ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -14
30- ఋగ్వేదాన్ని స్వంత గొంతుకతో చదివి రికార్డ్ చేసి ,ప్రచురించిన భాషా పండితుడు –ఫ్రీడ్రిక్ మాక్స్ ముల్లర్
6-12-1823 న జర్మనీలోని డేస్సూ లోజన్మించిన లిరిక్ పోయేట్ సంగీతా కారుడు వీల్హెం ముల్లర్ కుమారుడు.మాక్స్ ముల్లర్ .తల్లి అన్హార్ట్ డేస్సూ ప్రైం మినిస్టర్ కూతురైన ఆడెల్ హెడ్ ముల్లర్ . మేనమామ ఫ్రీడ్రిక్ ఒక ఒపెరానాటకం లో ముఖ్య పాత్ర మాక్స్ వేషం వేసేవాడు .ఆ పేరే ముల్లర్ కు పెట్టారు .ఈ మేనమామ మేనల్లుడిని పెంపుడు కొడుకుగా తీసుకొన్నాడు .చాలా అధికారిక పత్రాలలో, మారేజ్ సర్టిఫికే, యూని వర్సిటి రిజిస్టర్ ,,గౌరవ పత్రాలలో ,ముద్రించిన కొన్ని పుస్తకాలలో ఆయన పేరు’’ మాక్సి మిలియన్’’ అనే ఉంది.డేస్సూ లో జిమ్నేసియం లో చదివి ,తర్వాత లీప్జిగ్ నికోలాయి స్కూల్ లో చేరి మ్యూజిక్ ,క్లాసిక్స్ చదివాడు .అప్పుడే ఫెలిక్స్ మెండేల్సన్ ను తరచూ కలుసుకోనేవాడు.
లీప్జిగ్ యూని వర్సిటిలో చేరి చదవటానికి స్కాలర్ షిప్ కోసం పరీక్షలు రాసే ప్రయత్నం లో తాను అప్పటి దాకా చదివిన చదువు చాలదని గ్రహించి అతి వేగం గా లెక్కలు ,ఆధునిక భాషలు సైన్స్ లను నేర్చుకొన్నాడు. పరీక్షలు పాసై లీప్ జిగ్ యూని వర్సిటిలో 1841 లో పూర్వంచదివిన మ్యూజిక్ ,కవిత్వాలకు ఉద్వాసన చెప్పి ఫిలాసఫీ సబ్జెక్ట్ తీసుకొన్నాడు .1843 లో డిగ్రీ పొంది ,స్పినోజాస్ ఎథిక్స్ పై డేసెర్టేషన్ రాశాడు .గ్రీక్ లాటిన్ పర్షియన్ సంస్కృతం అరబిక్ భాషాధ్యయనం పై ఆసక్తి చూపాడు .
1850 లో ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటిలో మోడరన్ యూరోపియన్ లాంగ్వేజెస్ కు టేలరియన్ ప్రొఫెసర్ గా నియమింప బడ్డాడు .ధామస్ గై ఫోర్డ్ సలహాపై ఆయనకు గౌరవ ఎం. ఏ .డిగ్రీ నిచ్చి ,ఆక్స్ ఫర్డ్ లోని క్రిస్టియన్ చర్చి కాలేజి మెంబర్ గా కూడా తీసుకొన్నారు .1854 లో ప్రొఫెసర్ అయి ఇప్పుడు సాధికారికంగా ఎం .ఏ .ను కాన్వోకేషన్లో పొందాడు .1858 లో ఆల్ సూయిస్ కాలేజి కి లైఫ్ ఫెలో అయ్యాడు .
