ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -245 (చివరి ఎపిసోడ్ )
91-జ్వలించే విప్లవ భావం ,సాటిలేని శయ్యా సౌభాగ్య శాలి నియోరొమాంటిక్ సర్రియలిస్ట్ కవి –డిలాన్ ధామస్ -2(చివరిభాగం )
35 వ ఏట ‘’నేను ముసలి ,చిన్న ,నల్ల ,తెలివైన వాడుగామిలమిల మెరిసే కళ్ళతో జుట్టురాలిపోయి పళ్ళూడి పోయిన వాడిగా ఉన్నాను ‘’ అని చెప్పుకొన్నాడు .బలంగా,లావుగా ఉన్నా చురుకుగా కదిలేవాడు .మూడో సారి అమెరికా వెళ్ళినప్పుడు ఇగార్ స్ట్రా విన్స్కి తోకలిసి ఒక ఒపెరాకు పని చేయాలనుకొన్నాడు .కద ముందే సిద్ధం చేసుకొని సంగీతం కాలిఫోర్నియాలో కూర్చాలనుకొన్నారు .అతని ‘’కలేక్టేడ్ పోయెమ్స్ ‘’అప్పుడే సెన్సేషనల్ విజయం సాధించింది .న్యూయార్క్ లో 39 వ పుట్టిన రోజు ను ఘనంగా సంతోషంగా జరుపుకొన్నాడు .సంబరాలు అంబరాన్ని అంటుతున్న సమయం లో తీవ్రంగా జబ్బు పడ్డాడు .వెంటనే సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు .అక్కడ మెదడుకు సంబంధించిన ‘’యెన్ సెఫలో పతి ‘’అనే జబ్బు తో బాధ పడుతున్నట్లు నిర్ధారించారు .సుమారు రెండు వారాలలోపే డిలాన్ ధామస్ 9-11-1953 న మరణించాడు .
ధామస్ ఇరవై ఏళ్ళ లోపే ‘’యైటీన్ పోయెమ్స్ ‘’అచ్చు అయింది .స్విన్ బరన్ కవిత్వమా అనిపించింది .అణ గారిన నాగరకత ,సాక్సన్ వెలుగున్న సెల్టిక్ నీడ అతనికవిత్వం లో కనిపిస్తుంది .అతని ముందు మూడు పుస్తకాలను కలిపి ‘’ది వరల్డ్ ఐ బ్రీత్’’పేర ఒకే పుస్తకంగా తెచ్చారు .డిలాన్ ను అత్యద్భుత నవ కవిత్వ సృష్టికర్త గా గుర్తించి అతని కవిత్వాన్ని సర్రియలిజం కవిత్వం అన్నారు .వీటిలో పగటికలలు ,సబ్ కాన్షస్ లో విహారం కనిపిస్తాయి .ఫ్రాయిడ్ ప్రభావమూ ఉంది .’’poetry is the rhythmic ,inevitably narrative ,movement from an over clothed blindness to a naked vision .Poetry must drag further into the clear nakedness of light more even of the hidden cause than Freud could realize ‘’అంటాడు ధామస్ .చనిపోవటానికి ఏదాదిముందు అచ్చు అయిన ‘’ఇన్ కంట్రీ స్లీప్ అతనే చెప్పినట్లు ‘’record of my individual struggle from darkness toward some measure of light .To be stripped of darkness is to be clean ,to be stripped of darkness is to be clean ,to strip of darkness is to make clean ‘’.
చివరి రచన ‘’అండర్ మిల్ వుడ్ ‘’బి బి సి లో ప్రసారం కావాల్సింది అమెరికాలో ప్రాభవం పొంది౦ది .ఇందులో ఒక మచ్చుతునక –‘’it is spring moonless night in the small town starless and –bible black ,the cobble streets silent and hunched –courtiers and rabbit’s wood limping invisible down to –the slow back ,slow ,black crow black ,fishing boat hobbing sea ‘’
లారెన్స్ బిన్యాన్ బ్లేక్ ద్విపదులలాగా కప్లేట్స్ రాశాడు ,-‘’the spirit born to bless –lives but in its own excess ‘’
పేదరికం లో గడిపిన ధామస్ డబ్బు సంపాదించటం ఎట్లాగో తెలియదు .తాను ‘’I want to write only poems of God ‘s world –by a man who does not believe in God ‘’అంటాడు డిలాన్ .వేర్నార్ వాట్కిన్సన్ ఇచ్చిన పారితోషికానికి కృతజ్ఞత తెలుపుతూ జాబు రాస్తూ ‘’మీరిచ్చిన గుండ్రని సిల్వర్ ట్రాష్ ‘’ను నేను అమ్ముకొంటే నెల రోజుల గ్రాసం లభిస్తుంది ‘.నా లాంటి వాడు చేతిలో పెన్నీ లేకుండా జీవించటం దారుణం ‘’అన్నాడు .ధామస్ చనిపోయాక ప్రాభవం మరింత పెరిగింది ,అతని చిన్న కధలు బాగా క్లిక్ అయ్యాయి .అతని రచనలో బాల్యం ,సెక్స్ సామర్ధ్యం ,కల్లోల మత౦ చావు లే విషయాలు .’’My world was christened in a stream of milk and earth and sky were alone airy hill –I dreamed my genesis in swear of sleep ‘’అంటాడు .అండర్ మిల్క్ వుడ్ బి బి సి లో ప్రసారం కావాల్సింది 1953 లో అమెరికాలో అయింది .ఇందులోని రెండు భాగాలను ధామస్ స్వంత గొంతుకతో చదివాడు .తనకవిత ప్రతిదాంట్లోనూ మనిషి ప్రేమ ,దేవుని ప్రస్తుతి ఉంటాయని అవే లేక పోతే తాను నిరర్ధక జీవినే అవుతానని చెప్పుకొన్నాడు .అతడు చదువుతుంటే విశ్లేషణకు అందనంత వేగంగా దూసుకు పోతుంది కవిత్వం. అదే ఆయన ప్రత్యేకత.
