మధురం మధురం మాధవ నామం
శ్రీ కృష్ణుడు ఉద్భవించిన చోటఉత్తర ప్రదేశ్ లోని మధుర లో ఆయన జన్మించిన చెరసాల చుట్టూ శ్రీ కృష్ణాలయం నిర్మించారు .కేశవ దాసాదేవాలయం దాటగానే కృష్ణాలయం వస్తుంది .ప్రక్కనే మసీదుకూడా ఉంటుంది మొట్టమొదటి ఆలయాన్ని వజ్ర నాభుడు నిర్మించాడు అది దెబ్బతింటేతర్వాత విక్రమాదిత్య మహారాజు పునర్నిర్మించాడు మహమ్మదీయ దండ యాత్రలో ఈ దేవాలయం 17 సార్లు ధ్వంసమైంది ధ్వంసమైన ప్రతిసారీ కొత్త ఆలయాన్ని నిర్మించారు .
శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారం స్వయం భువు . సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే శ్రీ కృష్ణ రూపం లో ద్వాపర యుగం కంస శిశుపాలాది దుస్ట రాక్షసగణాలను సంహరింఛి ధర్మ సంస్తాపనకోసం ఉద్భవించాడు శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీ కృష్ణ జయంతి .గోవింద ,ముకుంద వాసుదేవ అని ఆయన్ను మనసారా భక్తజనం పిలుచుకొంటారు .మనసులను ఆకర్షించేవాడుకనుక కృష్ణుడు ..శ్రీకృష్ణ ,వాసుదేవ బాలకృష్ణ ,గోపాల మూర్తిగా క్రీ .పూ.4 వ వశతాబ్దినుంచి పూజలు అందు కొంటున్నట్లు చరిత్రకారులు అంటారు .కృష్ణుని స్వయంభువుగా భావి౦చ టాన్ని ‘’కృష్ణ తత్త్వం ‘’అన్నారు ఇది మధ్యయుగం లో భక్తీ మార్గం పరిపక్వంగా ఉన్నప్పుడు బాగా వ్యాపించింది 10 వశతాబ్దం నుండి శిల్పాలలో చిత్రలేఖనం లో క్రిష్ణాక్రుతులకు ప్రాధాన్యం పెరిగింది .ఒరిస్సాలో ని పూరీ క్షేత్రం లో శ్రీ జగన్నాధ దేవాలయం ఈ ప్రభావం తో నిర్మించబడింఅలాగే మహారాస్ట్రలో విఠోబా అనే పాండురంగని ఆలయం రాజస్థాన్ లో శ్రీనాద్ దేవాలయం ఏర్పడ్డాయి 19 60 తర్వాత పాశ్చాత్య దేశాలలో కృష్ణా కాన్షేస్ బాగా పెరిగి అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి అంతర్జాతీయ కృష్ణా కాన్షేస్ సంస్థ చాలా ప్రాచుర్యం పొందింది దీనినే ‘’ఇస్కాన్ ‘’అంటారు
సాధారణం గాశ్రీ కృష్ణ విగ్రహాలు నల్ల రాతితో తయారు చేసేవారు .కాలక్రమేనణా నలుపు తగ్గించి నీలం రంగు వాడుతున్నారు అసలు ఆయన రంగుకు ‘’జమ్బూల్ ‘’అనిపేరు దీన్నే జామున్ అంటారు అది ‘’ఊదా రంగు (పర్పుల్ కలర్ )ఫలం జంబూ ఫలానికి ఉన్న నాలుగు చిహ్నాలలోరెండు శ్రీకృష్ణుని కుడి పాదం పైన ఉన్నట్లు వాటిని శ్రీ రూప చింతామణి ,ఆనంద చంద్రిక అంటారని శ్రీ మద్భాగవతానికి వ్యాఖ్యానం రాస్తూ శ్రీల విశ్వనాధ చక్ర వర్తి ఠాకూర్ తెలియ జేశారు
