గీర్వాణా౦ధ్రా౦గ్ల భాషా మేలిమి చెర్వు -శ్రీ మేళ్ళ చెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి (19 40 )-3(చివరి భాగం )
బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గురు వరేణ్యుల ‘’శ్రీ గురు చరిత్ర ‘’కధలో యోగ సంఘటనా సామ్యాన్ని సూచన ప్రాయంగా మేళ్ళచెర్వు వారు ఇలా తెలియ జేశారు –ఇందులో కవి గత విషయక భక్తి పూర్వక గురు యోగ విజయ ధ్వని ఉందని చెప్పారు .1-కవి దృష్ట్యా గురువుగారు నివాసమైన చందోలు ‘’ద్వాదశాంతము ‘’.మిగిలినది అంతా అవతార విభూతి ,మళ్ళీ చందోలు రావటం ,అవతారం స్వస్థలాన్ని చేరటం 2-గురు దృష్ట్యా బహిరంగ కధ3 అంతరంగ కధగా గురువొక యోగి ,వారి మార్గం యోగ మార్గం . గుర్రం పై వెళ్ళటం ఇంద్రియ వ్యాపారం ,ఆసనాది వ్యాయామం గా ,వనం సంసారంగా ,చీకటి అజ్ఞానం గా దొంగలు కామ క్రోదాదులుగా ,శివాలయం మూలాధార విశ్వ లింగం గా ,వస్త్ర ద్రవ్యాపహరణం ఆవరణ భేదం బ్రహ్మ గ్రంధి చేదనంగా ,ఈల ఓంకారంగా,పరానాదంగా ఇద్దరు దొంగలు ఇడా,పింగళ నాడులు,పుణ్య జ్ఞానం గా ,చెరువు స్వాదిస్టానంగా ,అశ్వ రధము హృదయ౦ గా ,రదికుని విష్ణువు,ఈశ్వరునిగా ,జ్ఞాన బోధ ,వికాసాలు విష్ణు గ్రంధి భేదనంగా ,అనాహత జీవ సంయోగం గా ,ఖడ్గదారి రుద్రునిగా ,గురు విజయము రుద్రగ్రంది భేదనంగా ,చోర త్రయం త్రిమూర్తులుగా ,వర్షము సహస్రార సుధా వర్షంగా ,నక్షత్ర దర్శనం భ్రూమధ్యలో కనిపించే కాంతి చక్రంగా ,చోరగృహం ఉద్యానవనం రెండూ మస్తక మస్తిష్కములుగా ,కదంబవన చింతామణి గృహాలుగా, నుయ్యి సుధా సముద్రంగా ,చంద్రుడు సహస్రార చంద్రుడుగా ,చోర పత్ని శ్రీ చక్రేశ్వరిగా ,చోరనాధుడు కామేశ్వరుడుగా ,అగ్ని పరీక్ష నిర్వికల్ప సమాధిగా ,విడుదల జీవన్ముక్తిగా ,సుప్రభాతం జ్ఞాన దృష్టిగా ,తిరుగు ప్రయాణం వ్రత్యా వృత్తిగా ,అశ్వ యానం లింగ శరీరం గా ,రైలును వెన్నుగా ,పంచ భౌతిక శరీరం గా భావించి ఈ మహా శ్లేష కావ్యాన్ని రాశానని కవి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి తెలియ జేశారు .ఇవన్నీ ఆలోచి౦చు కొంటూ కావ్య ప్రవేశం చేసిన వారికి గురు కటాక్షం తో పాటు శ్రీ లలితా పరాభాట్టారిక అనుగ్రహ౦ తో మోక్ష ప్రాప్తి లభిస్తుంది అని ఫల శ్రుతి గా భావించాలి .
తరువాత ‘’సువర్ణ మంత్రం పుష్పం ‘’ను గురు దేవులకు సమర్పించారు కవి .-‘’అఖండ నారాయణ భావ మంతర్బహి ర్దరీ దర్శిత మః పశ్యన్ –నారాయణోస్మీతి కృతార్ధనామా గురుర్విముక్తౌ చరమాహి వృత్తిః’’’
గురువుగారు 10-12-19 90 రాత్రి 12-40 గం లకు మహా నిర్యాణం చెందారు .వారి చితి జ్వాలలో ఇద్దరు స్త్రీ మూర్తులు కనిపించినట్లు ఫోటోతో సహా ఆంద్ర ప్రభ దిన పత్రికఆదివారం సంచికలో 8-9-1991 న ముద్రితమైంది.ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్య పోయారు .గురువుగారిపై జగదంబకు గల అనుగ్రహానికి ఇది గొప్ప ఉదాహరణ .సాధకులకు జిజ్ఞాసులకు అదొక గొప్ప తార్కాణ అన్నారు కవి –దీన్ని శ్లోకం లో బంధించి చెప్పారు –
‘’చాయా గ్రాహక యంత్ర చిత్ర ఫలకే చిత్యగ్ని ధూమ చ్చటా-మధ్యే స్తోరుణ పాండు రా౦బరదరే దేవ్యౌ గురో రంతికే ‘’
‘’క్రుత్వాత్మ జీవిత నిదర్శన దర్శనేన –నిశ్చ ప్రచం భువి సనాతన సంప్రదాయం
బ్రాహ్మీ భవన్నపి మహా గురు రంబికేద్వే-ప్రత్యక్షయన్ ద్రఢ యతిస్మ జగద్ధితాయ .’
