ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -15
31 –ఇండియన్ సివిల్ సర్విస్ వారికి శిక్షణ ఇచ్చిన సంస్కృత ప్రొఫెసర్ –జార్జినికాల్
జార్జి ఫ్రెడరిక్ నికాల్ 1832 లో పుట్టి 28-7-19 13 న మరణించిన బ్రిటిష్ ఆకాడేమిక్ . .ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటిలో 4 5 వ ఏట ఆరబిక్ భాషలో లార్డ్ ఆల్మోనర్స్ ప్రొఫెసర్ .అయ్యాడు .యూని వర్సిటియే ఎం ఏ డిగ్రీ ఇచ్చి 1879 లో లండన్ కింగ్స్ కాలేజి లో సంస్కృత ,పర్షియన్ భాషల ప్రొఫెసర్ ను చేసింది .1880 నుంచి ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి లో ఓరియెంటల్ భాషల లెక్చరర్ అయ్యాడు. 1888 లో బలియల్ కాలేజి ఫెలో అయి ,అనారోగ్యం వలన 24-6-1909 న రిజైన్ చేశాడు బెంగాల్ ,అస్సామీ సమారిటన్ భాషలకు వ్యాకరణవిషయాలు రాశాడు .రిటైర్ మెంట్ తర్వాత ఫీలిక్స్ టో లో నివసించాడు The Times, he was described as “a celebrated scholar and teacher of the Indian languages, classical and vernacular, and the author of several educational works”, who had worked for many years to help teach probationers members of the Indian Civil Service studying at Oxford.[5]
32 –సన్యాసాశ్రమ ధర్మ రచన చేసిన –పాట్రిక్ ఆల్విల్లి
శ్రీ లంకలో పుట్టి ఆక్స్ ఫర్డ్ యూని వర్సిటి నుండి 1972 లో బి ఏ ఆనర్స్ పాసై ,సంస్కృత పాళీ,ఇతర భారతీయ భాషాధ్యయనం ధామస్ బర్రో ,ఆర్ సి జేనర్ లవద్ద చేసి ,పెన్సిల్వేనియా యూని వర్సిటి నుండి1974 లో పి హెచ్ డి పొంది , యాదవ ప్రకాశుని ‘’యతి ధర్మ ప్రకాశిక ‘’పై దిసీస్ సమర్పించాడు .1974 నుండి 1991 వరకు బ్లూమింగ్టన్ లోని ఇండియన్ యూని వర్సిటిలో రిలిజియస్ స్టడీస్ డిపార్ట్ మెంట్ లో బోధించాడు .ఆయన అనువదించిన రచనలు –సన్యాస ఉపనిషత్ ,ఎర్లి ఉపనిషడ్స్ ,ధర్మ సూత్రాస్ ,పంచ తంత్ర ,బిట్వీన్ ది ఎంపైర్ సొసైటీ అండ్ ఇండియా ,ది లా కోడ్ ఆఫ్ విష్ణు ,ధర్మ స్టడీస్ ఇన్ ఇట్స్ సమాటిక్ ,లాంగ్వేజ్ టెక్ష్ట్స్ అండ్ సొసైటీ ఎక్ష్ప్లొ రేషన్ ఇన్ అన్శేంట్ ఇండియన్ కల్చర్ అండ్ రిలీజియన్ , Ascetics అండ్ బ్రాహ్మిన్స్ స్టడీస్ ఇన్ ఐడియాలజీస్ అండ్ ఇన్ స్టి ట్యూషన్స్’మొదలైనవి
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-7-10-16 –ఉయ్యూరు .
.