1860 లో సంస్కృత బోడేన్ ప్రొఫెసర్ ఎన్నికలో పోటీ చేసి మాక్స్ ముల్లర్ మోనియర్ మోనియర్ విలియమ్స్ చేతిలో ఓడిపోయాడు .విలియమ్స్ కన్నా ఎంతో ప్రతిభా సంపన్నుడే కాని ముల్లర్ కు ఓటమి తప్పలేదు .ఇండియాపైన సరైన అవగాహన లేక పోవటం ,మత విషయం లో ఉదారంగా ఉండటం ,జర్మనీ వాడుకావటం ముల్లర్ ఓటమికి కారణాలయ్యాయి .ఈ విషయం పై తల్లికి జాబు రాస్తూ ‘’ all the best people voted for me, the Professors almost unanimously, but the vulgus profanum made the majority”.[7]’’
అని మనసులో బాధను వెళ్ళ గక్కాడు .1868 లో ఆయన కోసమే ఏర్పాటు చేసిన కంపారటివ్ ఫైలాలజి కి మొదటి ప్రొఫెసర్ అయ్యాడు ముల్లర్ ..1875 లో రిటైర్ అయినా 28-10-1900 న చని పోయేదాకా అందులోనే పని చేశాడు .
1844 లోనే జర్మనీలో ఫ్రీడ్రిక్ స్కీలింగ్ తో కలిసి ముల్లర్ సంస్కృతం చదివాడు .స్కీలింగ్ కోసం ఉపనిషత్ లను అనువాదం చేశాడు .ఇండో యూరోపియన్ భాషాధ్యయనం చేసిన మొదటివాడైన ఫ్రాంజ్ బొప్ప వద్ద సంస్కృత౦ పై పరిశోధన చేశాడు.భాషా చరిత్రను మత చరిత్రతో ముడిపెట్టినవాడు స్కీలింగ్.అప్పుడే ముల్లర్ హితోపదేశం ను జర్మని భాషలోకి అనువదించి ప్రచురించాడు .1845 లో పారిస్ వెళ్లి యూజీన్ బర్నాఫ్ వద్ద సంస్కృతం మెరుగు పరచుకొన్నాడు .యూజీన్ బర్నాఫ్ ముల్లర్ ను ఋగ్వేదాన్ని ఇంగ్లాండ్ లో లభ్యమైన వ్రాత ప్రతులు ఆధారం గా సంస్కృతం లో ప్రచురించమని కోరాడు .1846 లో లండన్ వెళ్లి ఈస్ట్ ఇండియా కంపెని సేకరించిన సంస్కృత గ్రంధాలను అధ్యయనం చేశాడు .దీనితో బాటు సృజనాత్మకం గా ‘’జర్మన్ లవ్ ‘’అనే నవల రాశాడు అది బాగా ప్రసిద్ధి చెందింది .
ఈస్ట్ ఇండియా కంపెనీ ,ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి సంస్కృత విద్వాంసుల పరిచయం తో భారతీయ సంస్కృతీ పై బ్రిటన్ లో సాధికారికంగా మాట్లాడే వారిలో మాక్స్ ముల్లర్ ముఖ్యుడయ్యాడు .ఇదేసమయం లో ఇంగ్లాండ్ భారత దేశం పై సార్వ భౌమాదికారం పొందింది. దీనితోభారత ఇంగ్లాండ్ విద్వాంసుల మధ్య అనేక క్లిష్ట సమస్యలేర్పడ్డాయి .మాక్స్ ముల్లర్ బ్రహ్మ సమాజం వారితో సన్నిహితంగా ఉండటం సమస్యను మరింత జటిలం చేసింది .ముల్లర్ సంస్కృతాధ్యయన కాలం లో సాంస్కృతిక అభివృద్ధి పైననే భాషాభి వృద్ధి జరుగుతుంది అనే అభిప్రాయం బలపడిన సమయం లో సాగింది .వేద సంస్కృతీ యూరోపియన్ క్లాసికల్ సంస్కృతి కంటే అతి ప్రాచీనమైనదిఅని ఇండో యూరోపియన్ భాషలలో సంస్కృతమే అతి ప్రాచీనమైనది అనే అభిప్రాయం బలపడింది .
