గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-1
. ఒంగోలు మండలం ఉప్పు గుండూరు గ్రామవాసి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ జగన్నాధ శాస్స్త్రి శ్రీమతి మహా లక్ష్మమ్మ లకు జన్మించారు .భారద్వాజ గోత్రం .అనన్య సాధారణ పండితులు .చందవోలు శాస్త్రిగారిన బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వద్ద సంస్క్రుతకావ్యాలంకార ,వ్యాకరణ శాస్త్రాదులు నేర్చారు .తెనాలి సంస్క్రుతకాలేజిలో విద్యా ప్రవీణ అయ్యారు .సంస్క్రుతాధ్యాపకులయ్యారు .ఆంద్ర సంస్కృతాలలోఎం. ఏ .పొందారు .సంస్కృతం లో బహు గ్రంధాలు రాశారు ‘.శ్రీ గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు రాఘవ నారాయణ శాస్త్రి గారి పై ‘’అగ్ని పరీక్ష ‘’అనే చిన్న నవల రాస్తే అది ఉపవాచకం గా సెకండరీ స్థాయిలో బోధింప బడింది .దీన్ని ఆధారంగా శాస్త్రి గారి జీవితాన్ని ఒక యోగి చరిత్రగా భక్తీ జ్ఞాన యోగాలనుచేర్చి సంస్కృత మహా శ్లేష కావ్యంగా ‘’శ్రీ గురు చరితం ‘’లో శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ని గురించి సమగ్రంగా రాశారు .’’శ్రీ దేవీ మానసానంద హేతవే ధర్మ సేతవే –గుర్వే శిష్య లోకస్య నమోవాకం ప్రశాస్మహే ‘’అని గురు కీర్తన చేశారు .’’భావనా బృందావనం ‘’కావ్యం లో ముక్తక శ్లోకాలు రాశారు .’’సాలభంజికా సూత్ర దారం ‘’’’లాలితానంద లహరి, స్తన్య ధారా స్తవం ;;రచించారు .ఇందులో ఒక శ్లోకం –‘’హే నిత్య ప్రసావిత్రీ తే స్తన యుగం ధారా ధారా హ్రీకరం-క్లీం మధ్యాక్రుతి మాత్రుగాదర గృహీత స్వాదితం భావయే –శ్రీ పీయూష ముపాస్య యస్య కవయ స్వెం బీజ వాజీ కృతా –అన్నాముత్ర జయంతి హన్తః –సుమనస్యో రాజ్య రారాజితాః’’
‘’వేదనాద స్తవం ‘’లో ‘’శరీరే యూపా గహనా కశేరుకా –విజ్ఞాన సంబందా మనసే మే జడస్య –ఆలస్య కచిద్ గోపికా హంత సుప్తా –నూనం కించిత్ స్ప్రుశతీ వాద్వ యోక్త్రం ‘’అన్నారు .
వేదనా నివేదనం ‘’కావ్యం లో శిఖరిణీ శార్దూల విక్రేడి తాలలో కవనాన్ని కధనం తొక్కించారు .-‘’కిం దుఃఖం కిం సుఖం కిం శుభమితి మానసా వర్తమానాతీతం-నిస్చేతుం పంగ గుబుద్ధిః -సతతామిద మా విశ్వాసజే ధ్నేయ్యమానః ‘’
ఇవికాక ‘’పరి ప్రశ్న మంజరి ‘’,లింగ దర్శనం ,కర్మ వాద నిర్మధనం’’,దయా దారిద్ర్యం ,పరాకాయ ప్రవేశ స్తోత్రం ,తత్వ మంజరి ,నమశ్శివాయ ,బిన్డుమాలినీ స్తవం,రఘు కౌత్సం ,నిరపంనప ద్వాదశి ,శివ దోష స్తుతి ,అన్గాగార క్రుష్ణాగారః మొద లైనవి రాశారు.
