వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -21

వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -21

మల్లినాధుని ధనుర్వేద  పాండిత్యం

వ్యాఖ్యానాలలో అక్కడక్కడ మల్లినాధుడు ధనుర్విద్య పై తనకున్న పాండిత్యాన్ని తెలియ జేశాడు .కామ భంగిమను వివరిస్తూ దాన్ని గుర్తింఛి దానికి ఒక సాంకేతిక నామాన్ని పెట్టాడు .విలు కాడు బాణం సంధించేటప్పుడుసాధారణంగా అయిదు రకాల భంగిమలను ప్రదర్శిస్తాడని సూరి చెప్పాడు .కుమార సంభవం లో కాళిదాసు చెప్పిన భంగిమ ‘’ఆలీఢ కామ ‘’భంగిమ అని అప్పడు ధనిష్కుడు పిడికిలి బాగా బిగించి పట్టుకొంటాడని వివరించాడు –

మల్లినాధుని అపార వ్యాకరణ పాండిత్యం

మల్లినాదునికి వ్యాకరణ శాస్త్రం పై అపారమైన పాండిత్యం ఉంది .కవుల ప్రయోగాలను శాస్త్ర రీత్యా నిగ్గు తేల్చి చెప్పాడు .కిరాతార్జునీయం లో ‘’అర్ధ గౌరవం ‘’అనే పదాన్ని ఉపయోగించాడు .పాణిని సూత్రం ప్రకారం నాణ్యతను తెలియ బరచే పదం షష్టీ విభక్తి తో సమ్మేళనం చేయ కూడదు .కానీ మల్లినాధుడు   గుణం లేక వేరొక వస్తువు లేక విషయం సందర్భం లో  సమ్మేళన పద౦గా వాడకూడదని పాణిని సూత్రం నిషేధించిందని చెప్పాడు .కాని గుణాన్ని మాత్రమె చెప్పే సందర్భం లో దానికి నిషేధం లేదని స్పష్టం చేశాడు .మల్లినాధుడు సాధారణం గా ముందు పదాన్ని సమర్ధించి చెప్పి తర్వాత పాణిని సూత్రాన్ని లేక సూత్రాలను  ఉటంకి౦చి ఆ పదాన్ని సమర్ధిస్తాడు .అన్ని వ్యాఖ్యానలలోను ఇదే  విధానాన్ని  సూరి కొనసాగించాడు అని ప్రమోద్ గణేష్ లాల్యే పండితుడు అభిప్రాయ పడ్డాడు .

కిరాతార్జునీయం లో ‘’గత్వరైః’’పదాన్ని-గత్వరైః-గమనశీలైః-అస్తిరే ‘’అంటూ   మల్లినాధుడు వివరించి చెప్పాడు .అందులోనే ‘’దుర్వచనం ‘’అంటే ‘’వక్తు మవశక్యం ‘’అని అర్ధం చెప్పాడు అంటే చెప్పటానికి వీలు కానిది అని అర్ధం .’’నాగాధిపస్య ‘’పదం  షష్టీ విభక్త్యంతం గా శేషుని గూర్చి చెప్పబడిందని సమర్ధించాడు .క్రద్యోగవలన ష స్ట్య౦తం కాలేదని ప్రాధమిక ప్రత్యయం క్రుదంతం వల్ల అయి౦ద న్నాడు .పాణిని చెప్పిన నిషేధం ఇక్కడ పనికి రాదనీ చెప్పాడు .పాణిని సూత్రాలతో వ్యాకరణ విశేషాలను పెక్కింటిని మల్లినాధుడు వివరించాడు .కవిఉపయోగించిన గ పదాన్ని పాణిని సూత్ర సాధన చేత సమర్ధించి చెప్పాడు .ఎక్కడ పాణిని సూత్రం చెప్పాడో చెప్పలేని పరిస్థితి  ఉంది .కొన్ని నమూనాలను చూద్దాం .’’పారితో నికేతాన్ ‘’అనే శిశుపాల వధ లోని   పదం లోని విభక్తి విషయం లో పాణిని సూత్ర వార్తికం’’ అభితః పరితః ఇత్యాదినాద్వితీయా’’  ద్వారా సమర్ధించాడు .’’అవతస్తరే ‘’పదం విషయం లో పరిపూర్ణ కాలం (పెర్ఫెక్ట్ టేన్స్ )లో గుణం మారి పునరావృత్తి అయి ‘’స ‘’లోపిస్తుంది –‘’అవతస్తరే –స్త్రుణాతేః కర్తరి లిట్ –కృతశ్చ  సంయోగాదేర్గుణాః’(పాణిని )లింగ జన్జ్హోర్నలోపశ్చ శర్పువాఃరావయః (పాణిని  ) ఇత్యభ్యాసః సకారలాపశ్చ ‘’ అనే సూత్రాన్ని చెప్పాడు .రఘు వంశం లో లఘు అనేది రఘు గా మారుతుంది అని తెలియ జెప్పటానికి ‘’ఇత్య ప్రత్యయే వాలమూల లఘ్వలమంగుగులీనాం కాలే రత్వ మాపద్యతే ఇతి వైకల్పికె రేఫాదేశే రఘురితి రూపం సిద్ధం ‘’అని వివరించాడు .అలాగే మధు శబ్దానికి పుంలింగ రూపాన్ని –‘’అర్ధస్చ పుమ్సిచః ఇతి పుమ్లింగతా ఉక్తంచ మకరందస్య మద్యస్య మక్షికస్యపి వాచకః అర్ధర్చాది గణే పాఠాత్పుం నపు౦సకయోర్మధుః’’సూత్రం తో తెలియ జేశాడు .సమాసాంత పదం లాగా శిశుపాల వధ లోని ‘’ఆపధ’’పదం ఏర్పాటును దాని నపుంసక లింగాత్వాన్ని మరో సూత్రం తో సమర్ధించాడు –‘’ఆపద –పధోవిభాషాం –ఇతి నిషేధ వికల్పాత్ శ్రుక్పూ ఇత్యాదినా సమాసాంతః ఆపదం నపు౦సకం ఇతి నపు౦సకత్వాత్’’అనే సూత్రం తో సాధించి చెప్పాడు .

