ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23
88-విధి పై మానవ విజయాన్ని ,కళ కద మానవ కధే అని చెప్పిన ఫ్రెంచ్ రచయిత, మంత్రి- ఆండ్రూ మాల్రక్స్-2(చివరిభాగం )
మూడవ ఇంటర్నేషనల్ నుండి 1927 లో చాంగ్ కై షేక్ విడిపోయి కమ్యూనిస్ట్ లతో కలిసిపోయినప్పుడు మాల్రక్స్ యూరప్ తిరిగి వెళ్లి పోయాడు .అక్కడ చేతులు ముడుచుకొని కూర్చో లేదు .యాంటి ఫాసిస్ట్ ఉద్యమ నాయకుడై ,యూరప్ లోని అండర్ గ్రౌండ్ వర్కర్లకు ,అన్ని ప్రదేశాలలోని ‘’సామాన్య జన సమూహానికి సేవ చేయటానికి అంకితమయ్యాడు.’’డే ఆఫ్ రాత్’’లో ఫాసిజం సమస్యను నాటకీయం గా రాశాడు .ఇది మాన్స్ ఫేట్ కంటే విపరీతంగా కిక్ అయింది .ఇందులో కేంసేన్ పాత్ర అండర్ గ్రౌండ్ జర్మన్ మనిషి .కమ్యూనిస్ట్ ల జాబితాను ఇవ్వమని ఆయన్ను అడిగినప్పుడు తిరస్కరిస్తేతొమ్మిది రోజులు కటిక చీకటి జైలులో పెట్టారు ఎవరో ఒక బకరా కమ్యూనిస్ట్ తానె కాస్నేర్ అని ఒప్పుకున్నందున అసలు వాడిని విడుదల చేశారు .. మాల్రక్స్ సాంఘిక సేవ పేపర్లకే పరిమితం కాలేదు .పెద్ద పెద్ద బహిరంగ సభల్లో ఆవేశంగా నాజియిజం నిజాన్ని గురించి ,ముసోలిని బ్లాక్ షర్ట్ సాహసాల గురించి మాట్లాడే వాడు .అబిసీనియా పై క్రూర దాడిని నిరసించాడు .’’ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైటర్స్ ’’సంస్థను సంస్కృతీ పరిరక్షణకోసం ఏర్పరచాడు .
1936 లో మాల్రక్స్ మళ్ళీ విప్లవోద్యమ౦లో చురుకుగా పాల్గొన్నాడు .స్పెయిన్ కు ఫ్రాంకో డిక్టేటర్ అయినప్పుడు మాల్రక్స్ లాయలిస్ట్ లతో కలిశాడు .ఒక విమానం తీసుకొని మాడ్రిడ్ వెళ్లి విమానం నడిపే అనుభవం ఎక్కువ గా లేకపోయినా ధైర్యంగా ఫాసిస్ట్ సామ్రాజ్యం పై 65 దాడులు చేశాడు .ఆ దాడిలో రెండు సార్లు గాయ పడ్డాడు .స్పెయిన్ ముందుకు దూసుకు రాకుండా ఆపగలిగాడు .ఫ్రాన్స్ ,అమెరికాలలో ప్రయాణించి లాయలిస్ట్ లకు అండగా నిలవాలని ఆదేశాలను ఒప్పించి వారికి ధనసహాయం కోసం విరాళాలు సేకరించాడు .స్పానిక్ సివిల్ వార్ మొదటి దశ విషయాలన్నిటిని ‘’మానస్ హోప్స్ ‘’లో రాశాడు .వీదియుద్దాల భీభత్సం ,సాయుధ శ్రేణుల వీరోచిత పోరాటం అసలైన హీరో అయిన రిపబ్లిక్ ఆర్మీ విషయాలను చాలా ఖచ్చితంగా వర్ణించాడు .అనేక మంది ఇతర రచయితలలాగా రెండు పడవలలో కాళ్ళు పెట్టాడు అన్నారు .
మాల్రక్స్ కు ఈ మారటాలు మామూలే .స్టాలిన్ ను కొన్ని రోజులు ట్రాట్ స్కి ని కొన్ని రోజులు సమర్ధించాడు .మార్క్సిస్ట్ ల విజయోత్సవాలను ,వాళ్ళ పరాజయపరంపరాలను చూశాడు .రెండవ ప్రపంచ యుద్ధం లో టాంక్ దళం లో పేరు నమోదు చేయించుకొని ,అరెస్ట్ అయి ,తప్పించుకొని ,అండర్ గ్రౌండ్ మార్క్విజ్ ల తో చేరి పనిచేశాడు .యుద్ధం పూర్తీ అవగానే మాల్రక్స్ పూర్తీ రైటిస్ట్ ప్రభుత్వాన్ని సమర్ధించి తన అభిమానుల్ని అనుచరుల్ని విపరీతంగా ఆశ్చర్యం లో పడేశాడు .నియంత చార్లెస్ డిగాల్లీ ని సమర్ధించటం మరీ విడ్డూరం అని పించింది .విప్లవవాది డీగల్లీకి వ్యతిరేకి అయి యుద్ధాన్ని ద్వేషించాడని ఆయన యుద్ధ ప్రేమికుడని నింద మోపినప్పుడు మాల్రక్స్ ‘’నేను మారలేదు ప్రపంచం మారింది ‘’అని సమాధానమిచ్చాడు .బాహ్యంగా ఆయనలో పెద్ద మార్పేమీ లేదు .50 ఏళ్ళ వయసులో ఆయన నీలి కళ్ళు ఇంకా జ్వలిస్తూనే ఉన్నాయి .జుట్టు నల్లగా నిగ నిగ లాడుతూ ,మూతి మాత్రం ఇదివరకటి కంటే బిగుసుకు పోయి కనిపించాడు .