ఒక్కసారి మేళ్ళచెర్వు వారి త్రిభాష రచనా విభూతిని దర్శిద్దాం –
సంస్కృత రచనలు
1-శ్రీ గురు చరితం 2-సాలభంజికా సూత్రా దారం 3-లలితానందలహరీ ,స్పందలహరీ 4-స్తన్యదారా స్తవః 5-వేదనాస్తవః 6-వేదనా నివేదితం 7-లింగ నిర్మధనం 8-ఆకర్మానంద లహరి 9-దయాదరిద్రాయ నమశ్శివాయ 10-తస్యాభవత్కి౦చన 11-మన్యేహ మస్మి హృదయే పరమేశ్వరస్య 12-చరణార వింద షోడశి 13- అంతరార్ధ స్తోత్రం14-పరకాయ ప్రవేశ స్తోత్రం 15-బి౦దు మాలినీ స్తవః 16-రఘు కౌత్సుకం (నాటకం )17-అంగారక శృంగారః (జ్యోతిషం )
నిఘంటు నిర్మాణం
1-ధాతు కోశ పద కోశౌ 2-లింగాను శాసనము 3-తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు
తెలుగు గ్రంధాలు
1-సామి శరణం 2-మదాలస జోల పాట3-ఆత్మ సుప్రభాతం 4-ఆస్తి దేవము (సదసత్సంశయము )5-కనకధారాస్తవము –పద్యాను వాదము ,వ్యాఖ్య 6-శ్రీ కృష్ణ రాస లీల (యోగాత్రయీ హేల )7-కుజ సప్తతి (కుజ దోషం మీద పరిశోధన )8-బీజ తంత్రము 9-చందోలు మహర్షులు(చిన్ననవల ) 10-అటుకులలో కిటుకులు 11-గజేంద్ర మోక్షము –రుషి ఋణము 12-వామనుడు –వామనము .
ఆంగ్ల గ్రంధాలు
1-K.P.Special Study 2-P.G. Study on Traditional k.P.Astrology,Part- 13-P.G Study on Traditional K.P. Astrology –part -2
తెలుగు వ్యాఖ్యానాలు
1-త్రిపురామహిమ్నః స్తోత్రం -2-రామ కృష్ణ విలోమ కావ్యము 3-అష్టక గుచ్చము (బెల్లంకొండ వారి రచన )4-కనకధారా స్తవము (పద్యానువాదము )6-విజ్ఞాన భైరవము 7-విష్ణు సహస్ర నామ స్తోత్రము –మతత్రయ వ్యాఖ్యా సంగ్రహము 8-శివ గీత 9-సాంబ పంచాశిక (శ్రీ కృష్ణ పుత్ర సాంబ కృత సూర్య స్తోత్రము )10-వాగ్దేవీ స్తుతి (భోజ రాజ కృతం )11-ముక్తి ద్వారా స్తవ రాజము 12-వరాహోపనిషత్తు 13-కృష్ణ కుతూహలము (మధుసూదన సరస్వతి నాటకము ౦అనువాదము,లఘు వ్యాఖ్య 14-పరమాత్మ సహస్ర నామావళి –వ్యాఖ్య (బెల్లంకొండ రామ రాయ కృతం )
సహా సంపాదకత్వం లో వెలువ రించినది
సిద్ధాంత సింధుః(తెలుగు లిపి)(సంస్కృత మూలం శ్రీ రావి మోహనరావు గారితో కలిసి –దశ శ్లోకీ వ్యాఖ్య )
స్వీయ సంపాదకత్వం లో వవెలువరించినది
సిద్ధాంత సింధుః(నాగర లిపి )-ఆర్ .ఎస్. వి. పీఠం –తిరుపతి ద్వారా
సంస్కృత వ్యాఖ్య
రమావల్లభ రాయ శతకము (బెల్లం కొండ రామ రాయ కవి )
ఆంధ్రానువాద గ్రంధాలు
1-బెల్లంకొండ రామ రాయ కృతాలు 1-అద్వైత విజయము 2-వేదాంత నిశ్చయము 3- అద్వైతామృతము 4 –భాగవత చతుశ్శ్లోకీ 5-సిద్ధాంత సింధువు –దశశ్లోకీ కి తెలుగు వివరణ 6 –శంకరా శంకర భాష్య విమర్శనము 7- ఆంధ్ర వేదాంత ముక్తావళి 8-సిద్ధాంత లేశ –క్రష్ణాలంకార సంగ్రహం 9-పంచ పాదిక 10–స్వరూప ప్రకాశము 11-సంక్షేప శారీరకము (మధుసూదన కృత సార సంగ్రహ వ్యాఖ్య విశేషాలతో )12-బ్రహ్మ సూత్ర శంకర భాష్యము 13-పసామ త్రయి(వేదాంత పరిభాష వేదాంత పాఠం ,వాసుదేవ మననం )
సరళీకరణ సంగ్రహ తెలుగు గ్రంధాలు
