— నా దారి తీరు -39
దివిసీమ ఉప్పెన
నా పెనమ కూరు ఉద్యోగం అంటే నాకు ముందు గుర్తుకొచ్చేది దివి సీమ ఉప్పెన మహోత్పాతమే . 1977 నవంబర్ 19 శని వారం రాత్రి జలప్రళ యమేర్పడి దివి తాలూకాను అస్తవ్యస్తం చేసింది పది వేలకు పైగా జనం ఉప్పెనకుబలి అయ్యారు .ఈ రోజే ఇందిరా గాంధి పుట్టిన రోజు కూడా . నాటి నుండి ఆమె ప్రతి పుట్టిన రోజుకీ జనం లో భయం ఉండేది ఏ ప్రమాదం వస్తుందో నని . అంతకు ముందు రోజు రాత్రి నుండి తుఫాను హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు రేడియో ఏ ఆధారం ప్రమాద హెచ్చరికలు ఇరవై నాలుగు గంటలూ మోగుతూనే ఉన్నాయి .శని వారం నుంచి మూడు రోజులు స్కూళ్ళను మూసి వేస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ అధికారికం గా ప్రకటించాడు . స్కూల్ ఉంటుందేమో నని నేను సైకిల్ వేసుకొని పెనమకూరు కు వెళ్లాను హెడ్ మాస్టారు కానీ పించి సెలవు ప్రకటించామని చెప్పారు వెంటనే ఇంటికి తిరిగి వచ్చ్చే శా ను ఉదయం నుండి తీవ్రమైన నల్లటి మబ్బులు ఆకాశం అంతా కమ్ముకొని దాదాపు గంటకు వంద మైళ్ళ కంటే వేగం తో సముద్రం వైపు ప్రయాణించటం చూశాం .వర్షం , గాలి జో రైంది .
అప్పుడు మా ఇంటి పరిస్తితి ఒక సారి జ్ఞాపకం చేసుకొంటున్నాను . మా అన్నయ్య గారి అమ్మాయి వేదవల్లి మగ పిల్లాడిని రవి ని ప్రసవించి ఇంటిలో ఉంది . సావిట్లో ఆమెకు వర్షం పడకుండా ఉన్న ఒక చోట మంచం వేసి పిల్లాడితోపడుకో బెట్టాం నడుం కట్టుతో ఉంది . భోజనాలు సాయంత్రం పెండ్రాలే చేసేశాం . మా తోడల్లుడు గారి అబ్బాయి ”సూర్యం ”మమ్మల్ని చూద్దామని ఆ ఉదయమే ఖమ్మం నుంచి వచ్చాడు .కదలి వెళ్ళటానికి వీలు లేక మా ఇంట్లోనేఉండీ పోయాడు . మేమందరం పదమ టిం ట్లో మంచాలేసుకొని పడుకోన్నాం. అమ్మ ఆమెకున్న చిన్న నవ్వారు మంచం లో సావిట్లో మనవరాలికి తోడుగా పడు కొంది పెంకుటిల్లు కనుక వర్షం ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో పడుతోంది వీలైన చోట్ల తప్పాలాలు బకెట్లు చెంబులు ,గిన్నెలు పెట్టాము వాటిలో పడటానికి . నిండగానే తూము లో పారబోస్తున్నాం . బయటికి తలుపులు తీయటానికి సాహసించలేక పోయాం . విపరీతమైన గాలి వాన తో ముంచెత్తుతోంది . గుండె దిటవు చేసుకొని రేడియో పెట్టుకొని వార్తలను హెచ్చరికలను వింటున్నాం .
