గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
5-విస్తృత పరిశోధకుడు ప్రొఫెసర్ –ప్రమోద్ గణేష్ లాల్యే
1928లో జన్మించిన ప్రమోద్ గణేష్ లాల్యే సంస్కృతం లో మహోన్నత విద్వాంసుడు .హిందీ సంస్కృతాలలో ఎం ఏ చేశాడు .ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి పి ఎచ్ డిపొంది ,అందులో సంస్కృత ప్రొఫెసర్ గా పని చేసి ,శాఖాధ్యక్షుడుగా రిటైర్ అయ్యాడు .ఎన్నో విలువైన గ్రంధాలు రాసి పేరు తెచ్చుకొన్నాడు .పూనా లో భండార్కర్ ఓరియెంటల్రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్లో ‘’మైక్రో ఫైల్మింగ్ ప్రాజెక్ట్ ‘’ను పర్య వేక్షించాడు .హైదరాబాద్ సంస్కృత అకాడెమి డైరెక్టర్ .ఆయన 75 వ జన్మ దినోత్సవాన్ని యూని వర్సిటి 2003లో ఘనంగా నిర్వ హించి’’ప్రమోద సింధు ‘’అనే ప్రత్యేక సంచికనుఆయన గౌరవార్ధం ప్రచురించింది . . మల్లి నాదసూరని వివిధ కోణాలలో పరిశోధించి ఇంగ్లీష్ లో ‘’మల్లినాద ‘’ మోనోగ్రాఫ్ ను రాస్తే సాహిత్య అకాడెమి ప్రచురించింది .
ప్రొఫెసర్ లాల్యేవి ఇంగ్లీష్ ,ఫ్రెంచ్ ,సంస్కృతం ,మరాఠీ నాలుగు భాషలలో 63 రచనలు ,93 ప్రచురణలు 431 లైబ్రరి హోల్డింగ్స్ ఉన్నాయి .అందులో ముఖ్యమైనవి కొన్ని తెలుసుకొందాం – లౌకిక న్యాయ కోశ ,నవ రస మంజరి ,మల్లినాద మనీష ,శ్రీ కృష్ణ లీలా తరంగిణి ,శివాజీ పై కవిత ,వరదాభ్యుదయ చంపు ,లలితాసహస్రనామ స్తోత్రం ,స్టడీస్ ఇన్ దేవి భాగవతం ,ఫ్రీ ఇండియా ఫోర్జేస్,ది కార్డ్స్ అండ్ బౌన్స్ ఇన్ ది వాల్మీకి రామాయణ , ఫ్రీ ఇండియా ఫోర్సెస్ యెహెడ్ ,నిఘంటు నిర్మాణం ,మాపులు తయారు చేయటం వ్యాఖ్యానాలు, జీవిత చరిత్ర రాయటం ఆయన చాలా ఇష్టపడి చేశాడు .