1-సరళ విచార సాగరం (గ్రాంధిక తెలుగు నుంచి వ్యావహారిక తెలుగులోకి )2-సరళీకృత వ్రుత్తి ప్రభాకరం (గ్రాంధికం నుండి వ్యావహారికానికి )3-విద్యారణ్య కృత వివరణ ప్రమేయ సంగ్రహం కు ఆంధ్రానువాదం 4-శ్రుతి గీతలు –భాగవత దశమ స్కంధం లోని వాటికి టీకా తాత్పర్య ,పద్యానువాదం 5-నైష్కర్మ సిద్ధి –అనువాదం
ఇలామేళ్ళచెర్వు వారి వేద, వేదా౦గ ,జ్యోతిష ,దర్శన సాహిత్య సరోవరం 70 గ్రందాలతో నిండి ఒడ్డుల నరసి నిండుగా ఉంది .ఇంకా ఎన్నో రాస్తూనే ఉన్నారు .వారి కలం నిత్యం పదునుతో పరిగిడుతూనే ఉంది.ఇంతటి సాహిత్య శీలిని,పుంభావ సరస్వతీ మూర్తి ని ప్రభుత్వ౦ గుర్తించక పోవటం, పురస్కార ప్రదానం చేయకపోవటం ఏలినవారి వక్ర దృష్టికి ఉదాహరణగా నిలుస్తుంది .శ్రీ వారు కూడా తానేదో సాహితీ సేవ చేస్తున్నానని మెహర్బానీ ప్రదర్శించకపోవటం ,గుర్తింపుకు ఆరాటపడక పోవటం ,ఎక్స్పోజర్ కు దూరంగా ఉండట౦ వారి వినయానికి దర్పణం .
మేళ్ళచెర్వు వారి గీర్వాణ భాషా వైశద్యాన్ని ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం లో రాసే అదృష్టం నాకు కలిగింది .దీనికి డా .తూములూరు శ్రీ దక్షిణా మూర్తి గారే కారకులు .అంతకు ముందు ఎప్పుడో వారి గురించి కొద్దిగా రాశాను .మొన్న శాస్త్రిగారు తెనాలి వెళ్లి ,వారి ఫోటోను శ్రుతి గీతాలను ,వారి అపూర్వ సృష్టి బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారిపై సంస్కృతం లో శ్లేష మహాకావ్యంగా రాసిన వారి దగ్గర మిగిలిఉన్న ఒకే ఒక కాపీ ‘’శ్రీ గురుచరితం ‘’ను నాకోసం తీసుకొని నిన్ననే నాకు అందేట్లు కొరియర్ లో శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు పంపారు .వాటిని బట్టి ఇదివరకు రాసినదాన్ని కొంచెం పెంచి ముద్రణకోసం లాస్ట్ మినిట్ లో డిటి పి చేయటానికి శ్రీ చలపాక ప్రకాష్ గారికి పంపాను .
వారి గురించి సమగ్రంగా గా రాయాలనే తలంపుతో ఈ వ్యాసం రాస్తున్నాను .వారి శ్రీ గురు చరితం ఇవాళే చదవటం ప్రారంభించి20 అధ్యాయాలలో 10 అధ్యాయాలు చదివాను .నాకు యేమని పించింది అంటే ఈ మహా కావ్యానికి మేళ్ళచెర్వు వారే స్వయంగా అర్ధ తాత్పర్యాలతో తెలుగు లో వివరంగా విశేషాలతో రాస్తేఅద్భుతంగా ఉంటుందని .లేక వారంతటి శిష్యులు ఎవరితోనైనా రాయిస్తే ఈ తరంవారికి అందుబాటులో ఉంటుందని .వారు ఈ ప్రయత్నం చేసి గురు ఋణం ,పాఠక రుణమూ తీర్చుకోవాలని వారికి నా విన్నపం .
నాకు తెలిసినంతవరకు ఈ కావ్యం లోని విషయాలు రెండవ వ్యాసం లో రాసే ప్రయత్నం చేస్తాను .
వారి ఫోటోను దీనితో పాటు జత చేస్తున్నాను చూడండి .
సశేషం
Namaste,
Where and how can I get the books of Sri Mella chervu Venkate Subrahmanya shastri garu please tell me .
you can doenload at this link which are in public domain
https://archive.org/search.php?query=Mellacheruvu%20Venkata%20Subrahmanya