కోటి కొక్కడైన శ్రీ కోలాచలం వెంకట రావు
సంస్కృత మహా కావ్యాలకు మహా వ్యాఖ్యానం రాసిన కోలాచలం మల్లి నాద సూరి తాత గారు కోలాచలం సుబ్బా శాస్త్రి కర్ణాటకలోని దార్వార్ జిల్లా మహేంద్ర గడ నివాసి .ఎన్నో హరికధలుమరాటీ కన్నడ భాషలలో రాశాడు .అవి నీతి బోదకాలు గా ఉండటం వలన ఇప్పటికి జనం నాలుకలపై నర్తిస్తూనే ఉన్నాయి .ఆయన తండ్రి నిజాం రాజ్యం లోని ఆనే గొందే సంస్థానం లో దివాన్ .ఇది విజయనగర సామ్రాజ్యం లో భాగం .ఆ వంశానికి చెందిన వాడే శ్రీ కోలాచలం వెంకట రావు .ఆయన నిజంగా కోటికోక్కడై కీర్తి పొందాడు .ఆయన గురించే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .
జనన విద్యాభ్యాసాలు –లాయర్ వెంకట రావు
శ్రీ కోలాచలం వెంకట రావు 28-2-18 50 న కర్ణాటక లోని హంపి దగ్గరున్న కమలాపురం లో జన్మించాడు .ఇది పూర్వపు విజయనగర సామ్రాజ్యం లో భాగం .వార్డ్లా ఇన్ష్టి ట్యూట్ లోను ,,తర్వాత గవర్నమెంట్ ప్రొవిన్సియల్ స్కూల్ లోను చదివాడు .1867 డిసెంబర్ లో ఎఫ్ .ఏ .పాసయ్యాడు .మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజ్ లో మిస్టర్ ధాంసన్ వద్ద బి ఏ .కొంతకాలం చదివి ,మద్రాస్ వాతావరణం ఆరోగ్యానికి సరిపడక చదువు మానేశాడు .మద్రాస్ ప్రావిన్స్ లో అదొక్కటే కాలేజ్ కనుక ఇంకెక్కడా చదవలేక పోయాడు .పొట్ట పోషించుకోవటానికి స్కూల్ మేస్టరీఉద్యోగం లో చేరి 1874 వరకు పని చేశాడు .తర్వాత జిల్లా మున్సిఫ్ కోర్ట్ లో హెడ్ క్లార్క్ గా ఉద్యోగం పొంది నాలుగేళ్ళు పని చేశాడు .డిప్యూటీ తాసిల్దార్ గా ,సబ్ మేజిస్ట్రేట్ గా పదోన్నతి పొంది రెండేళ్ళు సేవ చేశాడు .తన మనసులోని భావనలకు చేస్తున్న ఉద్యోగానికి పొంతన లేదని భావించి న్యాయ శాస్త్రం చదివి1880 లో పాసై బళ్ళారి న్యాయ స్థానాలలో సివిల్,క్రిమినల్ కేసులు వాదిస్తూ మంచి లాయర్ గా ప్రసిద్ధి చెందాడు లాయర్ వెంకట రావు .1883 లో దియోసఫిస్ట్ అయి ,క్రమంగా మత ,రాజకీయ సాంఘిక వేదాంతాల పట్ల ఆసక్తి వృద్ధి చేసుకొని ప్రజాసంక్షేమమే ధ్యేయంగా జీవించాడు . .
సకల మతాసక్తి –సంఘ సంస్కరణాభిలాష
హి0దూ వేదాంతం కొరాన్ బైబిల్ లను ఆసక్తిగా అధ్యయనం చేసి ఆకళింపు చేసుకొన్నాడు వెంకట రావు .హిందూ ధర్మం పై అమితాసక్తి కలిగి హిమాలయాలకు వెళ్లి అక్కడి ప్రసిద్ధ స్వాముల వద్ద విశేషాలు గ్రహించాడు .రెండు సార్లు బర్మా శ్రీలంకలను సందర్శించి బౌద్ధ ధర్మ పారమ్య౦ ఎరిగాడు .శారీరక ,మానసిక స్వచ్చత ను1884 లో పొందాడు .దేవాలయాలలో ,స్నేహితుల ఇళ్ళలో జరిగే దేవా దాసీ నృత్యాలను చూడటానికి వెళ్ళటం మానేశాడు .స్వర్గీయ రావు బహదూర్ ఎ.సభాపతి మొదలియార్ తో కలిసి వేశ్యా నృత్యనిషేధం పై పోరాటం చేశాడు .పిలిచినా ,పిలవక పోయినా దేవాలయాలలో ఉత్సవాల సందర్భం గా ఏర్పాటు చేసే వేశ్యా నృత్యాలకు వెళ్లి ,సంఘం లో పతితలైన వారిని ఈ రొంపిలోకి దించటం అన్యాయం అని ఉపన్యాసాలిచ్చి దాన్ని మాన్పించే ప్రయత్నం చేశాడు .ఇది ప్రజలలో గొప్ప ప్రభావం కలిగించి క్రమంగా దేవ దాసీ నృత్యాలుబళ్ళారి లో కనుమరుగై పోయాయి .
