వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -14
దర్శన శాస్త్రాలలో మల్లినాధుని మహా పాండిత్యం -2
మల్లినాధుడు కొన్ని అనుబంధ శాస్త్రాలైన మీమాంస ,వేదాంత శాస్త్రాలను క్షుణ్ణంగా మధించాడని ,ఆయనకు మీమాంస శాస్త్రం లో ఉన్న పాండిత్యం అమోఘమైనదని దానికి తార్కాణం ఏకావలికి రాసిన ‘’తరళ’’వ్యాఖ్యానమే తెలియ జేస్తుందని ,అందులో కనీసం 25 సార్లు మీమాంస శాస్త్ర సిద్ధాంతాలను ప్రస్తావి౦చాడని ప్రొఫెసర్ ఎస్ .బి రఘునాదా చార్య పేర్కొన్నారు .ఆయన రాసిన వ్యాసం లో మరికొన్ని సిద్ధాంతాలను –‘’మల్లినాధస్య మీమాంస శాస్త్ర పాండిత్యం ‘’అనే వ్యాసంలో ఆయన రాసిన ‘’మల్లినాద మనీష ‘’లో వివరించారు .వేదమే అన్నిటికన్నా సాదికారమైనదని తెలియ జేయటానికి మల్లినాధుడు ఒక వాక్యాన్ని ప్రస్తావించాడు .
ఏకావలి పై వ్యాఖ్య రాస్తూ మల్లినాధుడు మీమాంస శాఖలో భట్టు యొక్క ‘’అభి తాన్వయ వాదం ‘’ను అనుసరించాడు .అంటే పదం యొక్క అర్ధం వాక్యార్దానికి దారి చూపిస్తుంది .. ’జ్యోతి స్టోమా ది వాక్యార్ధైఃపదేః-స్వాభి డేయ సామాన్య పర్వ సనాదాకాండ క్షాసం నిధిఃయోగ్యతా –బల్లబ్దేక వాక్యతా వ్యవస్తాపిత కారణాత్య దిశక్తి యుక్తా నియతేవ్య క్తీరాక్షిపాద్రిమః –స్వస్తార్భి ఘనద్వారా తత్సంబంధి తదేర్పాదార్ధః లక్ష్యంతే—-యయాహుః –తస్మాత్ప దేశాభి హితైః పదాయైర్లక్షణాయా వాక్యార్ధః ప్రతిపాద్యతే ‘’( ఏకావలి )
ఏకావలి లోని ఆరవ ఉన్మేష లో అవిమృస్టావిదేయాంశశ ‘’యొక్క దోష రహితాలను చర్చ౦చాడు .ఇక్కడ మీమాంస శాఖ అభిప్రాయాలను పరిగణించాడు .ఇందులో గుణం ముఖ్యమై విషయం తరువాతి స్థానాన్ని పొందింది –‘’తదేతత్ సమ్యగ్ వివేచిత స్మాభి స్తంత్ర వార్తికా యాం బాజపెయాదికరణే –తస్మాద్ విదేయస్య ప్రాధాన్య మప్రదాదాన్యం చను వాద్యస్యేతిమీమాంసా మా౦సలం వచ్చా ఇతి ప్రతీమః ‘’.మల్లినాధుడు మీమా౦స లోని అనేక అధికరణాలను వాటి పేర్లు చెప్పకుండా పరిగణన లోకి తీసుకొన్నాడు .
మొదట మల్లినాధుడు నమస్కార విధి ని చర్చించాడు .ఇందులో రెండు విధానాలను తెలిపాడు .అందులో మొదటిది కర్మకాండకు ముందు చేసే నమస్కారం .రెండవది వాజ పేయ జ్యోతిస్టోమ యాగాలలో కొన్ని ప్రత్యేకంగా చేయాల్సిన నమస్కారాలు .కర్మకాండకు ముందు చేసే నమస్కారం లో మళ్ళీ రెండు రకాలు .1-సూటిగా ఉపకరణాలతో చేసేది –దీన్ని ‘’సన్నిపాత్యోప కారకం ‘’అంటారు 2-దూరంగా ఉండి చేసేది దీన్ని ‘’ఆరాదుపకారక ‘’అంటారు .వీటిపై చర్చ చాలా సూటిగా అతి సరళం గా ,స్పస్స్టంగా ఉంటుంది .అలాగే ‘’సాంకేతికం ‘’ను ఉపయోగించే విషయం లో మల్లినాధుడు ‘’అక్ర్త్యాధి కరణం ‘’,’’తద్భూతాధి కరణం ‘’ లను ఉదాహరించాడు .విద్యాధరుని సమాధాన్ని పూర్తిగా వివరించాడు –‘’సర్వస్య జ్ఞానస్య విషయః అన్యాత్ ఫలమిత్వ వివాద మిత్యర్ధః –కుత్రేదం దృష్టం ?తత్రాహ విషయో హీతి –నీలాదిహి ఘటాది రిత్యర్ధః –ప్రాకవ్యం జ్ఞాతతా –సా చ జ్ఞాన జన్య జ్ఞానననుమాయికా విషయన్నిస్టాయత్ప్రసాదాత్ జ్ఞాతో ఘటః ఇతి విశిష్ట వ్యవహారో జాయతే ఇతి జ్ఞాతతోవాదినః ‘’(ఏకావలి ).తర్వాత మల్లినాదునిఅద్వైత వేదాంత పాండిత్య గరిమను తెలుసుకొందాం .
సశేషం
19-11-16 నాటికి దివి సీమ ఉప్పెన వచ్చి 40 ఏళ్ళు అయిన సందర్భంగా జ్ఞాపకపు పొరల్లో నుండి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-11-16 –ఉయ్యూరు
.
‘’