దైత లక్ష్మణ కన్నుమూత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 16: ఆధ్యాత్మిక చింతనాపరుడు, భౌతిక శాస్తవ్రేత్త, హిందూ కళాశాల అనుబంధ సంస్థల కార్యదర్శి దైత లక్ష్మణ శాస్ర్తీ (84) ఆదివారం కన్నుమూశారు. డిఎల్‌ఎస్‌గా సుపరిచితులైన లక్ష్మణ శాస్ర్తీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరమాణు శాస్త్రంలో పరిశోధనలు జరిపి డాక్టరేట్ పొందారు. అనంతరం డిఎస్సీ పట్టా కూడా పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగాధిపతిగా సేవలందించారు. భౌతికశాస్త్ర పరిశోధనలపై దేశ విదేశీ విద్యాసంస్థల్లో ఉపన్యాసాలిచ్చారు. లెక్కలేనన్ని పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఎన్నో పుస్తకాలు రచించారు. స్వామి వివేకానంద ప్రవచనాలకు ప్రభావితులైన లక్ష్మణశాస్ర్తీ హిందూ కళాశాల ప్రాంగణంలో వివేకానందుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈడేపల్లిలో ‘మధువిహార్’ సంస్థను స్థాపించి యువతకు ఉచితంగా సంగీతం, కూచిపూడి నాట్యం, కుట్టు, అల్లికలు, కంప్యూటర్ కోర్సులో శిక్షణ ఇప్పించేవారు. ఎంపి కొనకళ్ళ నారాయణరావు, హిందూ కళాశాల అనుబంధ సంస్థల పాలకవర్గ అధ్యక్షులు ధన్వంతరి ఆచార్య తదితరులు లక్ష్మణశాస్ర్తీ భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పించారు.