కృష్ణా పుష్కర ఆయాస ,అనుభవ ఆకాంక్షలు –తొక్కా చానెల్
హమ్మయ్య నిన్నటితో కృష్ణా పుష్కరాలు రంగరంగా వైభోగం గా పూర్తయ్యాయి .అందరూ హాయిగా ఊపిరి పీల్చుకొన్నారు .చంద్రబాబుకు అలసట బదులు ఉత్సాహం పరవళ్ళు తొక్కింది .వాలు కుర్చీలో కూచుని వీటిని నెమరేసుకొంటూ ఉంటె నాస్నేహితుడు టిక్కూ రొప్పుతూ ,రోజుతూ ఆయాసపడుతూ పరిగెత్తుకొచ్చి ‘’గురవా !’’తొక్కా టి వి ‘’వాళ్ళు నన్ను నీదగ్గారికి పంపారు .వాళ్ళ విలేకరులంతా ఎక్కడెక్కడో బిగుసుకు పోయారట .నువ్వు జనం లోకి వెళ్లి ‘’పుష్కరాయాస౦ , ,అనుభవ, ఆకాంక్షలు’’ రికార్డ్ చేసి ఇవ్వాలట .మరీ మరీ రిక్వెస్ట్ చేస్తే పరిగెత్తుకొచ్చా ‘’అన్నాడు చెమటను చోక్కాతోతుడుచుకొంటూ .’’సరే నాకేంటి ?’’అన్నా.’’ఈ పని చేస్తే ఈ సారినుంచి నువ్వు రాసిన యే చెత్త అయినా ప్రసారం చేస్తామని నాకు హామీ ఇచ్చారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ నా పరువు కాపాడవా “’ అన్నాడు వగరుస్తూ .’’నీ పరువు సరే నా’’ బరువు ‘’సంగతి ?వెహికిల్ ఇస్తారా కెమెరామాన్ ఉంటాడా ,అరగంటకోసారి టిఫిన్ కాఫే మధ్యాహ్నం మీల్స్ అన్నీ ఉన్నాయా ? నేను రికార్డ్ చేసింది అక్షరం వదలకండా బ్రాడ్ కాస్ట్ చేస్తారా .కటింగ్ ఉంటె కోర్టుకు వెడతానని చెప్పు ‘’అని మేక పోతుగా౦ భీర్యం ప్రదర్శించాను ’ .’’ఆ లోపం ఏమీలేదు .వాటన్నిటితో వెహికిల్ మీ వాకిట్లో రెడీ .నువ్వు ఎక్కి సురూ చేయటమే ఆలస్యం ‘’అంటూ మనసులో ‘’ఈ తొక్క ప్రోగ్రాం ప్రసారం అయినప్పడుకదా’’అని వాడుమనసులో అనుకోన్నమాట నా మెదడు రికార్డ్ చేసేసింది .’’వీడు ఇంత పకడ్బందీ ప్లాన్ లో వచ్చాడంటే లబ్ది బానే ఉంటుందని కక్కుర్తి పడి వడినీ వాన్ లో కుక్కి నేనూ ఎక్కాను .
ముందుగా పోలీస్ వారిని అడగాలని వారిదగ్గరకు వెళ్లాను .వాలిపోతూ సోలిపోతూ కుర్చీలో కూర్చోలేక పోతూ ,కాళ్ళు వాఛి ఉన్నాడు పోలీసాయన .’’మైక్ ఆన్ చేయింఛి ‘’సార్ ! మీ పుష్కరం అనుభవం రికార్డ్ చేయటానికి తొక్కా టి వి వాళ్ళు నన్నుపంపారు చెప్పండి ‘’అన్నాను .’’నీరసం ఒళ్ళంతా వ్యాపించి కాళ్ళూ చేతులు స్వాధీనం కాకుండా ఉన్న ఆయన ‘’బలే అనుభవం సార్ .ఒకచోట కూర్చోకుండా నిలబడకుండా 24 గంటల డ్యూటీ చేశాం నడుం విరిగింది .అయినా ఆ జనం హుషా రేంటి సార్.విరగబడి వచ్చారు .వాళ్ళను చూస్తె ,మా అలసట మాయమైంది .కస్టమనిపించలేదు .ఇష్టం తోనే చేశాం .మాదేముంది సార్ .సి ఏం సార్అసలు నిద్రాహారాలు తీసుకొన్నారో లేదో అనిపించింది సార్.ఈ డ్యూటీలో ఆల్ హేపీ హేపీ సార్’’అని కూలబడిపోయాడు .
