ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -240
89-అస్తిత్వ ,ద్రుగ్విషయవాది ఫ్రెంచ్ ఫిలాసఫర్ –జీన్ పాల్ సాత్రే
ఫ్రెంచ్ నాటక నవలా కర్త, ఫిలాసఫర్ , రాజకీయ నాయకుడు ,జీవిత చరిత్రకారుడు ,అస్తిత్వ వాద ద్రుగ్విషయ వాదసిద్ధాంత మూల పురుషులలో ఒకడు ,20 వ శతాబ్ది ఫ్రెంచ్ ఫిలాసఫీ మార్క్సిజం లో నిష్ణాతుడు జీన్ పాల్ సాత్రే .ఆయన రచనా ప్రభావం సోషియాలజి,,క్రిటికల్ దీరీ ,పోస్ట్ కలోనియల్ దీరీ ,లిటరరీ స్టడీస్ ల పై గొప్ప ప్రభావం చూపాయి .
సోరెన్ కర్క్ గార్డ్ ఫిలాసఫీ అనేక విరుద్ధ విషయాలను ప్రతిపాదించింది .ముఖ్యంగా మానవుడు దేవుని సమీపిస్తున్నకొద్దీ శూన్యం దగ్గరకు చేరతాడు ,ఈ శూన్యం అతని అస్తిత్వ వాదసాఫల్యమే .కర్క్ గార్డ్ మరణించిన వందేళ్ళకు మానవ అస్తిత్వ సమస్య ఆధునిక యుగం లో రెండు విభిన్న సిద్ధాంతాలకు దారి తీసింది .అందులో మొదటిది –మానవునికి ప్రాధమికంగా విశ్వాసం ఉండాలని మత సాంప్రదాయాలను పాటించాలన్నది ,దాని సారాంశం గ్రహి౦చాలన్నది . రెండవది –అసలు దేవుడూ గీవుడూ’’ జంతా నై ‘’అంటూ అన్ని సువార్తలను ,మెటా ఫిజికల్ జ్ఞానాలను పూర్తిగా తిరస్కరించి అస్తిత్వ వాదననే నమ్మటం అనేది .రెండవ సిద్ధాంతానికి మళ్ళీ రెండు భిన్నమార్గాలు ఏర్పడి విమర్శకులు కూడా రెండు గుడారాలలో చేరారు .ఫిలాసఫీలో కొత్త నిష్క్రమణ అని ,అసలు ఫిలాసఫీ తిరస్కరించటమేనని ,అన్నారు .కొత్త విభేదం వచ్చినప్పుడల్లా అస్తిత్వ వాదం మహా వేగంగా పెరిగింది .దాని మూల ద్వేషం నిరాశ మూలాలపై ఆధార పడింది .1940 లోరెండవ ప్రపంచ యుద్ధం తో ఏర్పడిన ఆశారాహిత్యం తో ఇది వెంటనే ప్రాభవం పొంది౦ది .దీనికి ప్రేరణ జీన్ పాల్ సాత్రే వల్లనే జరిగింది .
5-6-1905న పారిస్ లో జన్మించిన సాత్రే బాల్యం నుంచి ఫిలాసఫీ ని ఇష్టపడటం విశేషం .ఈకోల్ నార్మేల్ లో చదివి 25 ఏళ్ళకే డిగ్రీ పొంది ,పారిస్ లోని లీ హార్వే ,లయాన్ లలో ఫిలాసఫీ బోధించాడు .30 లలో జర్మని ,ఇటలి స్పెయిన్ ,గ్రీస్ ,ఇంగ్లాండ్ లలో పర్యటన చేసి,రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో ఆర్మీలో చేరాడు .1939 లో ఆల్సేస్ లోఆర్టిలరి అబ్సర్వర్ గా ఉన్నాడు .ఏడాది తర్వాత బందీ అయి జర్మన్ జైలు లో 9 నెలలు గడిపాడు .ఎలాగోలాతప్పించుకోనిఫ్రాన్స్ అధీనంకాని జోన్ కు చేరి ,35 వ ఏట టీచింగ్ చేశాడు .నాజీ ప్రభుత్వం ఫ్రాన్స్ దేశాన్ని కబళించినప్పుడు సాత్రే పారిస్ లోనే ఉండిపోయి అండర్ గ్రౌండ్ లో రెసిస్టన్స్ మూవ్మెంట్ ‘వాళ్లకు రిస్క్ తీసుకొని సహాయం చేశాడు .
ఈ పరిస్థితులోనే సాత్రే తన స్వంత’’ పారడాక్స్ ఫిలాసఫీ ‘’పై ఆలోచించి రూపు దిద్దాడు.ఇందులో ముఖ్య విషయం ‘’బయటి అణగార్చే తనం వలననే విముక్తి శక్తి ఏర్పడుతుంది .అది మానవులోని లోపలి మనిషిని తనకు రోజూ ఏదికావాలంటే అది చేసుకోనేట్లు చేసి తెగించే నిర్ణయాలను చేయిస్తుంది .సాత్రే ‘’రిపబ్లిక్ ఆఫ్ సైలెన్స్’’గ్రంధం రాశాడు .ఇందులో ‘’జర్మన్లు ఆక్రమించినప్పుడు మేము పొందిన స్వేచ్చ అంతకు ముందు ఎప్పుడూ పొందలేదు మా హక్కులన్నీ హరి౦చేశారు .మాట్లాడే హక్కుతో సహా .ప్రతి రోజు మమ్మల్ని మా ముఖమీదే అవమానిస్తున్నారు .వాటిని మేము మౌనంగా భరించాం ఏదో ఒక నెపంతో వర్కర్లుగా జ్యూలుగా రాజకీయ ఖైదీలుగా మమ్మల్ని సామూహికంగా దేశంనుంచి బహిష్కరించారు .నోటీస్ బోర్డు లపైనా , వార్తాపత్రికలలో ,సినిమాహాళ్ళలో మమ్మల్ని అతి నీచంగా అవమానకరంగా చిత్రింఛి మేము ఆ అణగార్చే ముఠాకు లొంగి పోయేట్లు,వాళ్ళ మాట వినేట్లు చేసే ప్రయత్నాలన్నీ చేశారు .అందుకే వీటన్నిటి వలన మేము ఫ్రీగా ఉన్నాం .నాజి విషం మా ఆలోచనల్లోకి ఎక్కిపోయింది .ప్రతి సరైన ఆలోచనా ఒక విజయమే అయింది .అన్నిరకాల అంతమంది పోలీసులు మా నోళ్ళు మూయించటానికి విశ్వ ప్రయత్నం చేసినా ,మా లోంచి వచ్చిన ప్రతిమాట ఒక సిద్ధాంత విలువగా ప్రకటిత మైంది .మమ్మల్ని వేటాడి పడ గొట్టటం వలన ,మాలోని ప్రతి కవళికఒక గట్టి నిబద్ధతకు బలాన్నిచ్చింది .’’అంటాడు తీవ్ర స్టాయిసిజం తో .’’వాళ్ళ హింసలు ,దౌర్జన్యదురాగతాలు కూడా మాకు హాయిగా జీవించే స్థితి కల్పించాయి .భ్రమ ,అబద్ధపు అవమానం ,భయంకర బతకలేనితనం అన్నీ మాకు మానవ అదృష్టంగా కలిసి వచ్చాయి ‘’అన్నాడు సాత్రే .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-8-16-ఉయ్యూరు