ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు-2
6-ఇండియా ఆఫీస్ లైబ్రేరియన్ -ఫ్రెడరిక్ విలియం ధామస్
1867 లో జన్మించి 1956 లో మరణించిన ఫ్రెడరిక్ విలియం ధామస్ 21-3-18 67 న టాం వర్త్ స్టాఫర్డ్ షైర్లో జన్మించాడు .బర్మింగ్ హాం కింగ్ ఎడ్వర్డ్ స్కూల్ లో చదివి ,కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజిలో 1885 లో చేరి ,క్లాసిక్స్ లోను ,ఇండియన్ లాంగ్వేజెస్ లోను ఫస్ట్ క్లాస్ డిగ్రీ పొందాడు .రెండిటిలోనూ బ్రౌన్ మెడల్ సాధించాడు .కేంబ్రిడ్జి లో ఎద్వార్డ్ బిల్స్ కోవెల్ వద్ద సంస్కృతం అభ్యసించాడు
1898 నుండి 1927 వరకు ఇండియా ఆఫీస్ లైబ్రరీలో లైబ్రేరియన్ గా ఉన్నాడు .అదే సమయం లో లండన్ యూని వర్సిటి కాలేజి లో కంపారటివ్ ఫైలాలజి లెక్చరర్ గా.19 08 నుంచి 19 35 వరకు పని చేశాడు .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి బోడేన్ సాంస్క్రిట్ ప్రొఫెసర్ గా 19 27 నుంచి 37 వరకు పని చేస్తూ బాలియాల్ కాలేజి ఫెలో అయ్యాడు .ఆక్స్ ఫర్డ్ లో ఆయ శిష్యులైన వారిలో ప్రముఖుడు హోరాల్ద్ వాల్టర్ బైలీ ఉన్నాడు .19 27 లో ఫెలో ఆఫ్ బ్రిటిష్ అకాడెమి గౌరవం పొందాడు .6-5-1956 న 8 8 వ ఏట మరణించాడు .
జాక్వెస్ బకాట్ టో కలిసి ‘’ఓల్డ్ టిబెటన్ హిస్టారికల్ టేక్స్త్స్ సేకరించి ప్రచురించాడు .మధ్య ఆసియా నుండి టిబెటన్ వ్రాతప్రతులను సేకరించి ఇండియా ఆఫీస్ లైబ్రరీలో భద్ర పరచాడు .బాణుని హర్ష చరిత్ర ,సైనో టిబెటన్ సరిహద్దు ప్రాంత౦ పు ‘’నాం’’భాష పై పరిశోధన చేసి రాశాడు .ఎన్శేంట్ ఫోక్ లిటరేచర్ఆఫ్ ఈస్ట్రన్ టిబెట్ పుస్తకం రాశాడు .
7-ఇంగ్లీష్ ఓరి ఎంటలిస్ట్-డాక్టర్ హోరేస్ హేమన్ విల్సన్
ఇంగ్లిష్ ఓరి ఎంటలిస్ట్అయిన హోరేస్ హేమన్ విల్సన్ 26-9-1786 న జన్మించి ,సెయింట్ ధామస్ హాస్పిటల్ లో మెడిసిన్ చదివి 1808 లో ఇండియా వచ్చి బెంగాల్ లో అసిస్టంట్ సర్జన్ గా ఈస్ట్ ఇండియా కంపెని లో పని చేశాడు .మెటలర్జీ మీద ఆయనకున్న అపార జ్ఞానం కలకత్తా లోని మింట్ కు దగ్గర చేసి,జాన్ లేడెన్ తో కలిసి పని చేశాడు .భారతీయ పురాతన సాహిత్యం పై అభిలాష ఏర్పడి నందున హెన్రి ధామస్ కోల్ బ్రూక్ ఇతన్ని బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ సెక్రెటరి చేశాడు .కాళిదాస మేఘ దూతం ను అందమైన ఆంగ్లభాషలోకి అనువాదం చేశాడు .1819 లో మొట్ట మొదటి సంస్కృత –ఇంగ్లీష్ నిఘంటువును సంస్కృత విద్యావేత్తల సయం తో తన స్వంత పరిశోధనతో కూర్చాడు .దీన్ని రుడాల్ఫ్ రోత్ ,ఆతోవాన్ బోత్లింక్ లు1853 – 1876 మధ్య తయారు చేసిన ‘’సాంస్క్రిట్ ఓర్టర్ బర్చ్ ‘’ వెనక్కి నెట్టేసింది .
విల్సన్ కు ఆయుర్వేదం పై అభిరుచి కలిగి అధ్యయనం చేసి కలరా ,కుష్టు వ్యాధుల నివారణకు మందులపై మెడికల్ అండ్ ఫిజికల్ సొసైటీ ఆఫ్ కలకత్తా లో వ్యాసాలు రాశాడు .1827 లో ‘’సెలెక్ట్ స్పెసిమేన్స్ ఆఫ్ ది దియేటర్ ఆఫ్ ది హిందూస్ ‘’పుస్తకం ,భారత దేశ నాటకాలను ,నాటక శాలలను క్షుణ్ణంగా పరిశోధించి రాశాడు .’’మెకంజీ కలెక్షన్స్ ‘’అనేది మరొక గొప్ప కృషి .’’హిస్టారికల్ స్కెచ్ ఆఫ్ ది ఫస్ట్ బర్మీస్ వార్ విత్ డాక్యుమెంట్స్ పొలిటికల్ అండ్ జాగ్రాఫికల్ ‘’మరో గొప్ప పుస్తకం .పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీ సేక్రేటరిగా ,కలకత్తా సంస్క్రుతకాలేజి సూపరింటే౦డ గా పని చేశాడు .విష్ణు పురాణాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించాడు .హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా రాశాడు .ఇంగ్లీష్ ను భారతీయుల నెత్తిన రుద్ద కూడదని ఎలుగెత్తి చాటిన భారతీయ భాషాభిమాని హోరేస్ విల్సన్ దీనివలన కొంత వ్యతిరేకతను బ్రిటిష్ వారి నుంచి ఎదుర్కొన వలసి వచ్చింది .1832 లో బ్రిటిష్ ప్రభుత్వండా హోరేస్ విల్సన్ ను ఆక్స్ ఫర్డ్ లో ఏర్పాటు చేసిన బోడెం సంస్కృత పీఠం కు మొదటి అధికారిగా ఎంపిక చేసి నియమించింది .దీనిపై 1832 మార్చి 6 న ‘’ది టైమ్స్ ‘’పత్రికు ఒకకాలం నిడివిఉన్న ప్రకటన ఇచ్చాడు .1836 లో ఈస్ట్ ఇండియా కంపెనీ లైబ్రేరియన్ అయ్యాడు .ఈస్ట్ ఇండియా కంపెనికాలేజిలో బోధనా చేశాడు కలకత్తా మెడికల్ అండ్ ఫిజికల్ సొసైటీలో సభ్యత్వ మిచ్చి గౌరవించారు .రాయల్ ఏషియాటిక్ కంపెనీకి ప్రాధమిక సభ్యుడు .1837 నుండి చనిపోయేదాకా దానికి డైరెక్టర్ గా ఉన్నాడు .8-5-1860లో చనిపోయిన విల్సన్ ను కేంసాల్ గ్రీన్ సేమిటేరి లో ఖననం చేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-16- ఉయ్యూరు