మోతాదు మించిన మోదుడు
మంచి వాడనుకొంటే మంచమంతా చెడగొట్టినట్లు
ఏదో పొడి చేస్తాడనుకొంటే పొడిచి పారేశాడు
సామాన్యుడిని ,ముసలి ముతకా బీదజనాన్ని
రోడ్డున పడేసి రద్దు తో మోదీ
జనాన్ని మోది మోది బాది
పారేసి లబోదిబో మనిపించాడు .
నల్ల కుబేరుల నేమీ పీక లేక
నలుపు తెలుపౌతుందని నమ్మి
అడ్డ దిడ్డంగా అర్ధ రాత్రి పెద్ద నోట్లు రద్దు చేసి
వీరంగం వేస్తుంటే వెంకయ్యా అండ్ పార్టీ
డప్పూ డోలు వాయిస్తూ వీర భజన చేస్తుంటే
జనం బాంకుల వద్ద క్యూలలో పడిగాపులు పడుతూ
లేస్తూ ,వారికి రావాల్సినది అవసరమైనది
దేబిరించి తీసుకొనే పరిస్థితి కల్పించిన
ఈ ముఠాను జనం జీర్ణించుకోలేక
మొహం మీదనే కక్కేస్తుంటే
ఆర్ధికం చక్కబడేదెన్నడు?
జనం ఆర్తి తీరేదెన్నడు ?
నగదు రహితం చివరికి నగదే రహితమై
పోతుందేమో ?ఏమో ?ఏమో ఎవరికి తెలుసు ?
ఇక దారేది ఓ జాతిపితా !మహాత్మా !
గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-16 –ఉయ్యూరు
—