— ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు –23
41-కెనడా యోగి ,తత్వ వేత్త ,సంస్కృత విద్వాంసుడు –ఎర్నెస్ట్ వుడ్
ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో 18-8-1883 న జన్మించి 17 9-1965 లో మరణించిన ఎర్నెస్ట్ వుడ్ , మాంచెస్టర్ మునిసిపల్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ లోఫిజిక్స్ కేమిస్ట్రి ,జియాలజీ చదివి ,బౌద్ధం ,యోగాలపై మక్కువతో సంస్కృతం అధ్యయనం చేశాడు .1907 లో స్థానిక ఫిలసాఫికల్ చాప్టర్ కు 24 వ ఏట ప్రెసిడెంట్ అయి ,1908 లో విస్తృత పరిజ్ఞానం కోసం ఇండియాలో మద్రాస్ లో ఉన్న అడయార్ కు వెళ్ళాడు .
అనీబిసెంట్ ఉపన్యాసాల ప్రభావవంతో దియసఫీ పై ఆసక్తి పెరిగి ,ఆ సోసైటీలో చేరి మాంచెస్టర్ లాడ్జి లో ఉన్నాడు .తర్వాత అడయార్ సొసైటీకి 1908 లో ప్రెసిడెంట్ అయిన బీసెంట్ కు ముఖ్య అనుచరుడయ్యాడు .1909 లో అడయార్ కు లీడ్ బీటర్ ,చార్లెస్ వెబ్ స్టర్ లు వచ్చి చేరారు .లీడ్ బీటర్ బాల జిడ్డు కృష్ణ మూర్తి ని కనుగొని ఆతడే భవిష్యత్తులో ప్రపంచ గురువు అని ప్రకటించిన విషయాన్ని ఎర్నస్ట్ వుడ్ ‘’ఈజ్ దిస్ దియాసఫీ ?’’అనే పుస్తకం లోను ఆ తర్వాత రాసిన వ్యాసాలలోను పేర్కొన్నాడు .
బీసెంట్ సలహాతో వుడ్ విద్యా బోధనలో చేరి సొసైటీ ఏర్పాటు చేసిన స్కూళ్ళలో కాలేజీలలో బోధన చేశాడు .తరవాత సింద్ నేషనల్ కాలేజి మదన పల్లి కాలేజి లలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ప్రిన్సిపాల్ గా చేశాడు .దియాసఫిని క్లాసులలో బహిరంగ ఉపన్యాసాలలో ,రచనల ద్వారా బాగా వ్యాప్తికి తెచ్చాడు .హెలెనా బ్రావిస్కి రాసిన ‘’సీక్రేడ్ డాక్ట్రిన్’’కు మంచి ప్రచారం తెచ్చాడు .ఇండియాలో ఆసియా ఐరోపా దేశాలలో అమెరికాలోను పర్యటించి దియాసఫీ పై ప్రసంగించి అవగాహన పెంచాడు .1932 లో ఒక నౌకా ప్రయాణం లో అవతార్ మెహర్బాబా నుచూశాడు .రెండవ ప్రపంచ యుద్ధ పరిసమాప్తి వరకు ఇండియాలోనే ఉండి తర్వాత అమెరికాకు వెళ్ళాడు .
దియాసఫీ భవిష్యత్తు ప్రశ్నార్ధకమై యోగా మీద దృష్టి పెట్టి లోతులు తరచాడు .జిడ్డు కృష్ణ మూర్తి విషయమై సొసైటీ చీలిపోయి ,1933 లో అనిబిసెంట్ మరణానంతరం వుడ్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశాడు .లీడ్ బీటర్ కు పూర్తీ అనుచరుడైన జార్జి అరండేల్ పావులు కదిపి ఎర్నెస్ట్ వుడ్ ను ఓడించాడు .ఇది మోసం దగా ,కుట్ర అని వుడ్ ఆరోపించాడు .దిశా నిర్దేశనం లేని సొసైటీ పై అసంత్రుప్తికలిగినా జిడ్డు వారి స్వయం వ్యక్తిత్వం పై ఆరాధనాభావమేర్పడి యోగం పై మనసు కేంద్రీకరించాడు .
