గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
8-సంజ్ఞా నామవాచకాలపై విశేష పరిశోధన చేసిన సమీరన్ చంద్ర చక్ర వర్తి
భారతీయ భాషా పరిశోధకుడు ,సంజ్ఞా నామవాచాకాలపై(ఓమాస్టిక్స్ ) విశేష కృషి చేసిన సమీరన్ చంద్ర చక్రవర్తి బెంగాల్ లో జన్మించాడు .వేదాధ్యయనంపై నాపరిశోధన చేసిన సంపాదకుడు .ప్రస్తుతంకలకత్తా యూని వర్సిటిలో ఎమిరిటస్ ఫెలో గా ,జర్మన్ గెస్ట్ లెక్చరర్ గా ఉన్నాడు .రామ కృష్ణా మిషన్ఇన్ స్టి ట్యూట్ సెంటర్ ఫర్ ఇండలాజికల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ కు గౌరవ విజిటింగ్ ప్రొఫెసర్ . రవీంద్ర భారతి యూని వర్సిటి లో స్కూల్ ఆఫ్ వేదిక్ స్టడీస్ లో మాజీ రిటైర్డ్ డైరెక్టర్ అండ్ ప్రొఫెసర్ .. ఆపస్తంభ సామాన్య సూత్రలేక యజ్న పరిభాష సూత్రను ,బ్రాహ్మణ సంగ్రహం నురాశాడు .ఆంగ్లం లో ‘’సం ఆస్పెక్త్స్ ఆఫ్ వేదిక్ కల్చర్ ,బుద్ధిజం అండ్ వరల్డ్ కల్చర్ ,ఏ స్టడీఆఫ్ పరిప్లవ ,ది పరిభాషాస్ ఇన్ అశ్రౌత సూత్రాస్ ,ఆన్ ది ట్రాన్స్ లేషన్ ఆఫ్ వేదిక్ సాక్రిఫిసియల్ లోర్,ది పొజిషన్ ఆఫ్ ది పరిభాషాస్ ఇన్ ది టేస్ట్యువల్ ఆర్డర్ ఆఫ్ ది ఆపస్థంభ సూత్రాస్ మొదలైన గ్రంధాలు రచించాడు .
సంస్కృత విద్యా చక్రవర్తి అయిన సమీరన్ చంద్ర చక్ర వర్తి గ్రిఫ్ఫిత్ మెమోరియల్ అవార్డ్ ,రాస్ట్రీయవేద విద్యా ప్రతిస్టాన్ పురస్కారం ,ఇంటర్నేషనల్ పెంగ్విన్ పబ్లిషింగ్ హౌస్ నుంచి ‘’రైజింగ్ పర్సనాలిటి ‘’అవార్డ్ ,కలకత్తా భారతీయ విద్యా భవన్ నుండి సాంస్క్రిట్ డే అవార్డ్ , 2009 లో రాష్ట్ర పతి పురస్కారం ,బొంబాయి భారతీయ విద్యా భవన్ నుంచి గురు గంగేశ్వరానంద వేద రత్న పురస్కారం అందుకొన్నాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -16-11-16 –ఉయ్యూరు