రాజకీయ ప్రవేశం
లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థలను విస్తృత పరచే చట్టాన్ని తెచ్చాడు .సభాపతి మొదలియార్ తన వైశ్య బంధువులను వీటిలో ఎన్నికలలో పాల్గొని బాధ్యతలు స్వీకరించమని హితవు చెప్పాడు .ఆయన మాట మన్నించి ఎన్నికలలో నిలబడి గెలిచి పదవులు చేబట్టి రాణించారు .1884 లో బళ్ళారి లో వెంకట రావు గెలిచి బొంబాయి కి వెళ్లి రిప్పన్ పదవీ విరమణ సందర్భం గా జరిగిన పెద్ద బహిరంగ సభలో పాల్గొన్నాడు .అక్కడ అనేక సభలలో పాల్గొని అక్కడ రెండు సంస్థలను ఏర్పాటు చేయటానికి అందరూ అంగీకరించారు అందులో ఒకటి ‘’భారత జాతీయ కాంగ్రెస్ ‘’అనే రాజకీయ సంస్థను ఏర్పాటు చేయటం ,రెండవది ‘’సోషల్ కాన్ఫరెన్స్ ‘’అనే సాంఘిక సంస్థ ఏర్పాటు . 1, 2, 3, 4 ,5, 7 కాంగ్రెస్ సభలకు ఆ తర్వాత 7 కాంగ్రెస్ సభలకు హాజరయ్యాడు .1884 నుంచి సంవత్సరం లో రెండు ,మూడు నెలలు భారత దేశమంతా ,సిలన్, బర్మా మొదలైన దేశాలు పర్యటించిఅక్కడి జన జీవన పరిస్తితులు ,దేవాలయాలు మసీదులు చర్చి లు ,ప్రాచీన సంస్కృతులను ,ఆర్కి టేక్చర్ ను సందర్శించి ,ప్రజలతో కలసి మెలసి అన్నీ అర్ధం చేసు కొన్నాడు .
ఆధారం -8-7-16 న బళ్ళారి నుంచి శ్రీ కోలాచలం అనంత ప్రకాష్ గారు నాకు శ్రీ వెంకట రావు గారిపై ఆంగ్లం లో రాసిఉన్న జిరాక్స్ కాగితాలు కొరియర్ లో పంపారు .వారెవరో నాకు అసలు తెలియదు .పంపిన కాగితాలపై వారి ఫోన్ నంబర్ ఉంటె ఫోన్ చేశాను .చక్కని తెలుగులో మాట్లాడారు .మల్లి నాదసూరి వంశ0 కోలాచలం వంశపు వాడినని ,తాను బళ్లారిలో లాయర్ నని చెప్పారు మహా మహోపాధ్యాయుడైన సూరి అపార పాండిత్యాన్ని గూర్చి ,సంస్కృత పంచ కావ్యాలపై మల్లినాద సూరిరాసిన వ్యాఖ్యానాన్ని గురించి ముచ్చటించుకోన్నాం .మల్లినాద సూరి సమగ్ర జీవిత చరిత్ర తయారు చేస్తున్నామని నాలుగైదు నెలలలో వెలువరిస్తామని చెప్పారు .మన సరసభారతి పుస్తకాలు పంపిస్తున్నానని చెప్పిమర్నాడే 9-7-16 న రెండు వందలు ఖర్చు చేసి వారిచ్చిన అడ్రస్ కు పంపాను .కాని పుస్తకాలు అందాయో లేదో తెలీదు .జులై చివర్లో ఆగస్ట్ లో రెండు సార్లు ,ఇవాళ ఈ వ్యాసం రాయ బోయే ముందు వారిచ్చిన సెల్ నంబర్ కు ఫోన్ చేశాను .కాని ఎవరో లిఫ్ట్ చేసి కన్నడం లో మాట్లాడుతూ రాంగ్ నంబర్ అంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది .వారిచ్చిన అడ్రస్
కోలాచలం అనంత ప్రకాష్ ,లాయర్ ,80,Gooty Kalappa Compound ,అనంత పూర్ రోడ్ ,బళ్ళారి -583101 -కర్నాటక
సెల్ నంబర్ -0 94,94,23,60,84
సశేషం
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -8-9-16 –ఉయ్యూరు