ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -4
11-ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్ వేదం నేర్చిన –విలియం జోన్స్
28-9-1746 న ఇంగ్లాండ్ లోని వెస్ట్ మినిస్టర్ లో ఉన్న బ్యూఫోర్ట్ బిల్డింగ్స్ లో జన్మించిన విలియం జోన్స్ ఆంగ్లో వెల్ష్ ఫైలాలజిస్ట్ ,పూస్నే జడ్జి ,ప్రాచీన భాషా వేత్త .తండ్రిపేరు కూడా విలియం జేమ్స్ అవటం తమాషా .తండ్రి వేల్స్ లో గణిత శాస్త్ర వేత్త .గణితం లో ‘’పై ‘’గుర్తు ను కనిపెట్టిన వాడు కూడా . కొడుకు జోన్స్ బాల్యం లోనే ఇంగ్లీష్ వెల్ష్ గ్రీక్ ,లాటిన్ పెర్షియన్ ,అరెబిక్ ,హీబ్రూ ,చైనా భాషలను నేర్చి న బాల భాషా మేధావి .చనిపోయే నాటికి 13 భాషల్లో మహా పాండిత్యం మరో 28 భాషల్లో పాండిత్యం సాధించిన వాడు .అందుకే ఆయన్ను మహోన్నత బహుభాషా వేత్త అన్నారు .
తండ్రి చిన్నప్పుడే చనిపోతే తళ్లి మేరీ నిక్స్ అతి జాగ్రత్తగా పెంచి పోషించింది 1753 లో హారో లో చేరి తర్వాత ఆక్సఫర్డ్ లో చదివాడు .68 లో డిగ్రీ 1773 లో ఎం ఏ చేశాడు . ఫీజులు కూడా కట్ట లేనంత దరిద్రం తో బాధ పడి ఎర్ల్ స్పెన్సర్ కొడుకు ఏడేళ్ళ లార్డ్ ఆన్త్రాప్ కు ట్యూషన్ చెప్పాడు .ఆరేళ్ళు ట్యూటర్ గా అనువాదకుడుగా ఉంటూనే పర్షియన్ భాషలో మీర్జా మేహిది ఖాన్ అష్టార్ బాడి రాసిన ‘’హిస్టరీ ఆఫ్ నాదర్ ఛా ‘’ను ఫ్రెంచ్ భాషలోకి అనువదించాడు .దీన్ని డెన్మార్క్ రాజు ఏడవ క్రిస్టియన్ కోరికపై రాసి 24 ఏళ్ళకే ఓరిఎంటలిస్టు అనిపించుకొన్నాడు .ఇదే ఆయన మొదటి రచన
1770 లో ‘మిడిల్ టెంపుల్ లో చేరి మూడేళ్ళు’’లా’’ చదివటం తో ఇండియా వెళ్ళే అవకాశం వచ్చింది .30-4-1772 న రాయల్ సొసైటీకి ఫెలో గా ఎంపికై ,వేల్స్ లో సర్క్యూట్ జడ్జి గా పని చేసి , పారిస్ లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ పరిచయం తో అమెరికన్ విప్లవం విషయం లో రాజీ కుదర్చ లేక ,సుప్రీం కోర్ట్ ఆఫ్ జుడికేచర్ గా కలకత్తా లోని ఫోర్ట్ విలియమ్స్ లో పూస్నే జడ్జిగా1783 లో నియమింపబడి ,ఏప్రిల్ లో నైట్ హుడ్ పొందాడు .అన్నా మేరియా శిప్లీ ను పెళ్ళాడి ముగ్గురుపిల్లల్ని పొంది భార్య సాయం తో ఇండియా చరిత్రను డాక్యుమెంట్ చేశాడు
తీవ్ర భావాలున్న రాజకీయ ఆలోచనా పరుడైన విలియం జోన్స్ అమెరికా స్వాత్నత్ర్య పోరాటాన్ని సమర్ధించాడు . ‘’ప్రిన్సిపుల్స్ ఆఫ్ గవర్న్ మెంట్ ఇన్ ఎ డయలాగ్ బిట్వీన్ ఎ స్కాలర్ అండ్ ఏ పెజంట్ ‘’పుస్తకం రాసి ప్రచురించాడు .ముద్రణ తర్వాత రాజ ద్రోహం కింది నేర విచారణ ఎదుర్కొన్నాడు .దక్షిణ ఆసియా సంస్కృతులపై మోజు ఎక్కువై 15-1-1784 న కలకత్తాలో ‘’ఏషియాటిక్ సొసైటీ ‘’స్థాపించాడు .నాడీయ హిందూ యూని వర్సిటి కి చెందినా సంస్కృత పండితుడు రామ లోచన వద్ద వేదాలను అభ్యసింఛి నిష్ణాతుడయ్యాడు .జ్యోతిషం పై సామ్యుయాల్ డేవిస్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు .ఇదంతా తర్వాత ఆయన రచనా స్రవంతికి గొప్పగా దోహదం చేశాయి .ఇండియాలోని స్థానిక న్యాయం సంగీతం సాహిత్యం వృక్ష ,భూగోళ శాస్త్రాలపై విస్తృత౦ గా రచనలు చేశాడు .భారతీయ సాహిత్యాన్ని మొదటి సారిగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేశాడు .47 ఏళ్ళు మాత్రమె జీవించిన భారత భాషాభిమాని పండితుడు విద్యావేత్త విలియం జోన్స్ 27-4-1794 న కలకత్తా లో మరణించి సాహితీ లోకం లో తీవ్ర వెలితిని సృష్టించాడు .సౌత్ పార్క్ స్ట్రీట్ సేమేటరిలో ఖననం చేశారు .