ముల్లర్ ఈ కోణం లో సంస్కృతాన్ని ఆనాటి మేటి సంస్కృత విద్వాంసు లందరి కంటే ఎక్కువగా అధ్యయనం చేశాడు .పాగాన్ యూరోపియన్ మతాల గురించి తెలియాలి అంటే వేద సంస్కృతిని అధ్యయనం చేయాల్సిందే అని చెప్పాడు .అందుకే ఋగ్వేదం పై అభిమానం ఎక్కువైంది. రామ కృష్ణ పరమహంస గారి వేదాంత ధోరణి పై ఆసక్తీ ఎక్కువైంది ఆయనకు .తర్వాత ఉపనిషత్ లపై అధ్యయనం చేశాడు .ఉపనిషత్ వేదాంత౦ వేదిక్ బ్రాహ్మనిజం కు ముందున్న ‘’హీనో ధిజం ‘’ నుండి ఏర్పడింది అన్నాడు.లండన్ వెళ్లి బ్రిటిష్ ఇండియా కంపెని వద్ద ఉన్న రుగ్వేద వ్రాత ప్రతులను 1849 నుండి 1874 వరకు 25 ఏళ్ళు పరిశోధించి ప్రచురించాడు .స్వంత గొంతుకతో ఋగ్వేదాన్ని గ్రామ ఫోన్ పై రికార్డ్ చేశాడు .దీనికి ఈస్ట్ ఇండియా కంపెనీ ముల్లర్ కు డబ్బు బాగానే ముట్ట జెప్పింది ..కాని ఋగ్వేద ప్రచురణ ముల్లర్ గొప్పతనం కాదని అంతకు ముందే జర్మన్ విద్వా౦సుడొకడు ఆపని చేశాడని ,కాని పేరు మాక్స్ ముల్లర్ కు వచ్చిందని సైంటిఫిక్ అమెరికన్ పేపర్ లో 8-12-1900 లో ప్రచురితమైనది. “Rig Veda,” was in reality not his at all. A German scholar did the work, and Muller appropriated the credit for it.” [12].
రోమా౦టిజం లో చాలా భావాలకు ముల్లర్ మద్దతు పలికాడు .ఋగ్వేద దేవతలు ప్రకృతి శక్తులే అన్నాడు .1888 లో ముల్లర్ గ్లాస్కో యూని వర్సిటి జిఫ్ఫోర్డ్ లెక్చరర్ అయ్యాడు .అనేక స్కాటిష్ యూనివర్సిటీలలో నాలుగేళ్ళు ప్రసంగాలు చేశాడు .ఆయన ప్రసంగ విషయాలు –నేచురల్ రిలీజియన్ ,ఫిజికల్ రిలీజియన్ ,ఆన్త్రోపోలాజికల్ రిలీజియన్ ,దియాసఫీ ఆఫ్ సైకలాజికల్ రిలీజియన్ .1881 లో ఇమాన్యుయాల్ కాంట్స్ క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ ను అనువదించాడు .కాంట్ చెప్పిన ట్రాన్సెండలిజం ను ఆరాధించాడు .డార్విన్ సిద్ధాంత అభివృద్ధిని వ్యతిరేకించాడు .language forms an impassable barrier between man and beast.”[17]అనేది ముల్లర్ అభిప్రాయం .
.28-5-1896 న స్వామి వివేకానంద మాక్స్ ముల్లర్ దంపతులను కలుసుకొన్నాడు The visit was really a revelation to me. That little white house, its setting in a beautiful garden, the silver-haired sage, with a face calm and benign, and forehead smooth as a child’s in spite of seventy winters, and every line in that face speaking of a deep-seated mine of spirituality somewhere behind; that noble wife, the helpmate of his life through his long and arduous task of exciting interest, overriding opposition and contempt, and at last creating a respect for the thoughts of the sages of ancient India — the trees, the flowers, the calmness, and the clear sky — all these sent me back in imagination to the glorious days of ancient India, the days of our brahmarshis and rajarshis, the days of the great vanaprasthas, the days of Arundhatis and Vasishthas. It was neither the philologist nor the scholar that I saw, but a soul that is every day realizing its oneness with the universe.
