వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -13 దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -13

దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం

ఇప్పుడు మల్లినాధుని దర్శన శాస్త్ర లేక తత్వ శాస్త్ర వ్యవస్థపై ఉన్న పాండిత్య వైభవాన్ని దర్శిద్దాం .మల్లినాదుని కాలానికి ఊహా లేక నిరాధార (స్పెక్యులేటివ్ )వ్యవస్థ క్రమంగా ఎదగటం చూశాడు .అన్ని వర్గాల ,మార్గాల వారికి వేదమే అంతిమ అధికారి(అల్టిమేట్ అధారిటి ).సహజం గా వేద గ్రందాలఅంటే శ్రుతుల  వ్యాఖ్యానం అత్యవసరమైంది .వేదాంత ,మీమాంస శాస్త్రాలు తమ వాదనలకు అనుకూలంగా వేద వ్యాఖ్య చేశాయి .ఈ రకమైన వ్యాఖ్యానం మొట్ట మొదట కుమారిల భట్టు ,ఆది శంకరాచార్యవంటి  అగ్ర శ్రేణి ఆచార్యులు ప్రారంభించారు .వీటిని వారి శిష్య బృందం పరిపూర్ణం చేసింది .మల్లినాధుడు అతి జాగ్రత్తగా వీటి అభి వృద్ధి సోపానాన్ని   మనస్సాక్షి గా ఒక విద్యార్ధిలా ఆకళింపు చేసుకొన్నాడు .పైగా అప్పటికే కవులు ,మహా కావ్య నిర్మాతలు అనేక శాస్త్రాలలో నిష్ణాతులు .కనుక వ్యాఖ్యాతలు ఆ కవీన్ద్రులతో సమానంగానో అంతకంటే ఎక్కువగానో వీటి లో సాధికారత కలిగి ఉండాల్సిన అవసరమేర్పడింది .తనకు ముందున్న వ్యాఖ్యాతల కంటే మల్లినాధుడు స్పష్టమైన గ్రంధ శాస్త్ర పాండిత్యం ఉన్నవాడు కనుక మహా వ్యాఖ్యాత అనిపించుకున్నాడు అని లాల్యే పండితుడు నిగ్గు తేల్చాడు .

ఇప్పుడు వేద విజ్ఞానం లోమల్లినాధుని ప్రతిభ ఎలాంటిదో దర్శిద్దాం .కాళిదాస మహా కవి కావ్యాలలో ఉన్న శ్లోకాల వ్యాఖ్యానానికి మల్లినాధుడు వేదం నుంచి అనేక ప్రకరణాలను ఉదాహరించి కాళిదాసుని వేదవిజ్ఞానం పై వెలుగులు కుమ్మరి౦చాడు . ద్వాదశాదిత్యులు గురించి కాళిదాసు చెప్పిన విషయాన్ని ఆరణ్యకాల లోని ‘’అరుణ కేతు చయనం ‘’లోని మంత్రాలను ఉదాహరించి ,ఈ ఆచార కర్మవలన ముఖ్య సూర్యుడు అధిపతి అయిన స్వర్గాన్ని చేర వచ్చు అనే విషయాన్ని నిర్ధారించి చెప్పాడు .ఈ ప్రకరణం అనేక సూర్యులున్నారని తెలియ జెప్పింది .మల్లినాధుడు ఆ సూర్యులందరి పేర్లు వివరించాడు .

వేదం లోని ఒక ముఖ్య నమ్మకాన్ని మల్లినాధుడు వేరొక చోట వివరించాడు .-‘’ఉదేతుమాత్మ జన్నీహం రాజాసు ద్వాదశాశ్వపి –జిగీషు రికో దినక్రుదాదిత్యే వివ కలాతే’’(శిశుపాల వధ వ్యాఖ్యలో )

నైషధం లో నలమహారాజు చంద్రుని మించాడు అనే విషయాన్ని ‘’ఆరోగ్యే భ్రాజః పటరః పతంగ-జ్యోతిస్టోమః స మహా మేరుర్ణ జహాతి ‘’అనేదానితో సమర్ధించాడు

‘’ఓ అమాయక చంద్రా !దమయంతి మనసు ఆమె మరణం తర్వాత నీలో కలుస్తు౦ద నుకొన్నావా .కాని ,మన్మధుడు ఆమె మనసు చంద్రుని లో నల ముఖం వలె కలిసిపోతుందని  ప్రకటించాడు .’’ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ మల్లినాధుడు బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి ఒక ప్రకరణాన్ని ఉదాహరించాడు –

‘’యత్రస్య పురుషస్య అగ్నం వాగత్యోపి వాతం ప్రాణాశ్చక్షు రాదిత్యం –మనశ్చంద్రః దిశాఃక్షేత్రం పృధివీం శరీర మాకారం మాత్మౌషదీ’’

దేవతల౦దరిలోవిష్ణు మూర్తి వరిస్టుడుఅన్నదాన్ని వివరిస్తూ కఠోపనిషత్ వాక్యాన్ని చెప్పాడు –‘’ఇంద్రియేభ్యః పరా హ్గ్రర్దాఅర్యేభ్యశ్చ పరం మనః ‘’

కాళిదాసు వేదం లో సూర్యుడు సాయం  వేళ తనకాంతిని అగ్నిలో నిక్షిప్తం చేస్తాడు అని రఘు వంశం లో చెప్పిన   ఒకనమ్మకాన్ని వేద ప్రమాణం తో సమర్ధించాడు –

‘’సౌరం తేజః సాయమగ్నిం సంక్రామతే –ఆదిత్యో వా అస్తం యన్నాగ్ని మను ప్రవిశతి –అగ్నిర్వా ఆదిత్యః సాయం ప్రవిశతి –ఇత్యాది శ్రుతి ప్రమాణాత్ ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-16 –ఉయ్యూరు

 


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.