చితిస్తత్పద లక్షార్దా ,తస్య ప్రాణా ఇహైవ లీయతే ,శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసితవ్యః,తస్మై గురవేనమః ,’’త్వమేవ మే వృణిష్వ’’య౦ త్వం మనుష్యాయ హితత మం మన్యతే ,నారాయణా యేతి సమర్పయామి ‘’అంటూ గురు విష్ణు రూపుని స్మరించి ‘’శ్రీ రాఘవాయ విద్మహే నారాయణాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ ‘’అంటూ వందనం చేశారు కవి .
11 వ సర్గ లో గురూప దేశం లో –‘’సర్వం ప్రపంచం భగవత్స్వరూపం సందర్శయన్ సంసది విశ్వ రూపః –కృష్ణో మహాత్మా ధృత రాష్ట్ర మందం సంస్కర్తు కామోపి భభూవ నాలం ‘’అని పరమాత్మ తత్వాన్ని బోధించారు .జడ భరత వృత్తాంతాన్ని బోధిస్తూ –‘’జడ భారత ఇవ మన్యసే జీవజాలం –యది నిజకర సేవా వర్ధితం పౌరుషేణ-జనన మరణ బంధే పీద్యతే జ్ఞావా౦ తశ్ఛేత్ –జడ భరత ఇవ త్వం మోక్షసే జీవ జాలాత్ ‘’.అవసరమైన చోట్ల ‘’కవి వ్యాఖ్యా ‘’అని కొన్ని శ్లోకాలు రాశారు .
గురువు గారు తమ పరదేవతా సేవను తెలియ జేస్తూ –‘’సత్యం బ్రవీమి మనయేవ సమీర లీనం –కిం మేమనోరధయితి ప్రకృతే వదామి –నిత్యం జపామి పర దైవత మేవ తత్త్వం –కృత్యం కురుష్వ యదితేవిధి రేష దిస్టః’’
‘’సుత రసిత రసాం తామగ్ని వర్ణాంజ్వలంతీం –పరమ శివ సభాగాం కర్మజానంద కందాం –సకల భువన మూలా మాస్ట సిధ్యం శు జాలాం-అఖిల గురు మనీషా మాది శక్తిం దదర్శ ‘’
నిశ్చల సమాధి గతులైన గురుబ్రహ్మ ఎలా ఉన్నారు అంటే –‘’సుధా బిందు స్యందీసకల నల చక్రా హిత రుచిః-ప్రభా సారం చక్రే విమల నభసః స్పంద రహితః –సమాధౌ నిర్మగ్నౌః పిహిత నయనా హంస మునయః –నిలీనాః పద్మా౦కే స్ఖలిత మిధునా భ్రాంతి రహితాః’’అన్నట్లున్నారు .
‘’హ్రీ౦కారోంకార సామ్యం స్వర శిఖర గతం ఝం కృతౌ దర్శయంతీ-పీయూషానంద లోభాదను సృత కుసుమా భ్రామరీ లోక బంధోః-కామ్యంతీ కాంతి పూరం కవి హృదయ హారం ఖే నిరాలంబ మార్గే –వాతా ధారా నుయా౦తీ శ్రుతి శిఖర రతా తీర్ధ మిత్రం బభూవ ‘’
గురువు గారిని ఎంత వర్ణించినా కవి గారికి తనివి తీరదు .వారి అమ్మవారి పదార్చనాలీనత తనివి తీరా వర్ణించారు .
‘’జ్యోత్సా స్పురత్సలిలబుద్బుద బింబి తాత్మ-చిత్రం తరంగ తతి కంపిత సర్వ గాత్రం –దృష్ట్వా చ నిశ్చల నిజస్థితి మారయ పాదః –జజ్ఞే శరీర పరమేశ్వర జీవ తత్త్వం .
