ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -13
28-లలిత విస్తారసూత్రం అనువదించిన జర్మన్ ఫైలాలజిస్ట్ –సాల్మన్ లెఫ్ మాన్
జర్మనీలో వెస్ట్ ఫేలియా లో 25-12 -1831 న జన్మించిన సాల్మన్ లెఫ్ మాన్ జూయిష్ ఫైలాలజిస్ట్ .స్వంత ఊరిలో జ్యూయిష్ స్కూల్ లో చదివి ,బెర్లిన్ లోని హీడెల్ బెర్గ్ యూనివర్సిటి లో, పారిస్ లలో చదివి బెర్లిన్ యూని వర్సిటి నుండి 1864 లో పి హెచ్ .డి .పొందాడు .1866 లో హీల్డ్ బెర్గ్ కు ప్రైవేట్ డోసేంట్ ఆఫ్ సాంస్క్రిట్ అయ్యాడు .1870 లో అసోసియేట్ ప్రొఫెసర్ అయి ,1901 లో ఆనరరి ప్రొఫెసర్ అయ్యాడు .1803 లో గౌతమ బుద్ధజీవిత చరిత్ర అయిన లలిత విస్తారాన్ని అనువాదం చేసి తన సంపాదకత్వం లో ముద్రించాడు .ఫ్రాంజ్ బాప్ పైన పుస్తకం రాశాడు .1898 లో హిస్టరీ ఆఫ్ ఎన్సేంట్ ఇండియా రచించాడు .జర్మన్ భాష ఒకే రకమైన ఉచ్చారణ తో ఉండాలన్న ఉద్యమానికి నాయకత్వం వహించాడు .యూని వర్సిటిలో ఉద్యోగం చేస్తూనే స్వగ్రామం వెస్ట్ ఫెలియా లో అనేక చిన్న చిన్న వర్గాలవారికి ప్రైవేట్ ట్యూటర్ గా ,స్కూల్ మాస్టర్ గా పని చేసి ఆభాషాభి వృద్ధికి గొప్ప కృషి చేశాడు .పేద ప్రజల సహాయార్ధం జేడేకా వేరీన్ సొసైటీ ఏర్పరచి అధ్యక్షుడయ్యాడు .14-1-1912 న హీల్దేన్ బెర్గ్ లో లెఫ్ మాన్ 81 వ ఏట చనిపోయాడు
.
29-సంస్కృత శబ్దోత్పత్తి నిఘంటు రచన చేసిన –ఆస్ట్రియా సంస్కృత విద్వాంసుడు –మాన్ఫ్రేడ్ మేఫేర్
26-9-1926 న జన్మించి 31-10-2011 న మరణించిన మాన్ఫ్రేడ్ మే ఫేర్ ఆస్ట్రియాన్ ఇండో యూరోపియన్ విద్వాంసుడు .ఇండో ఇరానియన్ భాషలపై స్పెషలైజ్ చేశాడు .వియన్నా వర్సిటిలో ప్రొఫెసర్ ఎమెరిటస్ గా ఉన్నాడు .సంస్కృత ఎటిమలాజికల్ డిక్షనరీ నిర్మాణ ఘటికుడు .లింజ్ లో పుట్టి , గ్రాజ్ యూని వర్సిటి లో ఇండో యూరోపియన్ మరియు సెమెటిక్ లింగ్విస్టిక్స్ చ చేశాడు .19 63 నుంచి 66 వరకు సార్లాండ్ యూని వర్సిటి ప్రొఫెసర్ గా ఉన్నాడు .1966 లో ఆస్ట్రియాకు తిరిగి వెళ్లి వియన్నా యూని వర్సిటి ప్రొఫెసర్ అయి 1990లో 8 5 ఏళ్ళ వయసులో చనిపోయేదాకా పనిచేశాడు .దాదాపు 13 ఉద్గ్రంధాలు రాశాడు .1982 లో అప్పర్ ఆస్ట్రియా నుంచి కల్చరల్ ప్రైజ్ ను ,8 6 లో ‘’ఆస్ట్రియన్ డెకరేషన్ ఫర్ సైన్స్ అండ్ ఆర్ట్ అవార్డ్ ,88 లో వీల్మన్ హార్టల్ ప్రైజ్ ,2004 లో కార్డినల్ ఇన్నిత్జర్ ప్రైజ్ లను మాన్ఫ్రేడ్ మేఫెర్ అందుకొన్నాడు.