సింద్ లోని లర్కానా జిల్లాలోని మొహన్జ దారో ‘’లో దొరికిన ఒక ఒక షొప్ స్టోన్ శిలాఫలకం పై యమలార్జున గర్వ భంగం అంటే రెండు మద్ది చెట్లను నడుముకు కట్టిన రోటి తో ధ్వంసం చేసిన బాలక్రిషణ మూర్తి శిల్పం బయట పడింది అంటేసిందు నాగరకత కాలం నాటికే శ్రీ కృష్ణ కధలు బహుళ ప్రచారం లో ఉన్నాయి అని పురా తత్వ వేత్తలు వి ఎస్ అగర్వాల్ లాంటి వారు నిర్ణయించారు కృష్ణుడిని బాల కృష్ణు నిగా లేక రాదా కృష్ణుని గా యవ్వన దశలో ఉన్న విగ్రహాలు ఎక్కువ .ఆయన నిలబడి మురళి వాయిస్తూ వ్యత్యస్త పాదం తో కనిపించటం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది చుట్టూ గోవులు గోపాలురు గోపికలు పర్య వేష్టించి ఉంటారు ఈ త్రిభంగిమ ‘’లో కనిపించే కృష్ణుడిని ‘’ పశుపాలకుడైన దేవదేవునిగా భావించి గోవింద అని గోపీ కృష్ణా అని ఆత్మీయంగా పిలుచుకొంటారు అయన చిలిపి చేష్టలకు గుర్తుగా వెన్న నవనీత చోరా ,గోకుల కృష్ణ ,కాళీయ మర్దన గిరిధర గోపాల అని పిలుచుకొని మురిసిపోతారు .
ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లా మీర్జా పూర్ లో త్రవ్వకాలలో దొరికిన శిల్పాలు శ్రీ కృష్ణుని కురుక్షేత్ర సంగ్రామానికి చెందినవి .ఇవి క్రీ పూ.800కాలానివి .అస్త్ర శస్త్ర దారిగా అర్జున రధ చోదకుడిగా చేతిలో చేన్నాకోలతో గుర్రాలను అదిలిస్తూ కనిపిస్తాడు ..ఈ కృష్ణుడిని ,పార్ధ సారధిగా కొలుస్తారు .
క్రిష్ణకధలు భారత భాగవత ,హరివంశ పురాణాలలో నిక్షిప్తమై అక్షర బద్ధమైనాయి రుగ్వేదం లోని 1-22-164 లో 31 వ సూక్తం లో చెప్పబడిన పశుపాలుడు శ్రీ కృష్ణుడే అని శ్రీ భక్తీ వినోద ఠాకూర్ అభిప్రాయ పడ్డారు క్రీ పూ..8 నుంచి 6 వ శతాబ్దాలకు చెందిన ఛాందోగ్య ఉపనిషత్ లో 3-17 -6 సూక్తం లో వాసుదేవ కృష్ణుడు దేవకీ కుమారుడు అని ఘోర అంగీరసుని శిష్యుడని పేర్కొన బడింది క్రీ పూ 6 వ శాతాబ్దికి చెందిన యాస్కుని నిరుక్తం అక్రూరుని వద్ద శ్యమతక మణి ఉన్నట్లు శత పద బ్రాహ్మణం ఐతరేయ అరణ్యకాలలో కృష్ణుడిని వృష్ణి వంశ సంజాతునిగా చెప్పాయి క్రీ పూ 5 లేక 6 శతాబ్దాలలో ఉన్న పాణిని తన అష్టాధ్యాయి లో వసుదేవుని కుమారుడు వాసుదేవుడని అర్జున కౌరవు లగురించి చెప్పాడు అంటే కృష్ణునికి అర్జునికి కౌరవులకు సంబంధం ఉందని తెలుస్తోంది
ఇంతటి విస్తృత ప్రచారం ద్వారకా నాధుడు మధురా వల్లభుడు వ్రేపల్లె నందవంశ బాల కృష్ణు డికి ఉంది భారత యుద్ధం లో అర్జునికి కర్తవ్య బోధ చేసి గీతాచార్యుడై ‘’కృష్ణం వందే జగద్గురుం ‘’అని అందరి మొక్కులు అందు కొంటున్నాడు
శ్రీ కృష్ణాష్టమి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్