దారిలో 70 ఏళ్ళ ముసలాయన కనిపిస్తే ఆగి మైకం ఆనించాను ‘’సార్!మీ పుష్కరానుభవం చెప్తారా ‘’అని అడిగా ‘’ఓ తప్పకుండా .నేను 5 పుష్కరాలు చూశాను .అందులో ఇది ది బెస్ట్ .ఏర్పాట్లు పర్య వేక్షణ ఉచిత బస్ సౌకర్యం విశాల ఘాట్లనిర్మాణం ,పారిశుధ్యం ,ఉచిత టిఫిన్ కాఫీ భోజనాలు పోటీలు పడి ఏర్పాటు చేయటం,ముసలీ ముతకలను జాగ్రత్తగా కనిపెట్టి ఉండటం ఓహ్ మహా ఆనందంగా ఉంది .చంద్రబాబు దూర దృష్టికి టెక్నికల్ సైంటిఫిక్ నాలెడ్జ్ వాడకానికి పరాకాష్ట ఈపుష్కరం. గోదావరికీ ఇలానే చేశాడు .తపన ఉన్నవాడేచేయగలడు .మీద్వారా ఆయనకు ,ప్రభుత్వానికి అధికారులకు పోలీసులకు స్వచ్చంద సంస్థలకు ,విద్యార్ధులకు దాతలకు మా తరఫున అభినందనలు అందజేయండి ‘’అని గుక్క తిప్పుకోకుండా గురువుగారు వాయించి పారేశాడు .
అంతా పాజిటివ్ గానే ఉండే వ్యతిరేకం గా ఎవరూ చెప్పటం లేదే అని లోపల పీకు తోంది .సరే ఈ సారి పార్టీలవాళ్ళను వాళ్ళ ఆకాంక్షలను అడుగుదామని పించి ముందుగా జగన్ పార్టీఆయన కనిపిస్తే మైక్ ఇచ్చాను ‘’తొక్కలో పుష్కరానికి ఇంత ఖర్చా .పార్టీ రాజకీయమేకాని ప్రజాదృస్టి ఎక్కడ?అన్నాడు జగన్ పరిభాషలో .’’వచ్చే పుష్కరానికి మీ లక్ష్యం ఏమిటి ‘’?అడిగా .మానాయకుడు పక్కనే ఉన్నాడు ఆయనే చెబుతాడు అని ఆయన్ను పిలుచుకొచ్చి మైకిచ్చాడు ‘’ఇదేం తీరు .ఎక్కడాప్రజలు ఇబ్బంది పడకుండా చేస్తే ఎలా ?మనల్ని ఎలా గుర్తుంచుకొంటారు .తొక్కిసలాటలు ఉండాలి జననస్టం కలగాలి .నేను వెళ్లి కావులించు కొంటూ ఓదార్చాలి ,సాను భూతి చూపాలి .నాకు ఆవకాశమే లేకుండా చేసి నోట్లో మట్టి కొట్టాడు ‘’అన్నాడు .””మరి మీ లక్ష్యం “?’’ఏముందీ .కృష్ణను ఇడుపులపాయకు ,మా తండ్రిచనిపోయిన పావురాల దిబ్బకు పారించి అక్కడ పుష్కరం పెట్టటం ‘’అన్నాడు .ఆహా ఏమి కోరిక అనిపించి నోరుమేదాపక జారుకొన్నాం .
