గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
2-వేదా౦గ శిక్షపై పరిశోధించిన –ప్రొఫెసర్ కె .హయగ్రీవ శర్మ
తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం లో సంస్కృత ప్రొఫెసర్ శ్రీ హయగ్రీవ శర్మ కృష్ణ యజుర్వేదాన్ని క్రమాంతం శ్రీ వెంకటేశ్వర వేదాగమ పాఠ శాల లో చదివారు .వ్యాకరణం ముఖ్య విషయం గా సంస్కృత ఎం ఏమొదటి తరగతి లో పాసై స్వర్ణ పథకం సాధింఛి , పి హెచ్ డి,పొందారు .29 ఏళ్ళుగా సంస్కృత ప్రొఫెసర్ గాపని చేస్తున్నారు .సాహిత్యం ,వ్యాకరణం ,వేద సాహిత్యం వెంకటేశ్వర అధ్యనాలపై ఆసక్తి .వేదాంత శిక్షపై పరిశోధన చేశారు .5 గురు విద్యార్ధులకు పిహెచ్ డికి గైడ్ గా ఉన్నారు .4 గురు వీరివద్ద ఎం ఫిల్ చేశారు .వీరి విద్వత్ కు భారత ప్రభుత్వం శిక్షా విద్యా పురస్కారం అందించింది వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ఉత్తమ అధ్యాపక పురస్కారం ఇచ్చింది .
యు జి కర్రిక్యులం సబ్జెక్ట్ కమిటీలో మెంబర్ గా ,బి ఓ ఎస్ చైర్మన్ గా ఎక్స్టర్నల్ మెంబర్ గా ఉన్నారు . నెదర్లాండ్ లోని మహర్షి మహేష్ యోగి వేదిక్ యూని వర్సిటి వేదంగా ,శిక్ష ప్రాజెక్ట్ కు చీఫ్ ఎడిటర్ గా పని చేశారు .తిరుమల దేవ స్థానం ప్రచురించిన స్కాంద పురాణాన్ని తెలుగులో అనువాదం చేశారు యక్ష నిరుక్తాన్ని .సాయన వ్యాఖ్యానమున్న కొన్ని ఋగ్వేద మంత్రాలను తెలుగు లో అనువదించారు.పాణినీయ శిక్ష కు సంపాదకత్వం వహించారు ,,తైత్తిరీయ ఉపనిషత్ , తెలుగు అనువాదం చేశారు వామన –పంచ మహా కావ్యాలపై పరిశోధన చేశారు .వామన –మల్లినాద లను తులనాత్మకం గా పరిశోధించి,యజుర్వేదాన్ని వేదంగా శిక్ష ఆకారం గా ,పరిశీలించారు .వేదంగ సమీక్షా ,సంస్క్రుతస్య వైశిష్యం ,గౌతమ ధర్మ సూత్రా మనుసరేణ శాసనం పాలనం, గౌతమ ధర్మ సూత్రేషు ప్రతిబింబిత సమాజ స్థితి ,వేదోక్త వర్ణ ధర్మః ,అధర్వ వేద ఔషధ విజ్ఞానం ,ది రోల్ ఆఫ్ ఆన్దాలజి ఇన్ పర్సనల్ డెవలప్ మెంట్ మున్నగువిషయాలపై 13 రిసెర్చ్ పేపర్లు రాసి ప్రచురించారు .
తిరుమల దేవాస్థాన పత్రిక సప్తగిరిలో వేదాంత మహత్వం ,తైత్తిరీయారణ్య కం ,అన్న ప్రాశస్త్యం ,ఆది శంకరులు మొదలైన విషయాలపై చాలా వ్యాసాలూ రాశారు.
సశేషం
దీపావళి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-10-16 –ఉయ్యూరు