రాత్రి పది దాటిన తర్వాత తుఫాను భీభత్సం పెరిగింది మిన్నూ మన్నూ ఎకమ య్యేట్లు భీభచ్చం గా వర్షం కురుస్తోంది . ప్రళయం ముంచు కొచ్చిందని భయ పడ్డాం . ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నాం ప్రతి క్షణాన్ని . భీకర మైన శబ్దాలు విని పిస్తున్నాయి . ఆకాశం బద్దలై పోతున్నట్లని పించింది ఎక్కడో మంటలు చేల రేగుతున్నట్లు అని పించింది .పాపమ్ రేడియో వాళ్ళు కమ్యూని కేషన్లు తెగ నంతవరకు చెప్పాల్సింది చెబుతూ హెచ్చరికలు చేస్తున్నారు దివి సీమ లో తుఫాను కేంద్రీక రించిందని బందరు అవని గడ్డ ప్రాంతాలలో జల ప్రలయమేర్పడి నట్లు వార్తలు చెప్పుతున్నారు అర్ధ రాత్రి దాటిన తర్వాతా రేడియో పని చేయలేదు . తరువాత ఏం జరిగిందో ఎవరికీ తెలియ లేదు .కుమ్భ వృష్టి కురుస్తూనే ఉంది ,గాలి వృక్షాలను ఇళ్ళ కప్పుల్ని కూల్చే వేగం తో వీస్తోంది మె రుపులు ఉరుములతో ఆకాశం యము ఘంటి కలను మోగిస్తోంది . సరే ఎవరికి నిద్ర లేదు కళ్ళల్లో ఒత్తులేసుకొని బాలింత రాలీని చూసుకొంటూ ఇల్లు కూలి పోతుందేమో నని నని భయ పడుతూ ,తలుపులు తీయకుండా గాలికి విరిగి పోకుండా అన్నీ రోళ్ళు రోకళ్ళు రాళ్ళు అడ్డాం పెడుతూ ఆ కా ళ రాత్రి ని గడిపాం . తెల్లారే సరికి అంటా ప్రశాంతం గా ఉంది .వాకిల్లలొ రోడ్ల మీద మొల లోతు నీళ్ళు బయటికి వెళ్ళే వీలే లేదు మర్నాటి వరకు . కరెంటు ఎప్పుడో పోయింది రా వటా నికి వారం పైగా పట్టింది వైర్లు తెగాయి స్తంభాలు ట్రాన్స్ ఫార్మర్లు కూలి పోయాయి . అప్పటికి మాకు టెలిఫోన్ లేదు . పేపర్ వస్తేనే వార్తలు తెలిసేది .. రవాణా వ్యవస్థ దెబ్బ తిండి రోడ్లుమీడున్న చెట్లు కూలి పోయి ప్రయాణానికి ఆటంకం కలిగించాయి .
బయటికి వచ్చి రోడ్డు మీద చూస్తె పరిస్తితి హృదయ విదారకం గా ఉంది . రేకుల షెడ్లు యెగిరి పోయాయి గడ్డి వాముల అడ్రస్ లు లేవు . పూరిల్లు ఎక్కడున్నాయో తెలియ లేదు సావిట్లో కట్టేసిన గొడ్లు చలికి వర్షానికి చచ్చి పడి ఉన్నాయి ఎన్ని కోళ్ళు చని పోయాయో లెక్క లేదు ఒక్క ఉయ్యూరు లోనే ఇట్లా ఉంటె మిగిలిన చోట్ల ఎలా ఉందొ నని అందరు భయ పడుతున్నారు . బస్సులు నడవటం పత్రికలూ రావటం రేడియో పని చేయటం వల్ల జరిగిన భీభత్సం క్రమం గా తెలుస్తోంది .దివి సీమ లో చెప్పలేనంత నష్టం జరిగిందని వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ,సముద్రం లో బడబాగ్ని పుట్టి ఊహించని నష్టాన్ని కలిగించిందని సముద్రం విరుచుకు పడి ఊళ్లకు ఊళ్ళను తనలో కలుపుకోందని కెరటాలు కరెంటు స్తంభాల ఎత్తుకు వచ్చాయని ఇంత ఎత్తు కెరటాలు రావటం ఇంత వరకు ఎన్నడూ చూడలేదని ఎక్కడ పడితే అక్కడ శవాలు గుట్టలు గుట్టలు గా పడి ఉన్నాయని జంతు కలేబరాలకు లెక్కే లేదని గడ్డి మోపులు కరెంటు స్తంభాల మీద కానీ పించాయని వార్తలోచ్చాయి . జరుగ రాని ఘోరం జరిగి పోయింది దివి సీమ లో బందరు కూడా బాగా దెబ్బ తిందని తెలిసింది .
ఉప్పెన వచ్చిన మర్నాటి నుంచే మండలి కృష్ణా రావు గారు స్వయం గా బయల్దేరి దెబ్బ తిన్న ప్రాంతాలైన భావ దేవర పల్లి ,నాగాయలంకా ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఇబ్బంది పడే జనాలను ఓదార్చి మిగిలిన వారిని అవని గడ్డ లోని గాంధీ క్షేత్రానికి ,స్కూలు భవనాలకు తరలించి భోజన సౌకర్యాలు కలిగించారు ఆయన ఈ ఉప్పెన చూసి చలించి పోయారు ముఖ్య మంత్రి వెంగల రావు వస్తే కావలించుకొని ఏడ్చేశారు కా వలసిసహాయం అందినచమని అర్ధించారు . స్వచ్చంద సంస్తలు అయిన ఆర్.యెస్.యెస్ వంటివి,సైన్యం చాలా చొరవతో ముందుకు వచ్చి పునరావాస కార్యక్రమాలు చేబట్టాయి . .శవాలను కాలువల్లోంచి బయటికి తీయటం పెద్ద సమస్య అయింది .శవాలకు అంత్య క్రియలు చేయటం పెద్ద సమస్య .వీలైనన్త వరకు బంధువులతో గుర్తింప జేశారు సామూహిక శవ దహనాలు చేయాల్సిన పరిస్తితి వచ్చింది . అక్కడ అంటూ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం పెద్ద సమస్య . కలెక్టర్ a.v.s.reddi అని జ్ఞాపకం . చాలా శ్రమించాడు ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి పని చేయించాడు .
