ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -12
27-ప్రాకృత కర్పూర మంజరి నాటకాన్ని అనువదించిన అమెరికా సంస్కృతాచార్యుడు –చార్లెస్ రాక్ వెల్ లాన్మన్
చార్లెస్ లాక్ వెల్ లాన్మన్ అమెరికాలో నార్త్ కనెక్టి కట్ లో తొమ్మిది మంది సంతానం లో ఎనిమిదవ వాడుగా 8-7-18 50 న జన్మించాడు .మూడో ఏటనే తళ్లి చనిపోతే ఆంట్ అబిగెల్ పోషణ బాధ్యత తీసుకొన్నది .ఆమె గొప్ప ఆర్టిస్ట్ .అమెరికన్ రివల్యూషనరి ఆర్టిస్ట్ జాన్ ట్రంబుల్ కు చెందిన ఆస్తితోపాటు ,ఆయన చిత్రించిన విలువైన పెయింటింగ్ లు స్కెచ్ లు ఆమెకు సంక్రమించాయి .పదేళ్ళ వయసులో చార్లెస్ అమెరికన్ ఓరిఎంటల్ సోఅసైటీ వారి జర్నల్ ఒకటి చదివాడు .అందులో భారతీయ ఖగోళ శాస్త్రానికి నికి చెందిన విలువైన వ్యాసం చదివి సంస్కృతం పై విపరీతమైన ఆసక్తి పెంచుకొన్నాడు .
1871 లో ఏల్ కాలేజి నుండి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గా గ్రీక్ ను జేమ్స్ హాడ్లి వద్ద ,సంస్కృతాన్ని డబ్ల్యు .డి.విట్ని వద్ద అభ్యసించి 1875 లో డాక్టరేట్ పట్టా పొందాడు . ,జర్మనీలో వెబర్ రోత్ ల వద్ద సంస్కృతాన్ని మెరుగు పరచుకొని ,జార్జి కర్టియస్ ,ఆగస్ట్ లస్కియన్ ల దగ్గర ఫైలాలజి1873 -76 మధ్య నేర్చాడు .ప్లిమత్ కాలనీకి చివరి గవర్నర్ అయిన ధామస్ హింక్లి వారసురాలు మేరి బిల్లింగ్స్ హింక్లి ని పెళ్లి చేసుకొన్నాడు .కొత్త భార్యతో ఇండియాకు హనీమూన్ కు వచ్చి ఇండియా అంతా పర్యటించి 500విలువైన సంస్కృత ప్రాకృత గ్రంధాలు వ్రాత ప్రతులు కొని హార్వర్డ్ యూని వర్సిటికి అందజేశాడు .అవి ఫిట్జ రాల్డ్ హాల్ లో భద్రపరచారు .వీటిని తన సంపాదకత్వం లో ప్రొఫెసర్ లాన్మన్ హార్వర్డ్ ఓరిఎంటల్ సిరీస్ గా ముద్రించాడు .1890 లో ఇండియా నుంచి తిరిగి వెళ్ళాక కేంబ్రిడ్జి లోని 9 ఫర్రార్ స్ట్రీట్ లో స్వంత గృహాన్ని నిర్మించుకొన్నాడు .
1876 లో జాన్ హాప్కిన్ యూని వర్సిటి ప్రారంభమైనపుడు వారి ఆహ్వానం తో 1876 నుంచి నాలుగేళ్ళు సంస్కృత ప్రొఫెసర్ గా పని చేశాడు .1880లో హార్వర్డ్ యూని వర్సిటి కి వెళ్లి ఇండో –ఇరానియన్ భాషల కు మొట్టమొదటి ప్రెసిడెంట్ అయ్యాడు .అదే 1902 లో ఫైలాలజి డిపార్ట్ మెంట్ అయింది .తర్వాత సంస్కృత ,ఇండియన్ స్టడీస్ డిపార్ట్ మెంట్ గా 1951 లో మారింది .1911 -1912 మధ్య ప్రఖ్యాత కవి టి ఎస్ ఇలియట్ ఇక్కడే విద్యార్ధిగా చదివి ఫిలాసఫీలో డాక్టరేట్ పొందాడు .
1879—1884 మధ్య అయిదేళ్ళు లాన్మన్ ట్రాన్సాక్షన్స్ కు సెక్రెటరి ,ఎడిటర్ గా ,18 90-9 1 లో అమెరికన్ ఫైలలాజికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశాడు .1884 నుండి పదేళ్ళు 1894 వరకు అమెరికన్ ఓరిఎంటల్ సొసైటీ కి కరస్పాండెంట్ సేక్రటరిగా ఉన్నాడు .1897 నుంచి 1907 వరకు పదేళ్ళు వైస్ ప్రెసిడెంట్ గా ,1907 నుండి -1908 వరకు ప్రెసిడెంట్ గా పనిచేశాడు .
బెంగాల్ ,ఫ్రాన్స్ ,ఇంగ్లాండ్ ఏసి యాటిక్ సొసైటీలకు గౌరవ ఫెలో అయ్యాడు .గాటిన్జన్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ ,రష్యన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ,ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్స్ లకు కరస్పా౦డింగ్ మెంబర్ పదవీ గౌరవం పొందాడు .అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కు ఫెలో ను చేసి అమెరికా ప్రభుత్వం గౌరవించింది. 1902 లో ఏల్ నుండి ఎల్ ఎల్ డి,అబెర్డీన్ యూని వర్సిటి 400 వార్షికోత్సవ సందర్భంగా లాన్మన్ కు ఎల్ ఎల్ డి నిచ్చి సన్మానించారు
హార్వర్డ్ ఓరిఎంటల్ సిరీస్ లో లాన్మన్ రాజ శేఖరుని ‘’కర్పూర మంజరి’’ అనే ప్రాకృత నాటకాన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి 1900 లో ప్రచురించాడు . ,విట్నీ ఆంగ్లీకరించిన అధర్వ వేద సంహిత లోని లోపాలను పరిశీలించి పునర్మూల్యాంకనం చేసి తన సంపాదకత్వం లో రెండుభాగాలుగా 2005లో ప్రచురించాడు .సాంస్క్రిట్ రీడర్ విత్ వకాబ్యులరి అండ్ నోట్స్ రాసి ప్రచురించాడు .ఇదే ఇప్పటికీ నాణ్యమైన ఆదర్శమైన ఉపోద్ఘాత గ్రంధంగా మన్ననలు పొందుతోంది .
1926 లో హార్వర్డ్ లో లాన్మన్ రిటైరై ,గౌరవ స్థానం లో (ఎమెరిటస్) లో ఉన్నాడు .అమెరికాలో ఉన్న ప్రస్తుత సంస్కృత విద్వాంసులు ,సహకారులు లాన్మన్ శిష్య బృందం లోని వారే .88 వ ఏడు వచ్చేదాకా లాన్మన్ చార్లెస్ నదిలోరోజూ పడవ పై తిరిగేవాడు .అందుకే ఆయనను’’చార్లెస్ రివర్ లాన్మన్ ‘’అని సరదాగా పిలుస్తారు .చార్లెస్ నది పై 12 వేల మైళ్ళు ప్రయాణించిన ఘనత చార్లెస్ లాన్మన్ ది .20- 2-1941 న సంస్కృత సాహిత్య సాగరాన్ని , ,చార్లెస్ నదిని ఈది రికార్డ్ సృష్టించిన చార్లెస్ రాక్ వెల్ లాన్మన్ 90 వ ఏట పరమ పదించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-10-16 –ఉయ్యూరు