ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు
1-ఆక్స్ ఫర్డ్ సంస్కృత ప్రొఫెసర్ -ధామస్ బారో
1909జూన్ 29 న మాంచెస్టర్ లోని లేక్క్ లో జాషువా ,ఫ్రాన్సి ఎలినార్ బారో లకు ఆరుగురు సంతానం లో పెద్ద వాడుగా జన్మించిన ధామస్ బారో కిరక్ బీ లాంన్స్ డెల్ లో క్వీన్ ఎలిజబెత్ గ్రామర్ స్కూల్ లో చదివి కేంబ్రిడ్జ్ క్రైస్ట్ కాలేజి లో చేరటానికి స్కాలర్షిప్ సాధించాడు .సంస్క్రుతంపై అభిమానమేర్పడి కంపారటేటివ్ ఫైలాలజిలో స్పెషలైజ్ చేశాడు .ఇండియాలోని అన్నామలై యూని వర్సిటి లో పి ఎస్ సుబ్రహ్మణ్య శాస్త్రి వద్ద ‘’సంస్కృతం లోని ద్రావిడ భాషా పదాలను గుర్తించటం లో సమస్యలు ‘’పై పరిశోధన చేసి ‘’ది కలేక్టేడ్ పేపర్స్ ఆన్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ ‘’గా 1968 లో ప్రచురించాడు . ఇండాలజిస్ట్ మాత్రమే కాక బారో ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో బోడెన్ సంస్కృత ప్రొఫెసర్ కూడా .19 44నుంచి 76 వరకు 32 ఏళ్ళు అక్కడ పనిచేశాడు .అదే సమయం లో ఆక్స్ ఫర్డ్ బలియాల్ కాలేజి ఫెలో గా కూడా ఉన్నాడు . ఆయన రచనలు 1-ఏ ద్రవిడియన్ ఎటిమలాజికల్ డిక్షనరీ ,2-ది ప్రాబ్లెమ్స్ ఆఫ్ ష్వా ఇన్ సాంస్క్రిట్, 3-ది సాంస్క్రిట్ లాంగ్వేజ్ .ఇతర రచనలు –ట్రాన్స్ లేషన్ ఆఫ్ ది ఖరోషి ఫ్రం చైనీస్ అండ్ టర్కిస్తాన్ ,ఏ కంపారటివ్ వొకాబ్యులరి ఆఫ్ ది గోండి లాంగ్వేజ్ ,కలేక్క్టేడ్ పేపర్స్ ఆఫ్ ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ .సంస్కృత భాషా సేవకుడైన బారో 19 86 జూన్ 8 న మరణించాడు .
2- బౌద్ధం పై సాధికారత ఉన్న రిచర్డ్ గా౦ బ్రిచ్
పియానిస్ట్ అయిన ఐల్ గామ్బ్రిచ్ కు ఆస్ట్రియన్ –బ్రిటిష్ ఆర్ట్ హిస్టోరియన్ ఎర్నెస్ట్ గాం బ్రిచ్ దంపతుల ఏకైక కుమారుడు రిచర్డ్ గాం బ్రిచ్ .17-7-1937న జన్మించాడు .లండన్ లోని సెయింట్ పాల్ స్కూల్ లో చదివి ,ఆక్స్ ఫర్డ్ లోని మాగ్డలిన్ కాలేజి లో చేరాడు .1961 లో బి ఏ పాసై ,63 లో హార్వర్డ్ నుంచి ఎం .ఏ .పొంది ,70 లోఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి నుండి డి.ఫిల్ .సాధించాడు .ఇండాలజిస్ట్ గా ఉండి సంస్కృత ,పాళీ ,బౌద్ధాలపై విద్వా౦సుడయ్యాడు .ఆక్స్ ఫర్డ్ లో బోడెం ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ గా 1976 నుంచి 2004వరకు 28 ఏళ్ళు పనిచేశాడు .
బౌద్ధమత అధ్యయనం లో కాకలు తీరిన పండితుడు రిచర్డ్ .సమకాలీన సింహళ బౌద్ధం పై పరిశోధన చేసి ‘’ప్రిసేప్ట్ అండ్ ప్రాక్టిస్ –ట్రడిషనల్ బుద్ధిజం ఇన్ ది రూరల్ హైలా౦డ్స్ ఆఫ్ సిలన్ ‘’గ్రంధాన్ని 1971 లో ప్రచురించాడు .20 వ శతాబ్దపు ‘’తెర వాదబౌద్ధ’’మహా పండితులలో వ్రేళ్ళ మీద లెక్కించదగిన వారిలో రిచార్డ్ ఉన్నాడు .ఇప్పుడు బౌద్ధ అధ్యయనం లో రిచర్డ్ పేరు మీద ‘’గా౦బ్రిచియన్ ‘’పదం చోటు చేసుకొన్నది అంటే అతని ప్రమేయం ఎంత ఉందొ అర్ధమై పోతుంది .
40 ఏళ్ళకు పైగా ఆక్స్ ఫర్డ్ లో పని చేసి రిటైర్ అయ్యాక కూడా ఇంకా బోధిస్తూనే ఉన్నాడు .ఆయన 50 కి పైగా పరిశోధన పత్రాలు రాశాడు .అందులో సింహ భాగం బౌద్ధం మీదనే ఉన్నాయి .బౌద్ధ సంఘ లోని పెద్దలపైనా పరిశోధన చేశాడు .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో బౌద్ధ అధ్యయనం కోసం ‘’నుమత ఫౌండేషన్ ‘తో ఒక పీఠం’ఏర్పరచాడు. ఉన్నత విద్యాభి వృద్ధిపై మక్కువ ఉన్న రిచర్డ్ 2000సంవత్సరం లో టోక్యో యూని వర్సిటి లోని గ్రాడ్యుయేట్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ స్టడీస్ ఆహ్వానం పై వెళ్లి ‘’బ్రిటిష్ హయ్యర్ ఎడ్యుకేషన్ పాలిసి ఇన్ ది లాస్ట్ 20 యియర్స్ ‘’అనే అంశం పై ఉన్నత విద్య పై తనకున్న అభిప్రాయాలను వెల్లడించాడు .విజిటింగ్ ప్రొఫెసర్ గా ప్రిన్స్ టన్,కింగ్స్ కాలేజ్ –లండన్ ,హాంగ్కాంగ్ సియోల్ మొదలైన యూని వర్సిటీలను సందర్శించి బోధించాడు .ఆక్స్ ఫర్డ్ సెంటర్ ఫర్ బుద్ధిష్ట్ స్టడీస్ కు ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు .1994 నుండి 2002వరకు పాళీ టెక్స్ట్ సొసైటీ ప్రెసిడెంట్ గా పని చేశాడు .క్లే సాంస్క్రిట్ లైబ్రరీ కి జనరల్ ఎడిటర్ ఎమిరిటస్ హోదా ఉంది .
1993 లో కలకత్తా లోని ఏషియాటిక్ సొసైటీ ఆహ్వానించి సన్మానించింది .94 లో శ్రీలంక ప్రెసిడెంట్ ‘’శ్రీలంక రాణజ్న’’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు
..
సశేషం
మీ-గబ్బిట డుర్గాప్రసాద్ -22-9-16-ఉయ్యూరు