కొన్నిపదాల వ్యాకరణ నిర్మాణాన్నివివరించటానికి  మల్లినాధుడు  ఎన్నో సూత్రాలను తెలియ జేశాడు .అవసరమైతే ఒకటికంటే ఎక్కువ సూత్రాలను చెప్పి పదనిర్మాణ రహస్యాన్ని విప్పి చెప్పాడు .కొన్ని అసాధారణ పదాల ఏర్పాటును వివరించటానికి పాణిని సూత్రాలపై తనకున్న పట్టు తో నిరూపించాడు .వీటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకొందాం .

1-‘’విశ్వద్రిచి ‘’పదం విషయం లో చివరి అచ్చు తర్వాత వచ్చే హల్లు   ‘’విశ్వన్ ‘’మరియు’’ దేవ’’లసర్వ నామం అవుతుంది .  , దానిని ఏ ప్రత్యయం ఆశ్రయి౦చనప్పుడు దానికి బదులుగా  ‘’అద్రి ‘’వస్తుంది .పదం అదనంగా ఐ ను గ్రహించి’’ అ ‘’కు లోపం కలుగుతుంది అని చెప్పాడు –‘’విశ్వగ్దేవ యో శ్చ టేరధ్రన్చా తావ ప్రత్యయే ‘’పాణిని-6-3-92  –ఇతి దేరత్రాదేశా ‘’

‘’దారోజతే రూప సంఖ్యానాత్ ఉగితశ్చ’’-పాణిని 4-1-6 ఇతి దీమ్పు ‘’ఆచ’’-పాణిని 6-4-138

‘’ఇత్యకార లోపే ‘’చై ‘’-పాణిని-6-3-138

2-‘’తురసత్ ‘’పదా విర్భావాన్ని వివరిస్తూ పాణిని సూత్రాలను ‘’క్విప్ ‘’ను తొలగించి ర ను దీర్ఘం’’ రా’’చేసే సూత్రం చెప్పాడు –‘’తురాషట్ –‘’సహా తే శ్చోరాది కత్వాత్ క్విప్ –నహి వ్రుత్తీ-త్యాదినా ‘’-నైషధం -3-95

‘’పూర్వ పదస్య దీర్ఘః ప్రకృతి గ్రహేణ ణ౦తస్యాపి గ్రహ పాత్ ముగ్ధ శబ్దస్తు తురా శబ్దం టాబంత మాహ’’

3-మల్లినాధుడు ‘’అక్షి ‘’శబ్దం ‘’అక్ష ‘’గా మారటాన్ని వివరిస్తూ ,రఘు వంశం లోని  ‘’కాతరాక్షి’’లోని  చివరి ‘’ఐ ‘’అ గా మారటానికి రెండు సూత్రాలు పేర్కొన్నాడు –‘’కాతరాక్షీ బహువ్రీహో సవ యక్ష్మోః స్వండాత్షచ్ ఇతి షచ్ –షిద్వేరాదిభిశ్చఇతి దీమ్ష్ ‘’

4-కాళిదాసు ‘’ఘటోద్ని’’పదాన్ని గోవులకు విశేషణంగా  వాడాడు .’’ఉధాస్ ‘’అనేదాని బదులు ‘’అనం ‘’వచ్చి సమ్మేళన పదం బహువ్రీహి సమ్మేళనపదం అవుతుందని చూపించాడు –‘’ఘటా ఇవోదాంసి యాసం తా ఘటోద్రీః’’-ఊఘ సొ నండ్ఇత్య తండా దేశః –బహువ్రీహే రూఢసోడీమ్ష్’’