అని వివేకానంద స్వామి ఆ సంఘటనపై రాశాడు .
నేనెప్పుడో సుమారు 30 ఏళ్ళ మన వార్తాపత్రికలోనో వీక్లీ లోనో మాక్స్ ముల్లర్ గురించి న వ్యాసం చదివా .అందులో ఆయన భారత దేశాన్ని సందర్శించ లేక పోయినందుకుగంగా స్నానం చేయ లేకపోయినందుకు పడిన మనో వేదన చదివాను. తాను ఇక పై జన్మించే ప్రతిజన్మలోను భారత దేశం లోనే పుట్టాలని అనుకొంటున్నానని చెప్పాడని చదివాను .అంతేకాదు తన ప్రవర ను ‘’గోతీర్ధ నివాసినం (ఆక్స్ఫర్డ్ ) మోక్ష మూలరు భట్టారం(మాక్స్ ముల్లర్ )అని చెప్పుకొనే వాడనీ చదివాను . ’.దీన్నే పైన వివేకానంద స్వామి రాసిన మాటలు ధృవీకరిస్తున్నాయి .ముల్లర్ దంపతులు ఆయనకు వసిష్ట మహర్షి అరుంధతీ దంపతులుగా దర్శనమిచ్చారంటే ఆయన ఎంత ఉన్నతం గా భారతీయ భావ లహరి లో జీవిం చాడో తెలుస్తుంది .ఆయనలో స్వామికి ఒక బ్రహర్షి ,ఒక రాజర్షి కనిపించాడు. ఆ దంపతుల అతి నిరాడంబర జీవితం ఆయనకు వానప్రస్థాశ్రమం లో ఉన్నట్లు అనిపించింది .ఇంత కంటే మాక్స్ ముల్లర్ ను ఆవిష్కరించిన వారు లేరని పించి౦ది నాకు మాత్రం .
ముల్లర్ ను క్రిస్టియన్లు క్రైస్తవ మత వ్యతిరేకి అన్నారు .డార్విన్ ను కాదన్నందుకు దెప్పారు .’’టురేనిజం ‘’అనే కొత్త భాషా కుటుంబాన్ని ముల్లర్ ప్రతిపాదించాడు
Turanism[edit]
Müller put forward and promoted the theory of a “Turanian” family of languages or speech, comprising the Finnic, Samoyedic, “Tataric” (Turkic), Mongolic, and Tungusiclanguages.[33][34] According to Müller these five languages were those “spoken in Asia or Europe not included under the Arian (sic) and Semitic families, with the exception perhaps of the Chinese and its dialects”. In addition, they were “nomadic languages,” in contrast to the other two families (Aryan and Semitic), which he called State or political languages.[35]
1869 ఫ్రెంచ్ అకాడెమి పురస్కారం ,1874 లో సివిల్ క్లాస్ అవార్డ్ ,1875 లో బవేరియన్ మాక్సిమిలన్ ఆర్డర్ ఫర్ సైన్స్ అండ్ ఆర్ట్ పురస్కారం అందుకొన్న ముల్లర్ 1896 లో ప్రీవీ కౌన్సిల్ మెంబర్ అయి విశేష గౌరవం పొందాడు .185 5 లో 32 వ ఏట బ్రిటిష్ పౌరసత్వం లభించింది .జార్జియానా అడిలైడ్ ను పెళ్లి చేసుకొని నలుగురు సంతానాన్ని పొంది ఆదర్శ దాంపత్య జీవితం గడిపాడు . .1898 నుంచి ముల్లర్ ఆరోగ్యం క్షీణించటం మొదలు పెట్టింది 28-10-1900 న ఆక్స్ ఫర్డ్ లో మహా విద్వాంసుడు మాక్స్ ముల్లర్ 78 వ ఏట మరణించాడు .ఇండియా లోని గోదే సంస్థలను మాక్స్ ముల్లర్ భవనం గా మార్చారు .దాదాపు 25 ఉద్గ్రంధాలు రచించాడు .అందులో ‘’ఇంట్ర డక్షన్ టు సైన్స్ ఆఫ్ రెలిజియన్ ,హిస్టరీ ఆఫ్ ఎన్శేంట్ సాంస్క్రిట్ లిటరేచర్ ,ఇండియా వాట్ కన్ ఇట్ ,తీచ్ అజ్ ,ఉపనిషడ్స్ ,బయాగ్రఫికల్ ఎస్సేస్ ,జర్మన్ క్లాసిక్స్ ఫ్రం ఫోర్త్ టు నైన్ టీంత్ సెంచరి,,ది సైన్స్ ఆఫ్ థాట్ ,స్టడీస్ ఇన్ బుద్ధిజం ,సిక్స్ సిస్టమ్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ ,మై ఆటోబయాగ్రఫీ ,మొదలైనవి ఉన్నాయి .
