సర్జికల్ దసరా సరదా
ఒగరుస్తూ ఆపసోపాలు పడుతూ చమటలు ,నురుగులు కక్కుకుంటూ పరి గెత్తుకొచ్చాడు మా బావమరది బ్రహ్మం .వీడేదో కంగారులో ఉన్నాడనుకొని ‘’ఏమిట్రా విశేషాలు ‘’?అడిగా .మాట్లాడకుండా లోపలికెళ్ళి వాళ్ళ అక్కయ్య ఇచ్చిన చెంబెడు కాఫీ తాగి చొక్కాతో మూతి తుడుచుకొంటూ త్రేనుస్తూ వచ్చి నా ప్రక్కన కుర్చీలో ఆసీసునుడయ్యాడు .’’అది కాదు బావా !మోడీ నవాబ్ షరీఫ్ మీద సేక్సికల్ ఆపరేషన్ చేశాడని అందరూ కోడై కూస్తుంటే ఇంత నిబ్బరంగా ఎలా ఉన్నావు ‘’?అన్నాడు .తెల్లబోయా .సేక్సికల్ ఆపరేషన్ ఏమిటో అని గాబరా పడ్డాను .కాసేపు వితర్కిన్చుకొని ‘’ఒరే ఫూలా !అది సర్జికల్ ఆపరేషన్ .దానికీ సెక్స్ కూ ఏమీ సంబంధం లేదు .సగం సగం విని వచ్చి నోటికొచ్చింది కూసి చివాట్లు తింటావు ‘’అన్నాను .’’ఏదో అదే అయి ఉంటుంది .ఎందుకు చేశాడు బావా ?అడిగాడు .’’మన సరిహద్దు దాటి పాక్ ఉగ్ర వాదులు అర్ధ రాత్రి మనమీద బాంబు లేసి మన జవాన్లను చంపి పారిపోయారు .ఊరు కొంటె ఇంతే అవుతుందని సైన్యం మనమేమిటో ,మనసత్తా ఏమిటో చూపించ టానికి అకస్మాత్తుగా వాళ్ళున్న ప్రాంతంలోకి వెళ్లి ఉగ్రముఠాను చంపి పబ్లిగ్గా మన వాళ్ళు చేసిన సాంపిల్ ఆపరేషన్ నే సర్జికల్ ఆపరేషన్ అన్నారు .అంటే శస్త్ర చికిత్స . దుస్టాంగాన్ని ఖండించి ,శేషాంగాన్ని కాపాడటం అన్నమాట .’’అబ్బే వాళ్ళు మా మీదికి రానూ లేదు ,సరిహద్దు దాటనూ లేదు మా వాళ్ళు అసలు ఎవరూ చావనూ లేదు ‘’అని బుకాయి౦ఛా డటగా నవాబ్ షరీఫ్ ‘’బామ్మర్ది ప్రశ్న .’’అరె నీకూ విషయాలు తెలుసు నన్ను ఎందుకు మళ్ళీ వాయించటం ‘’అన్నాన్నేను .’’తెలుసనుకో బా .నీ నోటి నుంచి వింటే క్లియర్ కట్ గా ఉంటుందని నా ఏడుపు ‘’అన్నాడు .’’నిజమే .కాని వాళ్ళ సైనికాధికారి నాలుగు రోజులక్రితం మన సర్జికల్ ఆపరేషన్ నూటికి రెండువందల శాతం నిజంగా జరిగిందని చెప్పేశాడు .పాక్ మీడియా అంతకు ముందే చానళ్ళలో అన్నీ స్పష్టంగా చూపింది .మన దేశం లోనూ లెఫ్ట్ పార్టీలు ,వాళ్ళ తోక రాహుల్ కూడా పాక్ కే వంత పాడినా సోనియా నిక్కచ్చిగా మోడీని అభి నంది౦చి౦ది .’’అన్నాను .
