నమస్తే గోపాల కృష్ణ గారు -దీపావళి శుభా కాంక్షలు -ఈ సారి కార్తీక మాసం లోప్రత్యేకంగా ఏం రాయాలి అని మధన పడుతుంటే నిన్న విశాఖ పట్నం నుంచి సంస్కృతాంధ్ర ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పంపిన పుష్పదంతకవి సంస్కృతం లో రాసిన ”శివ మహిమ్నఃస్తోత్రం ”పై వారు వ్యాఖ్యానం రాసిన పుస్తకం అందింది. వారికి వేంటనే ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియ జేశాను .అప్పుడు వారు .”అయ్యా 1 మీ గీర్వాణం వీలున్నప్పుడల్లా చదువుతూ ఉంటాను . అందర్నీ చదివించే గొప్ప లక్షణం అందులో ఉంది నన్ను బాగా ఆకర్షించింది .”అన్నారు పొంగిపోయాను ఆయన అంతటి మనీషి ఇలా అనటం నా అదృష్టం అని పించింది వెంటనే .”శాస్త్రి గారూ ! రెండవ గీర్వాణం 482 మందికవులతో రాశాను. డిసెంబర్ 4 న శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు ఆవిష్కరిస్తారు ”అని చెప్పగానే” చాలా సంతోషం . డిసెంబర్ 4 కోసం ఎదురు చూస్తూ ఉంటాను ”అన్న విశాల హృదయం వారిది .
కనుక శిమ మహిమ్నః స్తోత్రాన్నే వారి వ్యాఖ్యానం తో కొంచెం సులభతరం చేసి31-10-16 సోమవారం కార్తీక మాసప్రారంభం నుండి అంతర్జాలం లో ధారావాహిక గా మీకు అంద జేస్తున్నానని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను -దుర్గా ప్రసాద్ –
సాహితీ బంధువులకు దీపావళి శుభాకాంక్షలు
ఉయ్యూరు రావి చెట్టు బజారులో వేంచేసి యున్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి ఆలయం లో 31-10-16 సోమవారం నుండి 29-11-16 మంగళవారం వరకు పవిత్ర కార్తీక మాసం సందర్భం గా ప్రతి మంగళ వారం రాత్రి 7 గం .లకు కార్తీక మాస ప్రత్యేక దీపాలవంకరణ నిర్వహింప బడుతుంది . దర్శించి తరించ ప్రార్ధన.
గబ్బిట దుర్గా ప్రసాద్
ఆలయ ధర్మ కర్త
Like this:
Like Loading...
Related
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D