ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -1124-హితోపదేశం పై పరిశోధించిన –జోహాన్నెస్ హెర్టేల్
13-3-1872 న జన్మించి 27 -10-1955 న మరణించిన జోహాన్నెస్ హెర్టేల్ జర్మన్ ఇండాలజిస్ట్ .ఇండాలజీ పై విశ్రుమ్ఖలంగా వ్యాసాలూ రాశాడు .అతని అభిమాన విషయాలు భారతీయ సాహిత్యమూ అందులో ముఖ్యంగా వేదాలు .పంచతంత్ర చరిత్రపై శాస్త్రీయ పరి శోధన చేశాడు .1897 లో హితోపదేశం పై పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసం రాసి లీప్జిగ్ యూని వర్సిటి నుండి పి .హెచ్ డి.పొందాడు .1919 నుండి 1937 వరకు 18 ఏళ్ళు లీప్జిగ్ యూని వర్సిటి లో ప్రొఫెసర్ అండ్ చైర్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ గా ఉన్నాడు .అక్కడ ఆసియా ,ఇండో యూరోపియన్ భాషలు ,సంస్కృతం వేదం ,జెంద్ అవెస్తా లను బోధించాడు .ఈ భాషలలోని ఎన్నో గ్రంధాలను జర్మన్ భాషలోకి అనువాదం చేశాడు .వేదం పైనా అవెస్తా పైనా రాసిన ‘’ఇండో ఇరానియన్ సోర్సెస్ అండ్ రిసెర్చ్ ‘’పేరిట ధారావాహికంగా ప్రచురింప బడినాయి .వీటిని ఆయనే ఎడిట్ చేశాడు కూడా .
1933 లో హీర్టేల్ జర్మన్ సోషలిస్ట్ పార్టీకి, హిట్లర్ కు విధేయుడిగా ఉంటానని శపథం చేశాడు .సాక్సోనియాన్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ,రాయల్ ఏషియాటిక్ సొసైటీ లండన్ కు సభ్యుడుగా ఉన్నాడు .ఆయన జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు లీప్జిగ్ యూని వర్సిటి లైబ్రరీలో భద్ర పరిచారు .అతని రచనలు –ది సదరన్ పంచతంత్ర ,పంచాఖ్యాన కధలు ,పూర్ణ భద్రాస్ పంచతంత్ర .
25-రామాయణ ,భారతాలపై పరిశోధించిన –ఆల్ఫ్ హిల్టే బీటెల్
కొలంబియాకు చెందిన ఆల్ఫ్ హిల్టే బీటెల్ అమెరికాలోని జార్జి వాషింగ్టన్ యూని వర్సిటి లో రిలీజియన్ ,హిస్టరీ ,హ్యూమన్ సైన్సెస్ కు ప్రొఫెసర్ .పురాతన భారతీయ కావ్యాలైన రామాయణ ,మహా భారతాలపై మత సంప్రదాయం ,జానపదం లపై పరిశోధన చేశాడు .
బీటెల్ హార్వర్డ్ కాలేజి నుంచి బి ఏ డిగ్రీ పొంది ,మతం ముఖ్య విషయంగా ,ఇంగ్లీష్ ను సెకండరీ గా తీసుకొని 1959- నుండి 1963 వరకు చదివాడు .1964 నుండి నాలుగేళ్ళుయూని వర్సిటి ఆఫ్ చికాగో డివినిటి స్కూల్ లో చదివి హిస్టరీ ఆఫ్ రెలిజియన్ లో ఎం .ఏ డిగ్రీ తీసుకొని 1973 లో పి .హెచ్ .డి.అందుకొన్నాడు .పరిశోధన వ్యాసంగా ‘’గాడ్స్ హీరోస్ అండ్ కృష్ణ – ఎ స్టేడి ఆఫ్ దిమహాభారత ఇన్ రిలేషన్ టు ఇండియన్ అండ్ ఇండో యూరోపియన్ సింబాలిజం ‘’రాశాడు .
న్యు యార్క్ సిటి లోని సీ బరీ ప్రెస్ కు 1963 నుండి 6 4 వరకు ఎడిటోరియల్ అసిస్టంట్ గా ఉన్నాడు .ఇదే స్థాయిలో హిస్టరీ ఆఫ్ రెలిజియన్స్ జర్నల్ కూ పని చేశాడు .తర్వాత వాషింగ్టన్ యూని వర్సిటి అసిస్టంట్ ప్రొఫెసర్ గా ,అసోసియేట్ ప్రొఫెసర్ గా ,1981 లో ప్రొఫెసర్ గా పదోన్నతులు పొందాడు .సారబాన్ ,విస్కాసిన్ యూని వర్సిటీలలో నూ ,దక్షిణ భారత దేశం లోను ఆహ్వానం పై ఉపన్యాసాలిచ్చాడు .2009 నుండి ‘’ఆక్స్ ఫర్డ్ బిబ్లియోగ్రఫిక్ ఆన్ లైన్ కు హిందూ ఇజం పై ఎడిటర్ ఇన్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు .మోతీలాల్ బనారసీ దాస్ పబ్లిషర్ లకు ‘’ఇండియాస్ సాస్క్రిట్ ఎపిక్స్ –టెక్స్ట్ అండ్ ట్రడిషన్ సిరీస్ కు కూడా ఎడిటర్ ఇన్ చీఫ్ గా ఉన్నాడు .