ధామస్ ను చిరంజీవిని చేసిన కవితలు ‘’డు నాట్ గొ జెంటిల్ ఇన్ దట్ గుడ్ నైట్ ‘’,’’ఎ డెత్ హావ్ నో డొమినియన్ ‘’నాటకాలు ‘’ప్లే ఫర్ వాయిసెస్ ‘’,’’అండర్ మిల్క్ వుడ్ ‘’లు ,.ఏ సాహిత్య ముఠా కు చెందనివాడు ధామస్ .నియో రొమాంటిక్ ,ఫ్రాయిడ్ ప్రభావం వెల్ష్ జాతీయ ప్రభావం ఉన్నవాడు .అమెరికా వెళ్ళినప్పుడు ధామస్ హార్డీ కవితల్ని ఆయనకే చదివి వినిపించినవాడు .వెల్ష్ జాతీయుడేకాని దాని జాతీయత పై అంతగా ఇష్టం లేనివాడు .ఆ జాతీయతను ‘’హిల్ ఫారం మొరాలిటి ‘’అంటాడు .శబ్ద ప్రయోగం లో అందేవేసిన కవి .పోతనకవి లాగా చెవులకింపైన పద ప్రయోగం చేసి మనసులను ఆకర్షిస్తాడు ధామస్ సమాధిపై ఆయనే రాస్సుకొన్న కవితను చెక్కించి ఘన నివాళి సమర్పించారు –‘’Not for the proud man apart from the raging moon I write on these spindrift pages not for the towering dead with their right angles and psalms but for the lovers ,their arms round thee griefs of the ages who pay no heed my craft or art ‘’
సమాప్తం
‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’సంపూర్ణం
ఆధారం –లూయీ అంటర్ మేయర్ రాసిన ‘’మేకర్స్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ ‘’
మనవి –సుమారు సంవత్సరన్నర క్రితం రాయటం ప్రారంభించిన ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’ధారావాహిక 245 ఎపిసోడ్ లలో 91 మంది ప్రముఖుల జీవితాలను గురించి రాసే అదృష్టం నాకు దక్కింది .ఈపుస్తకాన్ని నాకు నామీద అభిమానం తో ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా )నేను కోరిందే తడవుగా కొని నాకు 20-10-2014న అందేట్లుగా పంపారు .వెంటనే చదవటం ప్రారంభించి760 పేజీలున్న ఈ బృహత్ గ్రంధాన్ని 23-1-2015 నాటికి చదివి పూర్తీ చేశాను .వెంటనే దీన్ని తెలుగులో రాస్తే బాగుంటుంది అనిపించి శ్రీ గోపాల కృష్ణ గారికి మెయిల్ రాస్తే ‘’నేనే చెబుదామనుకోన్నాను .మీకూ అదే ఆలోచన వచ్చింది కనుక ప్రారంభించండి ‘’అన్నారు .వెంటనే అంతర్జాలం లో రాయటం ప్రారంభించాను .మధ్య మధ్య లో మరెన్నో వాటిపై దృష్టి పెట్టటం వలన సుమారు సంవత్సరంన్నర కాలం పట్టింది పూర్తీ అవటానికి .అంటర్ మేయర్ రైట్ సోదరులను విడివిడిగా రాసి 92 మంది తో పుస్తకం రాస్తే, నేను రైట్ సోదరులను ఇద్దర్నీకలిపి ‘రాయటం వలన సంఖ్య 91 అయింది .అంటర్ మేయర్ చాలా వివరణాత్మకంగా గ్రంధం రాశాడు .దాదాపు ఆయన చెప్పిన దానిని దేనినీ వదలకుండా నేను తెలుగులోకి తెచ్చాను .అయినా నాకు సంతృప్తి కలగక వీకీ పీడియా లో వెతికి మరింత సమాచారాన్ని చేర్చి సంతృప్తి చెందాను .అంత మాత్రం చేత ఇది సంగ్రమూ సంపూర్ణమూ అని నేను అనుకోవటం లేదు .ఇంకా చెప్పవలసింది విశ్లేషించ వలసినది చాలా ఉండే ఉంటుంది .