హస్త వాసి ఒకాయన కనిపిస్తే మైకిచ్చి ‘’వచ్చే పుష్కరాలకు మీ ప్లాన్ ఏమిటి ?’’అడిగా కంగారు లో ‘’అప్పటిదాకా మా పార్టీ ఉంటేకదా’’అని గబుక్కున నోరుజారి పక్కనున్న నాయకుడికిస్తే ఆయన ‘’అప్పుడు మా రాష్ట్ర నాయకుడితో వారున జపం చేయించి కృష్ణ నీటిని మడకశిర ధర్మవరం దాకా తీసుకు వెళ్లి ప్రతి ఊరికి కాలవలద్వారా పారిస్తాం .ఇంటికొక జల్లు స్నానం పెట్టి ఇక్కడికొచ్చే శ్రమ లేకుండా చేస్తాం .’’అన్నాడు .ఓహో ఇదేదో బానే ఉందనుకోన్నాను .ఇంకొంచెం ముందుకు వెడితే నారాయణ రాఘవులు చెట్ట పట్టాలేసుకొని ఖుషీగా కన్పించారు .పార్టీ వేదికల మీద ,సభల్లో ఎడమొగం పెడమొగం గా ఉన్న ఈ ఇద్దరు ఇంత జబర్దస్తీ దోస్తీచేస్తున్నారేమిటి అని బోల్డు ఆశ్చర్య పోయి జమిలిగా మైకిచ్చా ‘’మాకు ఇవి ఒంటికి పడవు .అయినా జనాల సెంటి మెంట్ ను గౌరవి౦ చాలికనుక ఈ సారి పుష్కరానికి రష్యాలోని ఒల్గానదిని చైనాలోని యాంగ్ చికియాంగ్ నదినీ కృష్ణానదిలో సంగమించేట్లు చేసి ఘన౦ గా రెడ్ బాడ్జీలతో పుష్కర శోభ తెస్తాం .’’’’మీకు అధికారం లోకి వచ్చే ఆశ ఉందా స్వామీ ‘’అన్నాను మైక్ కట్ చేసి ‘’అధికారమా మశానమా !ఉన్న అస్తిత్వమే పోతుంటే .మోడీ దెబ్బకు మా పేట్రన్ దేశాలే కుదేలైపోతే ‘’అన్నారు ఇద్దరు .
ఇంకా ఎవరు మిగిలారబ్బా అనుకొంటుండగా మజ్లిస్ నాయకుడు ఎదురయ్యాడు .’’వచ్చే పుష్కరాలకు మీ లక్ష్యం ఏమిటి ?’’అడిగా ‘’అరె భాయ్ !మా మతపోళ్ళు కొందరు పుష్కర స్నానం చేస్తుండగా ఫోటోలు వీడియోలు తీసి పెద్ద పబ్లిసిటి ఇచ్చారు ..అయినా మా వాళ్లకు పూర్తీ స్వాతంత్రం ఉంది అన్నిట్లో మేం కాదనం .వచ్చే పుష్కరాలకు ‘’కాబా ,మక్కాలనుండి పవిత్ర జలాలు తెప్పించి పుష్కర జలాల్లో కలిపి శుద్ది చేస్తాం .ఇదే మా యాక్షన్ ప్లాన్ ‘’అన్నాడు .ఇంతలో గులాబీ చొక్కా ఆయన ఎదురయ్యాడు .మామూలు ప్రశ్నే అడిగా ‘’ఏందివయ్యా మీ బాబు అన్ని కోట్లు ఖర్చు చేసి అన్ని సౌకర్యాలు కలిగించి మా దిమా కరాబు చేసి౦డాడు .మా నాయకుడు సిందుకే స్వాగతం పలక్క ,ఎవరినోపంపి చేతులు దులుపుకొంటే ,మీ బాబు ఆమెనూ గురువునూ ప్రత్యెక విమానం లో బెజవాడ రప్పించి కేంద్రమంత్రులు, స్వామీజీ ,కృష్ణా పుష్కర సమక్షం జనం ముందు ఘనం గా సన్మానించి నజరానా లు అందించాడు మీ డబ్బులన్నీ దొబ్బెసిన మేమే ఇంతఘనంగా చేయలేకపోతే ,రోజూ అప్పుచేసిపప్పుకూడు తినే మీరింది వయ్యా ఇంతగొప్పగా చేసిండ్రు . .భేష్ వయ్యా .ఈ సారి పుష్కరాలకు మేము కృష్ణానది అంతా గులాబీ రంగుతో పారించి ,కృష్ణకు గులాబీరంగు అద్ది మా భక్తీ ప్రకటిస్తాం ‘’అన్నాడు .’’ .’’ఓరి నాయనో 1 ఇదేం ప్రాదేశిక భక్తీ అని అవాక్కయ్యాను .
ఇంకెవరినైనా ఇంటర్వ్యు చేద్దామంటే గత 12 రోజులకంటే ఎండ మండి మాడ్చేస్తోంది .పుష్కరం కిక్ లో ఆ ఎండలని భరించి స్నాన దాన ప్రదానాలు చేసి దైవ దర్శనంతో పులకించి తరించిన కోట్లాది పుష్కర భక్తులకు శుభా కాంక్షలు పలుకుతూ ఓవర్ టు తొక్కా చానెల్ .ఇది మీ తిక్కకు సరైన లెక్క .అనుభవించండి ‘’
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-24-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్