చావును జయి౦చలేని  స్థితి ,దానిపై తన అజాగ్రత్త వినాశకర శక్తి తో పోరాటం ఉన్నాయి .

మూడవ నవల ‘’మానస్ ఫేట్ ‘’మాల్రక్స్ ను అంతర్జాతీయ వ్యక్తిని చేసింది .మాస్టర్ పీస్ అనే పేరొచ్చింది .కాన్కోర్ట్ ప్రైజ్ సాధించింది .అన్ని జీవద్భాషలలోకి తర్జుమా అయింది .హెమింగ్వే లాగానే మాల్రక్స్ కూడా చావు ,హింస లానే ఎంచుకొన్నాడు .హెమింగ్వే లా కాక ప్రతి చర్యను సమర్ధించాడు దానికి కారణాలు అన్వేషించి చెప్పాడు .జనరల్ చాంగ్ కై షేక్ కు ,కోమిటాంగ్ కమ్యూనిస్ట్ పార్టీ కి మధ్య జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని నేపధ్యంగా రాసిన నవల ఇది ‘.షాంఘైలోని19 27 నాటి రెండు రోజుల  సంక్షోభాన్ని చాలా అన్వేషణాత్మకంగా ,నాన్యతో దర్శనీయంగా రాశాడు .’’డాస్టోవి స్కి ,గోర్కీ ల తర్వాత ఇంత వివరంగా ప్రజా సంక్షోభాన్ని వర్ణించిన పుస్తకం ఇదే ‘’అన్నాడు ఫిలిప్ హే౦ డేర్సన్..’’Malraux  ‘s people  are however not merely the products of their environment ,bitterly fighting their way to opposite goals but shares a philosophy –an acceptance of cruelty and its barriers against communication ,a determination to force the moment to its utmost ,and desperate affirmation of terror ,loneliness and sacrifice for some un definable but greater future .’’’ఇందులో జరుగుతున్నకాలం నిర్ణయాత్మకమైన కాలం అని ,ఒక జాతి భవిష్యత్తు మొత్తం కొద్ది మంది యుద్ధానికి సన్నద్ధ మౌతున్న ప్రచారకుల (ప్రాపగాన్డిస్ట్)లచేతుల్లోనే ఉంది అని పిస్తుంది .

Inline image 1   Inline image 2

సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-1-8-16 –ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.