వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -23
మల్లినాధుని అలంకార శాస్త్ర పాండిత్య గరిమ-2
అలంకారాలను కలిపే విషయం లో మల్లినాధుడు స్పష్టమైన వివరణలిచ్చాడు .శిశుపాలవధ -1- 89 శ్లోకం లోకంసుని ఇతర రాజులను లేడి తో పోల్చిన సందర్భం లో ఉన్న అలంకారం ,’’శ్లిష్ట పరంపరిత రూపకం ,ఉపమాలంకారం తో కలిసిన మిశ్రమాలంకారం అని చెప్పాడు మరొక వాక్యం లో సింహం హరి(కృష్ణ ) రూపం లో ఉన్నదని చెప్పాడు.మరో చోట రాక్షసులు ఏనుగులు అన్న శ్లోకం లో రూపకాలంకారం ఉందన్నాడు .అసురపై ద్విశ అధ్యారోపణ ,హరి(సింహం ) పై హరి (కృష్ణ )ను అధ్యారోహణ౦ చేసినప్పుడు శ్లేష లో చెల్లుతుందని చెప్పాడు .ఇలాంటి సంకర అలంకారాలను మొదటి సారి లోకం దృష్టికి తెచ్చినవాడు మల్లినాదుడే .
ప్రామాణిక అలంకార శాస్త్రం లోస్పష్టంగా నిర్వచించ బడిన చెప్పబడిన అలంకారాలను మల్లినాధుడు గుర్తించి ముఖ్య మైన అలంకారాలను వివరించాడు .కొన్ని ఇతర అలంకారాలు ఉంటె అర్దాలంకార ,శబ్దాలంకారాల సంసృస్టిలేక రెండూ గా భావిస్తూ మరిన్ని అలంకారాలను ఆయన గుర్తించి చెప్పాడు .కిరాతార్జునీయం -4-41 శ్లోకం –‘’భవ కీతయే హత వ్రుహంతమసమవబోధ పారి రజసః శమనం –పరిపీయ మాణానివ వో సకలే స్వసాదమే తినాయనా౦జలిభిః’’’’ లోని అలంకారం విషయం లో అందులో 1-శ్లిష్ట రూపక 2-రూపక 3-ఉత్ప్రేక్ష 4-సంకర అనే నాలుగు అల౦కా రాలున్నట్లు గుర్తించాడు . ‘’అవబోధ వారి ‘’శబ్దం లో రజస్అంటే దుమ్ము అయితే వారి అంటే నీరు అయి ప్రాముఖ్యం పొందింది అన్నాడు .దుమ్ము కుదుటబడటాన్ని’’సామన ‘’శబ్దం రూపకం గా సూచించిందని చెప్పాడు .భారవికవి అవబోధ జలాన్నివనదేవతల దోసిలి అనే కనులు తాగాయని ,వివరించాడు ఇది ఉత్ప్రేక్షాలంకారమే నని కారణం రెండూకూడా స్వతంత్రమైనవే అని ఇక్కడ అలంకారాలు సంస్రస్టి చెందాయని తెలిపాడు ..మరో చోట పరిణామ ,రూపక అలంకారాల మధ్య తేడాను స్పష్టం చేశాడు .’’రూడ్బెర్జెన్ ‘’మహాశయుడు మల్లినాద అనతరంగాన్ని విశ్లేషించి చెప్పినదాన్ని ఇక్కడ తెలుసుకొందాం –‘’యత్ర ప్రకృత కార్యోపయోగితాయ విషయ విషయ్యాత్మనా పరిణమితిస పరిణామాలంకారః ‘’–‘’ఏకావలి పై వ్యాఖ్య రాస్తూ మల్లినాధుడు తరువాతి దానిపై ఒక విషయం ఆరోపిస్తేఅక్కడ విచారణలో ఉన్న విషయం ఉపయోగపడేది అయితే అది ‘’పరిణామ అలంకారం ‘’.ఇలాంటి సందర్భాలను వివరిస్తూమల్లినాధుడు రూపక ,పరిణామ అలంకారాల మధ్య భేదాన్ని విద్యా చక్రవర్తి భావాలను బట్టి వివరించాడు .ఏకావలి పై త్రివేది రాస్తూ శిశుపాల వధలోని అనేక ప్రకరణాలను ఉదాహరించాడు .మల్లినాధుడు విద్యాధరుడు చెప్పిన పరిణామాలంకారాన్నే ఎన్నుకొన్నాడు ‘’అని చెప్పాడు .
ఇప్పుడు మల్లినాధుడు చర్చించిన మరికొన్నిఅలంకారాలను చూద్దాం .మహా కావ్యాలలోని ‘’సమాసోక్తి ‘’అలంకారాన్ని చాలా నేర్పుగా వివరించాడు .శిశుపాల వదలోని రాత్రి వేళ కలువల అందాన్ని వర్ణించే సందర్భం లోకవి ‘’చంద్రుడు కలువలతో తెల్లారేదాకా సయ్యాటలు ఆడాడని ‘’చెప్పాడు .అతని చేతులు అంటే కిరణాలు పడమటి వైపుకు సాగిపోతూ వాటిపై విశ్రమించాడు .చంద్రునికి అలసట వచ్చి వివర్ణుడయ్యాడు.చంద్రుని చర్యలు దక్షిణ నాయకత్వాన్ని తలపిస్తాయి .రెండర్ధాల విశేషణాలను వాడటం వల్లనే ఇది సాధ్యం కనుక ఇది ‘’సమాసోక్తి ‘’అల౦కారం అని స్పష్టం చేశాడు .దీనిపై మల్లినాధుడు అతి విస్పష్టం గా విశ్లేషించి చెప్పాడు –శిశుపాల వదలోని 11-22 శ్లోకం –‘’ఉపకుముదవన దీహాస కేళి ప్రసంగా-దధి కరూది రశేశా ప్యుషాం జాగరిత్వా –ఆయమపర దిశో౦కే ముజ్వతి స్రస్త హస్త –శిశియిషురివ పాండుం మ్లానమాత్మా ని మి౦దుమ్’’.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-16 –ఉయ్యూరు