గుగ్గెన్ హీం ఫెలో షిప్ ,వుడ్రో విల్సన్ ఫెలో షిప్ లతోపాటు అనేక పురస్కారాలు అందుకున్నాడు బీటెల్ .’’లేడీ ఆఫ్ జింజి –సౌత్ ఇండియన్ ద్రౌపది ఫెస్టివల్స్ ‘’కు 1988 లో డైరెక్టర్ .రచనలు –ది రిట్యువల్స్ ఆఫ్ బాటిల్ –కృష్ణ ఇన్ ది మహా భారత ,ది కల్ట్ ఆఫ్ ద్రౌపది ,రీ థింకింగ్ ఆఫ్ ఇండియాస్ ఓరల్ అండ్ క్లాసికల్ ఎపిక్స్ ,రి థింకింగ్ ది మహా భారత ,ధర్మాస్ ఇన్ ఎర్లి హిస్టరీ లా, రెలిజియన్ అండ్ నారేటివ్ ,రీడింగ్ ది ఫిఫ్త్ వేద (భారత ),వెన్ ది గాడెస్ వాస్ ఏ వుమన్ –వగైరా .
సంపాదకుడుగా –క్రిమినల్ గాడ్స్ అండ్ డెమన్ డివోటిస్ ,హెయిర్ ఇట్స్ మీనింగ్ అండ్ పవర్ ఇన్ ఏసియన్ కల్చర్స్ ,ఈజ్ ది గాడెస్ ఏ ఫెమినిస్ట్ ? ది పాలిటిక్స్ ఆఫ్ సౌత్ ఏసియన్ గాడేసేస్ ‘’ గ్రంధాలు వెలువరించాడు .
26-హిందూ ,బౌద్ధ గ్రంధాలను చైనీ భాషలోకి అనువదించిన –పద్మశ్రీ హువాన్ బావో షెంగ్
1942 జులై లో జన్మించిన హువాన్ బావో షెంగ్ సంస్కృత ,పాళీ భాషలను అధ్యయనం చేసిన భాషా వేత్త .సంస్కృత ,పాళీ గ్రంధాలను చైనా భాషలోకి అనువదిం చిన ఘనుడు .ముఖ్యంగా భారతం భాగవతం భగవద్గీత ఉపనిషత్తులు ,లలిత విస్తారసూత్రం ,వజ్ర చ్చేదికా వంటిఅపురూప గ్రంధాను చైనా భాషలోకి తర్జుమా చేసిన వాడు .
1942 జులై లో షాంఘై లో జన్మించి ,పెకింగ్ యూని వర్సిటిలో ప్రాచ్య భాషలలో డిగ్రీ పొంది ,సంస్కృత ,పాళీ భాషలపై ప్రత్యేక కృషి చేసి పెకింగ్ యూని వర్సిటిలో రిటైర్ అయ్యాడు .గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ చైనీస్ అకాడెమి ఆఫ్ సోషల్ సైన్సెస్ లో విదేశీ భాషల పరిశోధకుడుగా ఇంకా పని చేస్తున్నాడు .చైనా ఫారిన్ లిటరేచర్ సొసైటీకి ,ఇండియన్ లిటరేచర్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ లకు అధ్యక్షుడు . చైనా కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడు కూడా .
మహా భారతాన్ని చైనా భాష లోకి అనువదించే కార్యక్రమం 1989 లో జాలో గుహోవా ,జి బిజువాంగ్ లసంపాదకత్వం లో ప్రారంభమై ఆది పర్వం పూర్తీ చేశారు .తర్వాత హువాన్ బావో షెంగ్ నాయకత్వం లో లోఅయిదుగురు సభ్యుల కమిటి 1993 లో దీని బాధ్యతా చేబట్టి ,2003కు మొత్తం 18 పర్వాల భారతాన్నీ చైనీస్ భాషలోకి మార్చేశారు.దీనిని మళ్ళీ సమీక్ష చేసి హువాన్ సంపాదకత్వం లో 2005కు మొత్తం 6 భాగాలుగా ముద్రించారు .
క్లాసికల్ పోఎటిక్స్ ఆఫ్ ఇండియా గ్రంధాన్ని హువాన్ రాశాడు. హువాంగ్ కు అనేక పురస్కారాలు లభించాయి అందులో కొన్ని –య౦గ్ అండ్ మిడ్ఎజేడ్ ఎక్స్ పెర్ట్ ,ప్రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఆనర్,చైనా ఇవ్వగా , 2015 లో భారత ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారం అందించి గౌరవించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-16 –ఉయ్యూరు