ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -7
15-లూడో రోచెర్
సంస్కృత విద్యా వేత్త ప్రొఫెసర్ లూడో రోచెర్ బెల్జియం లో 25-4-1926 న జన్మించి 72 లో అమెరికా పౌరుడయ్యాడు .ఘెంట్ యూని వర్సిటి నుండి పి హెచ్ డి పొందాడు .బ్రస్సెల్స్ యూని వర్సిటిలో 1956 నుండి పదేళ్ళు సంస్కృతం కంపారటివ్ ఫైలాలజీ బోధించాడు .అదే వర్సిటిలో 61 నుండి 67 వరకు ‘’సెంటర్ ఫర్ స్టేడి ఆఫ్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏసియా ‘’కు డైరెక్టర్ గా ఉన్నాడు .
ప్రొఫెసర్ నార్మన్ బ్రౌన్ ఆహ్వానం పై రోచెర్ అమెరికాలోని ఫిలడేల్ఫియాకు వెళ్లి పెన్సిల్వేనియా యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ గా నియమింప బడి 1966 నుండి 36 ఏళ్ళు నిరాటంకంగా 2002 వరకు పని చేశాడు .1991 లో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ పీఠానికి అధిపతి అయ్యాడు .అమెరికన్ ఓరిఎంటల్ స్టడీస్ కు చైర్మన్ అయి ,అమెరికన్ ఫిలసైకల్ సొసైటీ కి ,రాయల్ అకాడెమి ఆఫ్ ఓవర్సీస్ సైన్సెస్ (బెల్జియం )కు మెంబర్ గా ఫెలో ఆఫ్ ఏషియాటిక్ సొసైటీ గా ఉన్నాడు .భార్య రోసేన్ రాచెర్ తో కలిసి ఫిలడేల్ఫియా లో ఉంటున్నాడు.
సంస్కృతం లో 25 పుస్తకాలు రాశాడు .లెక్కలేనన్ని పత్రాలను సంస్కృత న్యాయ శాస్త్రం పై రచించాడు .భార్యతో కలిసి రాసిన ‘’దిమేకింగ్ ఆఫ్ వేస్త్రెన్ ఇండాలజీ ‘’గ్రంధానికి ‘’ఫాండేషన్ కొలిఎట్ కాలిఎట్ ‘’బహుమానం పొందాడు .’’ఫౌండర్స్ ఆఫ్ వెస్టర్న్ ఇండాలజీ ‘’,స్టడీస్ ఇన్ హిందూ లా అండ్ ధర్మ శాస్త్ర ,జీమూత వాహనాస్ దాయ భాగ ,ది పురాణాస్ ,స్మ్రుతి చింతామణి ఆఫ్ గంగాదిత్య, ది దీరీ ఆఫ్ ప్రూఫ్ ఇన్ ఎంసేంట్ ఇండియా ,వాచస్పతి మిశ్రా –వ్యావహార చింతామణి మొదలైన గ్రంధాలు బాగా ప్రసిద్ధమైనవి .రాచెర్ కు లబ్ధ ప్రతిస్తులైన రాబర్ట్ పి గోల్డ్మన్ ,ప్రొఫెసర్ సిగ్మే ఎం కొమేన్ వంటి శిష్యులు చాలా మంది ఉన్నారు .రాచెర్ దంపతులకు అనేక సంస్థలు బిరుదులిచ్చి సత్కారం చేశాయి
.
16-రోసేన్ రోచెర్
రోసేన్ రోచెర్ 10-8-1937న లో బెల్జియం లో మౌస్ కార్న్ లో జన్మించింది .క్లాసిక్స్ లోను ,ఇండో ఇండియన్ స్టడీస్ లోను ఎం ఏ డిగ్రీలు పొందింది .బ్రసెల్స్ యూని వర్సిటి నుండి సాంస్క్రిట్ లింగ్విస్టిక్స్ లో పి హెచ్ డి సాధించింబెల్జియం నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్లో ప్రి డాక్టరల్ ,పోస్ట్ డాక్ట్రల్ ఫెలోఅయింది .లూడో రోచెర్ ను పెళ్లి చేసుకొని ఫిలడెల్ఫియా వెళ్లి అక్కడ అమెరికన్ పౌరసత్వం పొందింది .1970 నుంచి పెన్సెల్వేనియా యూని వర్సిటి లో బోధిస్తూ ,డిపార్ట్ మెంట్ ఆఫ్ సౌత్ ఏసియా స్టడీస్ చైర్ అధిస్టించి ,సౌత్ ఏసియా నేషనల్ రిసోర్స్ సెంటర్ కు డైరెక్టర్ అయి ,ఏసియన్ అమెరికన్ స్టడీస్ ప్రోగ్రాం కు వ్యవస్థాపక డైరెక్టర్ అయింది .
ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ నేషనల్బయాగ్రఫీ ,యెన్ సైక్లో పీడియా ఆఫ్ ఏసియన్ హిస్టరీ ,హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ సైన్సెస్ ఇంటర్నేషనల్ యెన్ సైక్లో పీడియా ఆఫ్ లింగ్విస్టిక్స్ ,ఎన్సైక్లో పీడియా ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్స్ మొదలైన ఉద్గ్రందాలకు సహకరించింది .సంస్కృత సాహిత్యం పై పుస్తకాలు రాసింది .ది మేకింగ్ ఆఫ్ వెస్స్టర్న్ ఇండాలజీ ‘’గ్రంధానికి భర్త లూడో రోచెర్ తో కలిసి ఫా౦డేషన్ కోలేటీ కేలియాట్ అవార్డ్ అందుకొన్నది
ప్రైవేట్ ఫార్త్యూన్స్ అండ్ కంపెని ప్రాఫిట్స్ ఇన్ ఇండియన్ ట్రేడ్ ఇన్ యైటీ౦త్ సెంచరి ,ఇండియా అండ్ ఇండాలజీ ,అలేక్సాండర్ హామిల్టన్ మొదలైన గ్రంధాలు రాసింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-16 –ఉయ్యూరు