వుడ్ యోగ
భారత దేశం లోనిఎందరో యోగులను ,పండితులను కలిసి చర్చించాడు .అందరూ స్నేహితులయ్యారు చిన్ననాటి స్నేహితుడైన ఎడ్విన్ ఆర్నోల్డ్ రాసిన ‘’లైట్ ఆఫ్ ఏసియ’’గ్రంధం చదివి శాకాహారిగా ,,మద్యపానానికి దూరంగా ఉన్నాడు .మైసూర్ లోని శృంగేరి శివ గంగ సంస్థానం శంకరాచార్య స్వామి ఎర్నెస్ట్ వుడ్ యోగ సాధన సంస్కృత బోధనా గుర్తించి ‘’శ్రీ సాత్వికాగ్రగణ్య ‘’బిరుదు ప్రదానం చేశారు ..భారతీయ యోగులలో ఏ ఒక్కరికీ వుడ్ శిష్యుడు కాడు.1928 లో అమెరికా వెళ్ళినప్పుడు జిడ్డు కృష్ణ మూర్తి ని మళ్ళీ కలుసుకొని ,అయన స్వయం వ్యక్తిత్వానికి ఆకర్షితుడై యోగ సాధనపై గ్రంధాలను చదివాడు .ఇక జీవితమంతా యోగ పై పుస్తకాలు రాస్తూ గడిపాడు .అమెరికా మళ్ళీ వెళ్లి కాలిఫోర్నియా లో అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఏసియన్ స్టడీస్ ‘’కు ప్రెసిడెంట్ గా ,డీన్ గా పనిచేసి ,టెక్సాస్ లోని హూస్టన్ యూని వర్సిటి లో పని చేశాడు .
ఇండియాకు తిరిగివచ్చి ‘’గరుడ పురాణం ‘’ఆంగ్లం లోకి అనువదించాడు .పతంజలి యోగ సూత్రాలు భగవద్గీత ,శంకరాచార్యుల వివేక చూడామణి కూడా ఆంగ్లం లోకితర్జుమా చేశాడు .ఈ ఉద్గ్రంధాలు ,వాటి వ్యాఖ్యానాలు ఆధునిక మానవునికి కరదీపాలని స్పష్టంగా చెప్పాడు .ఇండియా లో భార్య హీల్డా తో కలిసి మేరియా మాంటిసోరి విద్యా వ్యవస్థలో కొనసాగాడు.ఇటలీ లోని ముస్సోలినీ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో 1939 లో మేరియా మాంటిస్సొరి అడయార్ దియసఫికల్ సొసైటీ వారి ఆహ్వానం పై ఇండియా వచ్చి అడయార్ లో 19 37 నుండి 10 ఏళ్ళు 1948 వరకు ఉన్నది .ఆ కాలం లోనే ఇండియాలో చాలా మాంటిసోరి వద్యా సంస్థలు వెలిశాయి .
1950 లో వుడ్ దంపతులు అమెరికాలో హూస్టన్ లో స్థిర నివాసం యేర్పచుకొన్నారు.యూని టేరియన్ ఫెలోషిప్ ఆఫ్ హూస్టన్ లో క్రియాశీలకం గా పని చేశాడు .అక్కడ మాంటిస్సొరి స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది వుడ్ ను అనేక ప్రాంతాలవారు ఆహ్వానించి ప్రసంగాలు ఏర్పాటు చేశారు .1962 లో స్కూల్ ఏర్పరచి మాంటిస్సొరి భావ వ్యాప్తి కలిగించారు .విరిల్ రోడ్ లో ఫెలోషిప్ ప్రాపర్టి కి దగ్గర చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని వుడ్, హీల్డా దంపతులు అతి నిరాడంబరం గా ప్రశాంతంగా జీవిస్తూ స్కూల్ ను సర్వతోముఖంగా అభి వృద్ధి చేసి సంతృప్తి చెందారు .1965 లో సెప్టెంబర్ 17 న 82 వ ఏట ఎర్నెస్ట్ వుడ్ ,ఆ తర్వాత 1968 లో హీల్డా మరణించారు .తరువాత బోర్డ్ వారు ఈ స్కూల్ ను’’ ది స్కూల్ ఆఫ్ వుడ్స్ ‘’అని గౌరవ ప్రదంగా మార్చారు .వుడ్ మరణాన౦తరమే ఆయన రాసిన వివేక చూడామణి అనువాదం ‘’ది పిన్నాకిల్ ఆఫ్ ఇండియన్ థాట్ ‘’ముద్రింప బడింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-10-16 –ఉయ్యూరు