సాహితీ బంధువులకు సాదర ఆహ్వానం
సాహితీ బంధువులకు సాదర ఆహ్వానం
సరసభారతి ,రోటరీ క్లబ్ -ఉయ్యూరు సంయుక్త ఆధ్వర్యం లో నేను రచించిన 14 వ పుస్తకం ,సరస భారతి ప్రచురిస్తున్న 22 వ పుస్తకం ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం(4 82 మందిసంస్కృత కవుల జీవిత, సాహిత్య పరామర్శ )డిసెంబర్ 4 వ తేదీ (4-12-16 )ఆదివారం మధ్యాహ్నం 3 -30 గంటలకు ఉయ్యూరు రోటరీ క్లబ్ ఆడిటోరియం నందు జరుగును . ఈ గ్రంధాన్ని మా తలి దండ్రులు కీ శే విద్వాన్ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి, కీ శే .శ్రీమతి భవానమ్మ దంపతులకు అంకిత మిస్తున్నాం .గ్రంథ ప్రాయోజకులు శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ). .దీనికి ముందుమాటలు డాశ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి -రిటైర్డ్ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్-పొన్నూరు రాశారు .
ఆంద్ర ప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని గ్రంధా విష్కరణ చేస్తారు .
,విజయవాడమేరీ స్టెల్లా కాలేజీ సంస్కృత ఆచార్యులు డా. శ్రీ ధూళిపాళ రామ కృష్ణ, గౌరవ అతిధిగా ,,కాశీ విశ్వ విద్యాలయం సంస్కృత ప్రొఫెసర్ డా. శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి విశిష్ట అతిధిగా విచ్చేస్తారు
మాననీయ అతిధులుగా శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్ శ్రీ జంపాన పూర్ణ చంద్ర రావు గార్లు ,
,ఆత్మీయఅతిధులుగా ఉత్కళ యూని వర్సి తర్క శాస్త్ర ప్రొఫెసర్ డాశ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు ,డా శ్రీ జి వి .పూర్ణ చంద్ ,రమ్య భారతి సంపాదకులు శ్రీచలపాక ప్రకాష్ మొదలైన పెద్దలు పాల్గొంటారు . . .
ఆవిష్కరణకు ముందు ”గీర్వాణ వైభవం ”(సంస్కృత సంస్కృతీ )శీర్షిక పై జిల్లా లోని ప్రముఖ కవుల చేత కవి సమ్మేళనం నిర్వ హింప బడుతుంది .
సాహిత్యాభి లాషులందరూ పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన
పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం నవంబర్ రెండవ వారం లో అందజేయ బడుతుంది .
జోశ్యుల శ్యామలాదేవి , మాది రాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు మరియు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు -సరస భారతి
రోటరీ క్లబ్ అధ్యక్షులు