నైషద చరిత్ర లోని ఒక వాక్యం పై వ్యాఖ్యానిస్తూ సాధ్యమైన అన్ని అర్ధాలను తెలియ జేశాడు .’’హాన్దిక్వి పండితుడు దీన్ని అనువాదం చేసి అందించాడని లాల్యే పండిత ఉవాచ .ఇంద్రుడు శుభాంతంకోసం   నలునిలాగా ,చివరికి అసలైన నలుడిగా మారటం అంతా అతని కపట స్వభావమేనని మల్లినాధుని తీర్పు .-‘’కిం స్తానిషద భావ మదంత దృష్టం తాద్రుక్ కృత వ్యాకరణాః  పునః సః’’(నైషదీయం -10-136).ఇంద్రుని నలుని పాత్ర ధరించినా, నలుని శీల పవిత్రతను వ్యక్తం చేయలేక పోవటానికి కారణం అదే .’’గౌరీ ‘’అంటే తెలుపు అని హరిణి అంటే దుప్పి అని చెప్పి వన సంచారులైన వాటి పేర్ల విషయం లో తానేమీ కల్పించుకోనని చెప్పాడు .-‘’తస్య ఆలూ సంబందినః కార్యస్య హొతోః తదర్ధం దృష్టం నిషిద్ధం సయాని వద్భావం స్యాని వదాదేశోనల విధౌ –(పాణిని )-ఇత్యేనాల్ సంబందికయే శయని వదాదేశస్య నిషేషాది తి భావః కిం కద మదంత ఇతి అహో ఆశ్చర్యం అన్యాచ్చ ‘’

‘’తాద్రుకృత కరణాః తయాకృత   సంస్కారః  స ఇత్యయం శబ్దః స్వస్వకీయం ఆదేశం విదాయేతి ఖండీ విశ్లేషణాః త్యదాధత్వం ప్రాప్యేత్యర్ధః నానలః కార్యస్య హేతోః ఆలూ అక్షిత అలమ్ఘ్యాదిల క్షణస్యాని కార్యార్ధం కిం ఇతి దుస్టమలావిదావితి ప్రతి శేష దనుపంన్నం సయాని వభావ మదంత ?అహో విరుద్దామిత్యర్ధః ‘’లతో సమర్ధించాడు .

న్యాస,న్యాసోద్ధూత ,వామన అనే ప్రసిద్ధ వ్యాకరణ శాస్త్ర వేత్తల రచనలనుండి తన అభిప్రాయాలకు బలం చేకూర్చటానికి మల్లినాధుడు ఉదాహరించాడు .పాణిని సూత్రాలను పేర్కొనటం తో తనపని అయి పోయిందని సంతృప్తి పడకుండా ,ఆ సూత్రాల బలం చాలక పొతే ,తరువాత కాలపు వ్యాకరణ శాస్త్ర వేత్తల అభిప్రాయాలనూ ఉటంకించి తనవాదనకు బలం చేకూర్చుకొన్నాడు.రఘు వంశం లోని ‘’అరిహ ‘’శబ్ద విచారణ చేస్తూ మల్లినాధుడు ‘’అరి హణో రిపుద్రాః హంతేః క్విప్బ్రహ్మ భూణ వృత్రేషు క్విప్ ఇతి నియమస్య ప్రాయిక్త్వాత్ –యయాహ న్యాస్కారః  ప్రాయికశ్చాయం నియమః క్వచిదన్యాస్తి భూప పదేదృశ్యతే మధుహా ప్రాయిక్త్వం చ వశ్య మానశ్చబహుళ గ్రహణ స్య పురస్తాదప ‘’సూత్రాన్ని చెప్పాడు .

మల్లినాధుడు అనేక సంక్లిష్ట పదాలను వామన సూత్రాధారం గా రద్దు చేశాడు .ఉదాహరణకు –‘’అగ్ర పాదః ‘’-దీనిపై వివరిస్తూ సూరి –‘’కర్మ ధారయ సమాసః హస్తాగ్రహ స్తదాయో గుణ గుణినోర్భేదా భేదాభ్యా౦ ఇతి వామనః ‘’అని (కుమార సంభవం7-58)  పేర్కొన్నాడు .’’శరణాభవం’’అనే మేఘ సందేశ 1-45 శ్లోక పదాన్ని వివరిస్తూ ‘’శరవణాభవం’’-‘’అవర్జ్యో బహువ్రీహి ర్వ్యదికరణే జన్మాదుత్తర పద ఇతి వామనః ‘’అంటూ వామనోదహరణ నిచ్చాడు .

ఈ విధంగా మల్లినాధుని వ్యాకరణ పరిజ్ఞానం అవధులు లేనిదని రుజువవుతోంది .

తర్వాత మల్లినాధుని ‘’అలంకార శాస్త్ర విజ్ఞానాన్ని ‘’తెలుసుకొందాం .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.