‘’మన రాజకీయ నాయకులూ ఇలాంటి ఆపరేషన్లు చేస్తూనే ఉన్నారు కదా బావా ‘’?బ్రహ్మం మళ్ళీ ప్రశ్న .’’అవున్రా .కె సి ఆర్ జిల్లాలు పెంచటానికి సర్జికల్ ఆపరేషన్ చేస్తున్నాడు .అది అతి రహస్యం .ఏ జిల్లా పెరుగుతుందో ఏది తగ్గుతుందో తెలీని పరిస్థితి .అక్కడ మామా అల్లుడు కొడుకు కూతుళ్ళకు తప్ప బ్రహ్మ దేవుడికి కూడా ఆఆపరేషన్ రహస్యం తెలియదు ‘’అన్నా .’’మరి బాబు ఏమీ ఆపరేషన్ చేయటం లేదా “మరో లకోటా ప్రశ్న .’నెలకు మూడు సార్లు ధిల్లీ చుట్టూ తిరిగి శాలువాలు బొకేలతో ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసినా బిగుసుకు కూర్చున్న కేంద్రాన్ని ‘’మీతో కటీఫ్ ‘’అని సర్జికల్ ఆపరేషన్ చేశాడుకనుకనే ప్రతి పత్తి పక్కకు పెట్టి ‘’పాకేజీ అంటూ ఏదో ప్రకటించారు కదా .దీనికీ రఘువీర జగన్ లు వీరంగం వేశారు కాని ప్రస్తుత పరిస్తితులలో అంత కంటే ఊరట ఉండదుఅని బాబూ సర్దుకోవాల్సి వచ్చింది .’’చెప్పాను .’’సరే బావా ! చంద్ర బాబు ఎప్పుడూ టెలి కాన్ఫరెన్స్ లంటూ హడా విడి చేస్తాడు .వాళ్లకు విసుగు అని పించదా’’మళ్ళీ ప్రశ్న దాడి .’’కనకనే ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజాప్రతినిధులు ,ఆఫీసర్లు హాయిగా సైలెంట్ గా నిద్ర అనే సర్జికల్ ఆపరేషన్ లో ఉంటున్నారని వీడియో క్లిప్పింగ్ లు ,పేపర్లు చూపిస్తున్నాయి .రుద్దుడు ఎక్కువైతే బోర్ కొట్టదా .కొంతకాలమైనా వాళ్ళు ఆలోచించుకొని పని చేయాలి కదా .ఎప్పుడూ కొరడా ఝపిస్తే తిరుగుబాటు సర్జికల్ ఆపరేషనో,సైలెంట్ నిద్ర ఆపరేష నే ఫలితం అవుతుంది .’’అన్నాను .’’ఎన్ని విషయాలు నీకడుపులో ఉన్నాయి బావా ‘’అన్నాడు అరగుండు బ్రహ్మానందం లాంటి మా బామ్మర్ది బ్రహ్మం .
‘’జగన్ సంగతేమిటి “”?మరో ప్రశ్న సంధించాడు .’’ఇమడలేక పోతున్నాడు .అయిన దానికీ కాని దానికి నిరశన ,వాకౌట్ ,బూతుల సర్జికల్ ఆపరేషన్ నిరంతరం చేస్తూనే ఉన్నాడు కదా .కావలి౦తల ముద్దుల ఆపరేషన్ లో దిట్ట ,పలకరింపుల ,ఓదార్పులసర్జికల్ ఆపరేషన్ సెంచరి పూర్తీ చేశాడు .కాని ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ పరిస్థితి అతనిది ‘’అన్నాను .’’బావా క్రికెట్ —‘’అన్నాడు నెమ్మదిగా .’’దానిదేమున్దిరా .కోహ్లీ వచ్చాక సెంచరీల సర్జికలపరేషణ్ తో క్లీన్ స్వీప్ విజయాలిస్తున్నాడు కదరా ‘’అన్నా.’’అడగచ్చో లేదో తెలీదుకాని తమిళ నాడు సంగతేంది బావా ?’’’’ఏముంది రా .ఆవిడకు ఆరోగ్యం బాగా లేకపోతే ,హాస్పిటల్ లో చేరి చికిత్స చేయి౦చు కొంటుంటే కళ్ళ జోడు ముసలాయన విమర్శల సర్జికల్ ఆపరేషన్ మొదలెట్టాడు .ఇప్పుడు పరిస్థితి కుదుట బడింది .’’చెప్పా . ‘’బావా !అమరావతి నిర్మాణం ఆపరేషన్ సంగతేమిటి ?’’మరో బాణం .’’ప్లాన్ల మీద ప్లాన్లు మారుస్తున్నారు .అయినా పట్టు వదలని విక్రమాదిత్యుడు బాబు ‘’అల్టిమేటం అనే సర్జికల్ ఆపరేషన్ చేయగానే అందరూ బిలబిల మంటూ వచ్చి చేరి పని చేసుకొంటున్నారు .పిల్లి మెత్తనిదైతే ఎలుక ఏదో చేసిందని సామెత తెలుసుగా నీకు “.అన్నాను .’’చివరగా దసరా విషయం చెప్పు బావా ?’’అడిగాడు ఫైనల్ గా .’’ఒక రకం గా దసరా మామూలు అనే సర్జికల్ ఆప రేషన్ చేసే జేబుకు చిల్లి పడేసే జనం తగ్గి పోయారు ఈ సేవా మీ సేవా లవలన.అడిగే వాడూ లేడూ ఇచ్చే వాడూ లేక దసరా దేవాలయాలలో భక్తుల దర్శన సర్జికల్ ,అమ్మవారి అలంకార ఆపరేషన్ లతో మూడు పూలు ఆరు కాయలలాగా వర్ధిల్లు తోంది .’’అన్నాను .వెళ్ళొస్తా బావా ‘’అంటూ తుర్రుమన్నాడు బామ్మర్ది బ్రహ్మ౦.
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-16 –ఉయ్యూరు