ఇంత చేసినా భారత దేశం లో ముల్లర్ భావాలపై కొంత వ్యతిరేకత ఉంది .వేదం లోని పైకి కనిపించే అర్ధాలనే తీసుకొన్నాడుకాని లోతులకు వెళ్ళ లేదన్నారు .క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహించటానికి హిందూ మతం పై బురద చల్లాడని దానికోసం అక్కడి చర్చి పెద్దలతో చేతులు కలిపాడని అభియోగం ఉంది .దీనికి మద్దతుగా ఈ క్రింది జాబు చూపిస్తారు .అలాగే భార్యకు రాసిన ఉత్తరాన్నీ ఉటంకిస్తారు .
TO HIS WIFE, OXFORD, December 9, 1867.
“…I feel convinced, though I shall not live to see it, that this edition of mine and the translation of the Veda will hereafter tell to a great extent on the fate of India, and on the growth of millions of souls in that country. It is the root of their religion, and to show them what that root is, I feel sure, the only way of uprooting all that has sprung from it during the last 3,000 years.”
ముల్లర్ ఆర్య సంస్కృతీ వికసనం పై దృష్టి పెట్టి ,ఇండో యూరోపియన్ సంప్రదాయం(ఆర్య సంప్రదాయం ) ను సెమెటిక్ మతానికి వ్యతిరేకంగా ప్రతిపాదించాడు . కొంతకాలానికి ఇవే రేసిస్ట్ పదాలుగా మారిపోవటం చూసి బాగా కలత చెందాడు .తన భావాలకు అవి చాలా దూరం అన్నాడు .ఆయన దృష్టిలో సామాన్య భారతీయ సామాన్య యూరోపియన్ ప్రాచీనత హిట్లర్ చెప్పిన రేసిస్ట్ భావానికి పూర్తీ వ్యతిరేకం అన్నాడు “an ethnologist who speaks of Aryan race, Aryan blood, Aryan eyes and hair, is as great a sinner as a linguist who speaks of a dolichocephalic dictionary or a brachycephalic grammar” and that “the blackest Hindus represent an earlier stage of Aryan speech and thought than the fairest Scandinavians”.[32]
అని తన దృక్పధాన్ని స్పష్టంగా తెలియ జేశాడు . “He who knows one, knows none.”అన్నదాన్ని ఎక్కువగా ముల్లర్ వాడేవాడు .
Like many of his contemporaries, Müller believed that genuine .
“The Science of Religion,” he wrote, “may be the last of the sciences which man is destined to elaborate; but when it is elaborated, it will change the aspect of the world” (Chips, xix). This enthusiasm helped to stimulate the scholarship that made Müller’s own ideas obsolete.అని ఎన్ సైక్లో పీడియా బ్రిటానిక ‘’మాక్స్ ముల్లర్ ను ఎస్టిమేట్ చేసింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-16 –ఉయ్యూరు