”శ్రీ శైల మల్లేశు చెంత పాతాళ గం -గా ప్రవాహపు జలకముల లోన
నాగార్జున గురు విజ్ఞాన వీచీచ్చాయ-జీర్ణించుకొని యున్న జీవనముల
అమరావతీ స్తూప రమణీయ శిల్పశా -స్త్ర జ్ఞాన ఘట్టంపు సాక్ష్య తటిని
భవ్య దుర్గా శైల పాదోదక మిళిత -స్నాన ఘట్టముల చక్కటొకట
కృష్ణ శాంతించు మున్నంగి రేవు వద్ద -ఎక్కడో ఒక్క చోటైన ఒక్క క్రుంకు
చాలు నీ పుష్కర సమయ స్నపన మాంధ్రి-పావనాను భూతిశ్రీ ల పంట లిచ్చి ”
— సేకరణ -గబ్బిట దుర్గా ప్రసాద్