వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -18
మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్యం
విద్యాధరుడు రాసిన ఏకావలి అనే అలంకార శాస్త్రానికి మల్లినాద సూరి’’ తరల ‘’వ్యాఖ్యానం రాశాడని ,అందులో ఎన్నో అలంకార శాస్త్ర విషయాలున్నాయని ముందే తెలుసుకొన్నాం .’’అలంకార సర్వస్వం ‘’లో మల్లినాధుడు ఉదాహరించిన విషయాలను ఇప్పుడు చూద్దాం .శిశుపాల వధ లోని అనేక శ్లోకాల అలంకార విశేషాలను వివరించటానికి అలంకార సర్వస్వం లోని శ్లోకాలను మల్లి నాధుడు పేర్కొన్నాడు –‘’విధాయ వైరం సమయేం నరోరో య ఉదాసతే –ప్రక్షిప్యో దర్ధషం కక్షే రోరతే తేభి భాస్తం’’. ఔదాశీన్యం ‘’,సాయన ‘’అనే మాటలు ఉన్న వాక్యాలు అననుకూలం గా ఉన్నాయని మల్లినాద భావన .సందర్భాన్ని బట్టి ఆ రెండు వాక్యాలమధ్య సంబంధం వరుసలో ఉండటం ‘’సాద్రుశ్యాలంకారం ‘’విశేషం అన్నాడు .కనుక ఇది నిదర్శనాలంకారం లో ఒక అంశమే .కనుక ఇక్కడ రెండు స్వతంత్ర వాక్యాలలో ఉన్నందున అలంకారం దృష్టాంతం కాదని తేల్చాడు .ఇక్కడ బింబ ప్రతిబింబ సామ్యాన్ని గుర్తించాలన్నాడు . .అలాగే మేఘ దూతం 2 వ సర్గ లోని 18 శ్లోకం ,కిరాతార్జునీయం 9 వ సర్గ 15 వ శ్లోకం ,కుమారా సంభవం 1 వ సర్గ 2 వశ్లోకం పై వ్యాఖ్యానిస్తూ అదే విషయాన్ని తెలియ జేశాడు
ఏకావలి లో కొన్ని అలంకారాలు ‘’ఆరోపం ‘’పై ఆధార పడి ఉన్నాయని తెలుస్తుంది .అలంకార సర్వస్వాన్ని ఆధారం గా చేసుకొని మల్లినాధుడు ‘’అరోప ‘’విషయం పై చక్కని చర్చ చేశాడు –‘’అన్యత్రా న్యావాపః ‘’అంటే ఒక దానికి బదులు వేరొక దానిని చెప్పటం లేక ఉంచటం .’’విశేషోక్తి ‘’ని వివరిస్తూ కిరాతార్జునీయ శ్లోకాలను పేర్కొన్నాడు సూరి .ఇక్కడ కూడా అలంకార సర్వస్వ సహాయం తోనే విశేషోక్తిని వివరించాడు .-‘’యదికరణా సవ్యేకార్య సిద్ధిస్తదా విశేషోక్తిః’’అంటే కారణాలు అనేకం ఉన్నా ఫలితం కలగక పోతే ,అది విశేషోక్తి .ఏకావలి వ్యాఖ్య తరలలో అలంకార సర్వస్వం నుంచి అనేక ఉదాహరణలిచ్చాడు .మరో అలంకారం’’ ఉత్ప్రేక్ష ‘’ను వివరిస్తూ సూరి అలంకార సర్వస్వంలో అధ్యావసాయ భావనలను ‘’పరిగణన లోకి తీసుకొని చెప్పాడు .-‘’సాదృశ్య ఏకత్వా ధ్యాసా దదోషః—ఇత్యలంకార సర్వస్వ కారః ‘’అని పేర్కొన్నాడు .ఉత్ప్రేక్ష ను వివరిస్తూ ‘’అధ్యవసాయ ‘’పై తనకున్న భావాలను స్పష్టం చేశాడు –‘’అలంకార సర్వస్వ కారస్తు తేష్వ సాపి స్వతః సిద్ధత్వాత్ ప్రౌఢోక్తిసద్విష యో రభేదాధ్యసాయః –సంభావన వ్యాప్తి రిత్యాః –అత్ర సాక్షియత్వం తత్ ప్రయోజకత్వా న్నిమితం తత్ర అధ్యావసాయః ఇత్యాదినా సందర్భేణ’’అని ఏకావలి లో పేర్కొన్నాడు .అలంకార సర్వస్వ కర్త అభిప్రాయాన్ని దృష్టికి తెచ్చాడు సూరి .’’ఖండ గస్త వారి నారీషు ‘’అన్న దానిపై వ్యాఖ్యానిస్తూ –అస్య ప్రపంచ స్త్వలంకార సర్వస్వే ద్రస్టవ్యః ‘’ఏకావలి వ్యాఖ్య .
మమ్మటుడు’’భేదా భేద ‘’అలంకార విషయం లోచెప్పిన దాన్ని మల్లినాధుడు విభేదించాడు .అతిశయోక్తికి నాలుగే నాలుగు భేదాలు చెప్పాడు . మమ్మటుడు ‘’సంబందా సంబంధ ‘’ను ప్రత్త్యేక వర్గం గా భావించాడు .అతిశయోక్తి అలంకారం లో 5 రకాలు ను సమర్ధించాడుసూరి .అర్ధ శ్లేష శబ్ద శ్లేష ల పై మమ్మటుడి అభిప్రాయాలను అలంకార సర్వస్వం ఆధారంగా చర్చించి ‘’అర్ధ శ్లేష ‘’ను మాత్రమే గుర్తించాడు సూరి .భోజుని ప్రకరణాన్నిఉదాహరించినా దానిపై తాను భేదిస్తున్నానని చెప్పాడు . భోజుడు చెప్పిన ‘’చిత్ర హేతు ‘’ను మల్లినాధుడు ‘’అసంగతి ‘’అన్నాడు .కారణం మన్మధుని ఆయుధపు దెబ్బఒక చోట పడితే గాయం వేరొక చోట పడింది కనుక అన్నాడు —త్వదాపాంగసాహ్వయం యదంగతే –ముక్తం తదన్య తరేన చోష్యహం మనసి క్షతః –ఇత్రాన్యత్ర శస్త్ర పాతో అన్యత్రం క్షతి రిత్య సంగ గతి రేవేయామిత్యార్ధః ‘’
అనేక ప్రకరణాలను కర్త పేరు చెప్పకుండా మల్లినాధుడు ఉదాహరించాడు .వీటిని సింపుల్ గా ‘’తదుక్తం ‘’అన్నాడని లాల్యే పండితుని పిండితాభిప్రాయం . .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-11-16 –ఉయ్యూరు