విలియం జోన్స్ చేసిన అతి ముఖ్యమైన పని –ఇండో యూరోపియన్ భాషల మధ్య ఉన్న వారసత్వ బాంధవ్యాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేయటం.ఏషియాటిక్ సొసైటీ మూడవ వార్షికోత్సవం లో మాట్లాడుతూ సంస్కృత ,గ్రీకు,లాటిన్ భాషలకు ఒకే మూలం ఉందని ,అదే గోతిక్ ,సెల్టిక్ పెర్షియన్ భాషలనూకలుపుతోందనీ చెప్పాడు .ఈవిషయం విలియం జోన్స్ కంటే ముందే 16 వ శతాబ్దపు ఐరోపా యాత్రికులు గుర్తించి భారత ఐరోపా భాషలమధ్య సన్నిహిత సంబంధం ఉందని రాశారు .1653 లో ‘’వాన్ బాక్స్ హారన్ అనే భాషా వేత్త జర్మన్ ,‘గ్రీక్ బాల్టిక్ ,స్లావిక్ సెల్టిక్ ,ఇరానియన్ భాషలకు ’ప్రోటో లాంగ్వేజ్ ‘’అనే అభిప్రాయాన్ని ప్రతిపాదిస్తూ పుస్తకం రాశాడు .ఫ్రెంచ్ అకాడెమి సైన్సెస్ కు 1767 లో’’జీవితం అంతా ఇండియాలో గడిపిన ఫ్రెంచ్ జెసూట్ గాస్టన్ లారెనన్స్ కోర్ డాక్స్ ‘’సంస్కృతానికి యూరోపియన్ భాషలకు మధ్య ఉన్న సారూప్యతను నిర్ధారించి రాసిపంపాడు .1786 లో విలియం జోన్స్ –సంస్కృత ,ఇరానియన్ గ్రీక్ ,లాటిన్ జర్మన్ సెల్టిక్ భాషలకు ఒకే మూలం ఉందని ప్రతిపాదించాడు .అయితే జోన్స్ కృషి అతని ముందు వారి కృషి కంటే తక్కువే .హిందీ ని వదిలేసి ఇండో యూరోపియన్ భాషలలో ఈజిప్షియన్ జపనీస్ చైనా భాషల్ని జోన్స్ చేర్చాడు .ఈ సామాన్య ఆధార విషయం ‘’ప్రోటో –ఇండో –యూరోపియన్ ‘’గా పిలువ బడింది .
ఉపఖండం లో ఆర్యుల దండ యాత్ర విషయం ప్రతిపాదించి జాతుల మధ్య విభజన తెచ్చిన మొదటి వాడు విలియం జోన్స్ .కాని అతని దగ్గరున్న ఆధారాలు అసంపూర్తిగా ఉన్నాయి .1763 లో 17 వ ఏట జోన్స్ లాటిన్ భాషలో ఆరు లైన్లు ఉండే ఛందస్సులో ‘’కిస్సా ‘’అనే కవిత రాశాడు .దీనికి మాతృక చదరంగం పై 1527 లో ప్రచురింపబడిన ‘’స్కాచ్చియా లూడస్’’అనే 658 లైన్ల కావ్యం .దీనిభావం –వనదేవత కాస్యా మార్స్ పురోగమనాన్ని తిప్పి కొడుతుంది .మార్స్ అంటే కుజుడు క్రీడా దేవత సాయం కోరుతాడు .ఆయన చదరంగాన్ని సృస్టింఛి మార్స్ కు సాయం చేసి కాస్యా అభిమానం పొందేట్లు చేస్తాడు .ఈ చెస్ గేం లో మార్స్ కాస్యాను ఓడిస్తాడు అప్పటినుంచి చెస్ కు కాస్యా దేవతః అయింది .ఇదీ కద
తత్వ వేత్త కోపెన్ హార్ విలియం జోన్స్ రాసిన ‘’వరల్డ్ ఆజ్ విల్ అండ్ రిప్రేసేన్తెషణ్ ‘’నుఉదహరిస్తే, అమెరికన్ కవి ఎడ్గార్ అల్లెన్ పో తన బెర్నిస్ కదానికలో జోన్స్ కవితను పొందుపరచాడు .విలియం జోన్స్ దాదాపు 30 గ్రంధాలు రాశాడు
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-26-9-16 –ఉయ్యూరు
.