ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -3
8- జర్మన్ ఇండాలజిస్ట్ -దియోడర్ ఆఫ్రేట్
జర్మన్ ఇండాలజిస్ట్ అయిన ధియోదర్ ఆఫ్రేట్ 7-1-1822 న ప్రష్యన్ సైలీశియా లోని లేస్చిన్జ్ లో జన్మించి 3-4-1907న 85 వ ఏట మరణించాడు .1847 లో బెర్లిన్ లో గ్రాడ్యుయేషన్ చేసి ,అప్పుడే ‘’ట్రి టైట్ ఆన్ సంస్కృత ఆక్సేంట్ ‘’గ్రంధం క్రిస్చాఫ్ తో కలిసి రాసి వెలువరించాడు .1852 లో ఆక్స్ ఫర్డ్ కు మారి బోడియాన్ లైబ్రరీలో చదివాడు .1862 నుండి ,1875 వరకు 13 ఏళ్ళు స్కాట్ లాండ్ లోని ఎడిన్ బర్గ్ యూని వర్సిటి లో ప్రొఫెసర్ గా పని చేసి ,మొదటి సారిగా ఏర్పడిన ‘’సాంస్క్రిట్ ,కంపారటివ్ ఫైలాలజి ‘’పీఠాన్ని అధిష్టించాడు .1875 లో ఎల్.ఎల్.డి.డిగ్రీ పొందాడు .
1875 లో ఆఫ్రేట్ బాన్ యూని వర్సిటి ఇండాలజీ చైర్ పై కొలువయ్యాడు .14 ఏళ్ళు అందులో ఉన్నాడు .1891 నుంచి 1903 లోపు ‘’ఆల్ఫబెటికల్ కేటలాగ్ ఆఫ్ ఆల్ సాంస్క్రిట్ మాన్యు స్క్రిప్ట్ కలెక్షన్ ‘’చేశాడు .దీనికే ‘’కేటలాగ్ కేట లాగోరం ‘’అని పేరు పెట్టాడు .1935 నుండి అన్ని భారతీయ వ్రాత ప్రతులను అపూర్వం గా సేకరించిన ఘనత ఆయనది .మద్రాస్ యూని వర్సిటి ఆ నాటి వరకు ఉన్న వాటినన్నిటిని సేకరించి కేటలాగ్ తయారు చేసింది .ఉజ్వల దత్త వ్యాఖ్యానం ,డీ హైమేన్ డేస్ రిగ్వేద,ఆత్రేయ బ్రాహ్మణ ,కేతలాగో కేటలాగోరియం మూడు భాగాలు అఫ్రేట్ అద్భుత కృషి
.
9-స్కాటిష్ ఓరియెంటలిస్ట్ -జేమ్స్ రాబర్ట్ బాలంటైన్
స్కాటిష్ ఓరి యెంటలిస్టు జేమ్స్ రాబర్ట్ బాలంటైన్ 1813 లో జన్మించి 1864 లో మరణించాడు .1845 నుంచి వారణాసి సంస్కృత కళాశాలలో సూపరిం టే౦డెంట్ గా ఉన్నాడు .1861 లో లండన్ వెళ్లి ఇండియా ఆఫెస్ లైబ్రరీకి లైబ్రేరియన్ గా ఎన్నికయ్యాడు .
బాలం టైన్ సంస్కృత ,హిందే మరాటీ భాషలకు వ్యాకరణం రాశాడు.’’లఘు కౌముది ఆఫ్ వజ్ర దత్త ‘’ను1849 నుండి 52 లోపు కృషి చేసి ప్రచురించాడు .పతంజలి మహా భాష్యం మొదటి భాగాన్ని 1856 లో ప్రచురించాడు .ఈవిదం గా నేటివ్ ఇండియన్ వ్యాకరణ పద్ధతిని ను మొదటి సారిగా యూరోపియన్ విద్యా వేత్తల దృష్టికి తెచ్చాడు .ఇతర రచనలు –ఎలిమెంట్స్ ఆఫ్ హిందూ అండ్ వ్రజ్ భాషా గ్రామర్ ,హిందూ స్తాని సెలెక్షన్స్ ,పాకెట్ గైడ్ టు హిందూ స్తాని కన్వర్సే షన్ ,పర్షియన్ కాలి గ్రాఫి ,ప్రాక్టికల్ ఓరిఎంటల్ ఎంటర్ ప్రిటర్ ,కాటే చిజం ఆఫ్ సాంస్క్రిట్ గ్రామర్ ,క్రిస్టియానిటి కాం ట్రాస్తేడ్ విత్ ఇండియన్ ఫిలాసఫీ ,ఫస్ట్ లెసన్స్ ఇన్ సాంస్క్రిట్ గ్రామర్ .
10-బహు భాషా వేత్త మిత్రలాభ ప్రచురణ కర్త –ఫ్రాన్సిస్ జాన్సన్
179 5 లో పుట్టి 1876లో చనిపోయిన ఫ్రాన్సిస్ జాన్సన్ సంస్కృత ,తెలుగు ,బెంగాలి భాషలను ఈస్ట్ ఇండియా కాలేజి లో 1824 నుంచి 1855 వరకు 34 ఏళ్ళు బోధించాడు .పర్షియన్ ఆరబిక్ ,ఇంగ్లిష్ భాషలకు సమగ్ర నిఘంటువులు తయారు చేసి 1852 లో ప్రచురించాడు .యవ్వనం లో చార్లెస్ లాక్ ఈస్ట్ లేక తో కలిసి రోమ్,ఎదేన్స్ లను సందర్శించి 1824 లో మళ్ళీ లండన్ చేరుకొన్నాడు .హెర్ట్ ఫోర్ట్ హీత్ లో కాంగ్రి గేషనల్ చాపెల్ నిర్మాణం చేశాడు .హితోపదేశ ,మొదటి సంస్కృత పుస్తకం పేర మిత్రలాభం ప్రచురించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-16 –ఉయ్యూరు