16 వసర్గలో గురు పునః పురాగమనం స్వాగత సత్కారాలు వర్ణించారు .17 వసర్గలో లలితా పరా భట్టారికా స్తవం రాశారు –‘’అయి జగదీశ్వరి శంకర సుందరి భక్త మనశ్చరి పాహి పరే –అవనత పావని భావక శోధిని పాప విపాటిని పాహి శివే –జనశివ కారిణి సంభ్రుత వారుణి దానవమారిణి ధర్మ రతే-జయజయహే కరుణా రసవాహిని విశ్వ విమోహిని విష్ణు కరే ‘’అనే శ్లోకాన్ని ‘’అయిగిరి నందిని నందిత మోదిని ‘’ధోరణి లో రాశారు .మొత్తం 33 శోకాలలో అమ్మవారి స్తుతి ఉంది .మరొకటి చూద్దాం –
‘’సంచారః పదయో ర్మహేశ్వరి భవత్సంకల్ప సంపాదితః –కాంతా రేత్ర భవే త్ప్రదక్షిణ విధిః వాగీశ్వరీ స్వస్తితే –కామంస్యా మమ సర్వ వాక్య రచనా సి౦హాసనాదీశ్వరి –స్తోత్రం తే పరమేశ్వరి ప్రభావతా త్సర్వం తవారాధనం ‘’అని శివానందలహరిలో భగవత్పాదులు చివరి శ్లోకాలలో చెప్పినట్లు చెప్పారు .
18 వ సర్గలో అగ్ని పరీక్ష ఉంది .పరస్త్రీ తనను స్పర్శించటం ధర్మ యుక్తం కాదని అందుకు జగజ్జనని ని క్షమాపణ కోరారు .19 లో సూత్రధార సాక్షాత్కారం ,రహస్య ప్రకాశం,జీవన్ముక్తి ,రామప్రసాద్ ఆస్థానానికి వెళ్ళటం సన్మానం ఉన్నాయి .
చివరిదైన 20 వ సర్గ లో కవి వ్యాఖ్య ,సుప్రభాతం ,కోశానుగ్రహం ,పాఠకాహ్వానంతో కావ్యాన్ని ముగించారు –చివర్లో రాసిన మరో రెండు గురు ధ్యాన శ్లోకాల రుచి చూద్దాం-
‘’హరిహర సమాహారం దేవం మహా శబరీ నగే –పరమ శిఖరే సోపానాంతే విలోక్యచ భైరవం –తడనుమకర జ్యొతిః కాంతిం మహా పురుషో యదా –ఉషసి గురు రాస్యాదిత్య స్య ప్రభా మయోఖైః-‘’
‘’ముక్తా విద్రుమ హేమనీల ధవళ చ్చాయై స్సహస్రామ్శుభిః-జిత్వానంత గతం తమోంతర బహిర్వ్యాప్త౦ జ్వలంతం దివి –సూర్యం వీక్ష్య గురుః ప్రపంచ మఖిలం తద్భావితం భావయన్ –సత్యం తస్య రజో హిరణ్మయ రధం దధ్యౌ మనో నీరజే ‘’
‘’న్యూనం యదత్ర ప్రతిభావ లేపాత్ ప్రజ్ఞా పరాధాచ్చ శిశు ప్రకృత్యా –పూర్ణం భవేత్ శ్రీ గురు పాద నామ స్మృతేః క్షమైవ స్కలితం క్షమేత ‘’అని వినయంగా సర్వ శాస్త్ర సాహిత్య మేలి చెరువు శ్రీ మేళ్ళచెర్వు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు క్షమాపణ స్తోత్రం చెప్పుకొన్నారు .
నేను కూడా నా మిడి మిడి జ్ఞానంతో మహా పండిత శాస్త్రకవి శ్రీ మేళ్ళచెర్వు వారి కవిత్వ శోభను చెప్పే ప్రయత్నం చేశాను .దీన్ని పండితులద్వారా తెలుసుకొని వింటే పరమాన౦దమే లభిస్తుంది .మొదట్లోనే చెప్పినట్లు సమర్ధులు ఎవరైనా దీన్ని పూర్తీ అర్ధ తాత్పర్య భావాలతో విశేషాలతో రాసి లోకోపకారం చేయవలసిందిగా మరో సారి కోరుతున్నాను .
కావ్యమంతా గురు భక్తి ప్రవాహమే .కవిత్వం పీయూష లహరి . ఎంతో తేలిక పదాలతో ,ధారా శుద్ధి సందర్భ శుద్ధి తో రచన సాగింది .శ్రీ గురు చరిత౦ ను శిష్య శ్రీ శాస్త్రిగారు కవితాక్షర సువర్ణాలతో శోభ కూర్చారు .దీన్ని రాసిన శ్రీ శాస్త్రిగారికీ నాకు అందించి చదివింప జేసి రాయించిన శ్రీ తూము లూరు వారికి శతాధిక కృతజ్ఞతలు .ధన్యోస్మి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-11-16 –ఉయ్యూరు
Good