ఈ ఉప్పెన మహోత్పాతాన్ని స్వయం గా చూడాలని పించింది .ఒక ఆదివారం మధ్యాహ్నం భోంచేసి బస్ లో అవని గడ్డ వెళ్లాను అక్కడి నుండి ఎక్కడికీ బస్సులు తిరగటం లేదు . జీపులు కార్లలోనే వెళ్ళాలి అలానే భావ దేవర పల్లి వెళ్లాను. దారి పొడుగునా శవాలు కానీ పించాయి వాసన భీభత్సం గా ఉంది D.D.T.చల్లారు కాని ఆగటం లేదు ఆడా మగా శిశువుల శవాలు చూసి గుండె జారిపోయింది పశువుల కలేబరాలకు లెక్కే లేదు . అవని గడ్డ లో స్వంచంద సంస్తల సేవలు చూసి కళ్ళు చెమర్చాయి .వాల్ల సేవకు ప్రతి ఫలం ఇవ్వలేము . ముక్కుకు కర్చీఫ్ పెట్టుకొనే తిరిగాను . గాంధీ క్షేత్రానికి వెళ్లి చూశాను భావ దేవర పల్లి లో ఉప్పెన నీరు హైస్కూల్ భవనం పై అంతస్తుకు చేరిందట . ఉయ్యూరు నుండి ఇక్కడికి వచ్చ్చిన వచ్చిన సీతాపతి రావు హెడ్మాస్టారు పై అంతస్తు ఎక్కి ప్రాణాలు ఉగ్గాబట్ట్టుకోన్నారట అక్కడి లైబెరియన్ నాన్చారయ్య కుటుంబం కూడా అంతే తర్వాత ఉయ్యూరు కు బదిలీ అయ్యాడు . అవని గడ్డకు మళ్ళీ చేరి బందరుకు బస్ లో వెళ్లాను .ఆన్ని చోట్లా పంటలన్నీ నాశనం ఉప్పురిసి పోయాయి పొలాలన్నీ . రెండు మూడేళ్ళ దాకా పొలాలలో పంట పండదు .బందరు వైపూ వైపునా ఇలాగే కానీ పించింది బందరు నుండి రాత్రికి ఉయ్యూరు చేరాను .
ఉయ్యూరు లో మేమందరం యార్ ఎస్ ఎస్ . వాళ్ళ కింద పని చేసి ఇంటింటికి తిరిగి బట్టలు డబ్బు పోగు చేశాం మండావీరభద్ర రావు మాకు నాయకుడు మాధవాచారి సహాయకుడు . వీటిని కార్లలో సేవా కేంద్రాలకు పంపి వారితో అందరికి అందజేయిన్చాం . ప్రతి స్కూల్ నుండి నిధులు వసూలు చేసి ఎవరికి వారు స్వచ్చందసం గా డ బ్బు వసూలు చేసిముఖ్య మంత్రి సహాయ నిధికి పంపారు దేశం ,ప్రపంచం అంతా బాసటగా నిలిచింది మందులు పంపారు కొందరు దుప్పట్లు రగ్గులు చొక్కాలు చిన్న పిల్లల డ్రెస్ లు పంపారు ఇంకొందరు . మా తమ్ముడు మోహన్ మరదలు సునీత పూనా నుంచి చూడ టానికి వచ్చారు కూడా బట్టలు తెచ్చారు మళ్ళీ వాళ్ళతో వెళ్లి అక్కడ పంచి పెట్టాము . ఇదంతా గుండె బరువేక్కువయ్యే సన్నీ వేషాలే . ఆ సంఘటనపై ”శని రాత్రి ”అనే దీర్ఘ కవితరాశాను .
ఈ విధం గా పెనమకూరు అంటే దివి ఉప్పెనే ముఖ్యం గా జ్ఞాపకం వస్తుంది . మా చల పతి కి ఇచ్చిన మాటను నిలుపుకొన్నాడు వద్దే శోభనాద్రి .వాగ్దానం చేసిన నాలుగు రోజులకే నన్ను పెనమకూరు నుండి ఉయ్యూరు కు ట్రాన్స్ ఫర్ చేయించాడు . 17-8-79 సాయంత్రం పెనమ కూరు హైస్కూల్ లో రిలీవ్ అయి మర్నాడు అంటే 18-8-79 ఉదయం ఉయ్యూరు హైస్కూల్ లో చేరాను ఇది నా తొమ్మిదవ బదిలీ ఉయ్యూరు రావటం నాలుగో సారి . పెనమకూరు లో మంచి వీడ్కోలు విందు ఇచ్చారు హెడ్ మాస్టారు ఆప్యాయం గా మాట్లాడారు .స్టాఫ్ అంతా మెచ్చుకొన్నారు . 
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –15-7-13- కాంప్ -హైదరాబాద్ .