భార్య క్లారాతో వివాహ జీవితం సమాప్తమై విడాకులు తీసుకొన్నారు .రచయిత్రి జోసేట్టి క్లోటిస్ ను పెళ్ళాడాడు .ఇద్దరు పిల్లలు పుట్టారు .ఆమెరైలు ప్రమాదం లో చనిపోయింది .మూడో పెళ్లి హాఫ్ బ్రదర్ రోలాండ్ భార్య మేరీ మెడలీన్ ను చేసుకొన్నాడు .రోలాండ్ గెస్టపోలో ,మరో హాఫ్ బ్రదర్ క్లాడ్ రెసిస్టన్స్ మూవ్ మెంట్ లో చనిపోయారు .1953 లో అ౦తగా ఉత్తేజం ఇవ్వని ‘’ది వాయిసెస్ ఆఫ్ సైలెన్స్ ‘’ప్రచురించాడు .మనిషి ,అతని ఆర్టిస్టిక్ కళా చిత్రాన్ని నియో లిథిక్ కాలం నుంచి ఆధునికకాలం వరకు రాసి ‘’ది సైకాలజీ ఆఫ్ ఆర్ట్ ‘’పేరుతొ ప్రచురించాడు .’’All art Malraux implies is a revolt ,a protest against extinction ,a rebellious act against death and man’s tragic mortality .మాల్రక్స్ద్రుస్తిలో కళ కదా అంటే మనిషి కద కూడా .
రెండవ ప్రపంచ యుద్ధకాలం లో మాల్రక్స్ చివరి నవల ‘’ది స్ట్రగుల్ విత్ ది ఏంజెల్ ‘’రాశాడు .యుద్ధం తర్వాత ప్రెసిడెంట్ డీగల్లి 1945 లో మాల్రక్స్ ను ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ను చేశాడు .సైకాలజీ ఆఫ్ ఆర్ట్ పై మూడు పుస్తకాలు రాశాక మూడిటిని కలిపి కొంత మార్చి ఒకే పుస్తకంగా తెచ్చాడు .1958 లో దీగాల్లి మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాక మాల్రక్స్ ను మొట్టమొదటిసారిగా కల్చరల్ ఎఫైర్స్ మినిస్టర్ ను చేశాడు .నల్లకప్పేసిన పురాతన ఫ్రెంచ్ బిల్డింగ్ లను శుభ్రపరచి రంగులతో శోభాయమానం చేశాడు .ఫ్రాన్స్ దేశ జాతీయ వారసత్వాన్ని కాపాడే అనేక చర్యలు తీసుకొన్నాడు .1957 లో ‘’మెటా మార్ఫసిస్ ఆఫ్ ది గాడ్స్ ‘’మూడు భాగాలలో మొదటిది ప్రచురితమైంది .మిగిలిన రెండు భాగాలు ఆయన మరణానంతరం వెలువడ్డాయి .బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమాన్ని మాల్రక్స్ సమర్ధించాడు .1971 లో భారత ప్రధాని ఇందిరా గాంధి పారిస్ సందర్శించినప్పుడు మాల్రక్స్ ఆమెతో బంగ్లా దేశ సమస్యను చర్చించాడు .యుద్ధానంతరం పాక్షిక జీవిత చరిత్రభాగాలు రాసి ప్రచురించాడు .పారిస్ దగ్గర క్రిటేల్ లో 23-11-1976 న మాల్రక్స్ 75 వ ఏట మరణించాడు .
మాల్రక్స్ అనేక అవార్డ్ లు పొందాడు అందులో ముఖ్యమైనవి –ప్రిక్స్ కాన్కర్ట్ అవార్డ్ ,మేదేల్లె డీ లా రెసిస్టన్స్ ,టాక్స్ డీ గేర్రే .అంతర్జాతీయ మాల్రక్స్ సొసైటీ అమెరికాలో ఏర్పడి౦ది .పారిస్ లోనూ ఇలాంటి సంస్థ ఏర్పడింది .మాల్రక్స్ కొటేషన్ లు కొన్ని చూద్దాం –
1- man is dead ,after God .
2- the artist is not the transcriber of the world ,he is its rival
3- what is man ? a miserable little pile of secrets .
4- Art is an object lesson for the gods
5- The art museum is one of the places that give us the highest idea of man .
మాల్రక్స్ దాదాపు 20 గ్రంధాలు రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-16 –ఉయ్యూరు .