ఆ మహానుభావులను పరిచయం చేయటానికే నేను ప్రయత్నం చేశాను .ఇందులో నాకు తెలియని వారు చాలా మందే ఉన్నారు .చాలామంది వీరి గురించి విని ఉండక పోవచ్చు .వీరంతా తమ కార్యకలాపాలతో ఆధునిక యుగ నిర్మాణానికి తోడ్పడినవారే .అన్ని రంగాలకూ చెందిన వీరి కార్య క్షేత్రాలు కళ, సంస్కృతీ, రాజకీయం, శిల్పం, సంగీతం నాట్యం వేదాంతం ఆర్కి టేక్చర్ ,కవిత్వం ,సినిమా, నాటకం ,సైన్స్ ,టెక్నాలజీ మొదలైనవి .ఏదో ఒక రంగం గురించి ఏదో కొంచెం ఆవగింజలో అరవై భాగం మాత్రమే తెలిసిన నాకు ఇన్ని రంగాల లోని విషయాలు తెలుసుకొని అర్ధం చేసుకొని అందరికి తెలిసేట్లు రాయటం బ్రాహ్మ ప్రళయమే అయింది .నా శక్తి యుక్తులన్నీ పణంగా పెట్టి రాయాల్సి వచ్చింది .దీనిలో నేనుఎంతవరకు సఫలీకృతుడిని అయ్యానో మీకే తెలుసు .ఏదైనా, ఒక మంచి ప్రయత్నం చేశాను అన్న సంతృప్తి మాత్రం నాకు లభించింది .
ఈ మహామహులపై మరింత పరిశోధన చేసేవారికి ఇది కొంత వరకు కరదీపిక అవుతుందని నమ్ముతున్నాను .అంటర్ మేయర్ ఆంగ్లం లో రాసిన గ్రంధాన్ని నాకు పంపి చదివించి తెలుగులోకి అంతర్జాలం లో దాన్ని తెచ్చే ప్రయత్నానికి నన్ను ప్రేరేపించిన ,ప్రేరణ నిచ్చిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి కృతజ్ఞుడను .ప్రతి ఎపిసోడ్ చదివి ,స్పందింఛి ప్రోత్సహించిన వారి ఋణం తీర్చు కోలేనిది . అసలు దీన్ని పూర్తీ చేయగలనా అని అనుమానం వచ్చింది .70 మంది మీద రాసే దాకా నమ్మకం కుదరలేదు .ఇక లాభం లేదని సుమారు నెల రోజులనుండి పగలూ ,రాత్రి విడవ కుండా మిగిలిన వారిపై రాసి ఇవాల్టితో పూర్తీ చేసి ఊపిరి పీల్చుకొని అమ్మయ్య అనుకొన్నాను .ఒక రకంగా భగీరధ ప్రయత్నమే ఇది .
అంటర్ మేయర్ ఆంగ్లకవులపై రాసిన పుస్తకాన్ని పూర్వం నాకు పంపగా ,చదివి ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గా నేను నెట్ లో వారి ప్రోత్సాహంతోనే ధారావాహికంగా రాయటం ,దానికి తామే పూనుకొని గ్రంధ రూపం లోకి తెచ్చి వారి బావగారు శ్రీ డా .రాచకొండ నరసింహ శర్మ ఏం డి గారికి ‘ అ౦కితమిప్పించటం మీకు తెలిసిందే . వారికి నాపై ఉన్న ఆత్మీయతకు ఇంత కంటే నిదర్శనమేముంది ?
అంకితం –‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’అన్న 92 మంది మహా మనీషుల పై రాసిన ఈ 245ఎపిసోడ్ ల ధారావాహిక ను అందులో ఉన్న ఆ 92మంది మహానుభావు లందరికివారి కృషికి ,వీరి నందరిని తన పుస్తకం లో ఆవిష్కరించిన లూయీ అంటరర్ మేయర్ కు ఆయన రచనా విధానానికి , ఇంక ఏమీ చేయలేక సవినయంగా అంకితమిచ్చి ఋణం తీర్చుకొంటున్నాను ..దీన్ని చదివి ఆదరించిన సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను ‘
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-8-16-ఉయ్యూరు
–