ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు -19
36 –ఒత్తి పలకని పదాలకు సిద్ధాంతం కనిపెట్టిన –స్విస్ లింగ్విస్ట్ –జాకబ్ వాకర్నగెల్
11-12-1853 న జన్మించి 22-5-1938 న చనిపోయిన స్విస్ లింగ్విస్ట్ సంస్కృత విద్వాంసుడు జాకబ్ వాకర్నగల్ .క్లాసికల్ మరియు జెర్మానిక్ ఫైలాలజి ,హిస్టరీలను గాటిం జెన్ ,లీప్ లిజ్ లలో చదివి ,1879 నుంచి బెసేల్ యూని వర్సిటి లో గ్రీక్ ఫ్రొఫెసర్ గా ఫ్రెడరిక్ నీషే కు వారసు డయ్యాడు .1902 లో గాటింజెన్ యూని వర్సిటి పిలుపు నందుకొని మొదటి ప్రపంచ యుద్ధ౦ కారణం గా 1905లో తిరిగి బెసేల్ చేరాడు .1936 లో రిటైర్ అయి ,22-5-1938 న 85 వ ఏట బెసేల్ లో మరణించాడు .
జాకబ్ ముఖ్య సాహితీ సేవ ‘’సంస్కృతానికి ‘’సమగ్ర వ్యాకరణం ‘’తయారు చేయటం .ఆధునిక భాషా శాస్త్ర వేత్తలలో ఆయన ‘’వాకర్నగల్ లా ‘’సృష్టి కర్త గా గుర్తింపు పొందాడు .ఇండో –యూరోపియన్ క్లాజేస్ లలో (ఉప వాక్యాలు )ఒత్తిపలకని పదాల స్థానం పై పరిశోధించి ఈ సూత్రాన్ని కనిపెట్టాడు.ఆయన మరణానంతరం 1889 లో ఆయన గౌరవార్ధం ఆయన పేరుమీద ‘’వాకర్నగల్స్ లా ఇన్ కాంపోజిషన్ ‘’ ను గ్రీకు భాషలోని సమ్మేళన(కాంపౌండ్ )పదాల లో మొదటి ఇంగ్రీడిఎంట్ అచ్చుగా అంతమయి ,రెండవ ఇంగ్రీడిఎంట్ అచ్చుగా మొదలై ఈ రెండూ కూడా పై స్థాయిలో లేనప్పుడు మొదటి అచ్చు ఏ మార్పునూ పొందక రెండవ అచ్చు మొదటి దాని స్థానం లో దీర్ఘం గా పలకబడటం ఇందులోని విషయం .ఆయన రాసిన ‘’సింటాక్స్ లెక్చర్స్ ‘’కు మంచి పేరుంది .
37 –సంస్కృతం లో వేల్స్ ప్రొఫెసర్ లు
అమెరికాలో హార్వర్డ్ యూని వర్సిటిలో సంస్కృత అధ్యయనానికి ‘’హెన్రి వేర్ వేల్స్ ‘’(1818 -1856 ) 24-4-1849 న సంస్కృతం లో ప్రొఫెసర్ షిప్ కోసం ఎండోమెంట్ ఏర్పాటు చేసి ఒక వీలునామా రాశాడు.కాని సంస్కృత పీఠం మొదటి సారిగా 26-1–1903లో మాత్రమే ఏర్పాటై చార్లెస్ రాక్వెల్ లాన్మాన్ వ్యవస్థాపక పీఠాది పతి అయ్యాడు .ఈయన 1876 లో జాన్ హాప్కిన్స్ యూని వర్సిటి లో వృత్తి ప్రారంభించి ,అక్కడ తన అధీనం లో సంస్కృత శాఖనేర్పాటు చేసి , ,హార్వర్డ్ ప్రెసిడెంట్ చార్లెస్ విలియం ఇలియట్ ఆహ్వానం పై హార్వర్డ్ లో 1880 లో సంస్కృత ప్రొఫెసర్ పదవిని చేబట్టాడు ..రెండవ ప్రొఫెసర్ వాల్టర్ యూజీన్ క్లార్క్, మూడవ ఆయన డేనియల్ హెచ్ హెచ్ ఇగ్నల్స్ సీనియర్ .1987 నుండి మైకేల్ విట్జేల్ నాలుగవ ప్రొఫెసర్ గా ఉన్నాడు .
ware whales
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-10-16 –ఉయ్యూరు