నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి
‘’నువ్వైనా చెప్పవమ్మ సాంబనువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికిశివుడికి ‘’అన్న తనికెళ్ళ భరణి పాటకు పేరడీ
‘’నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి
పెద్ద నోట్ల రద్దు గొడవ నీ బాబు మోడికి – నువ్వైనా
రద్దు చేస్తే వచ్చే కష్టం నష్టం తెలియ లేకనే
దబాయింపు సెక్షన్ లో పడిలొల్లి లొల్లి చేసినాడనీ –నువ్వైనా
బ్యాంకుల్లో క్యూల వరుస కొండవీటి చేంతా డై౦దనీ
క్యూలలోనే ప్రాణాలు హరీ మంటూ క్యూలు కట్టాయనీ –నువ్వైనా
నల్ల కుబేరులేమో బెదర లేదని , పాత నోట్లు పోయినా
డూప్లికేటు నోట్లు క్షణాలలో గుద్దిపారేసి మళ్ళీ కుబేరులైపోయి నారనీ –నువ్వైనా
ఏది తెలుపో ఏది నలుపో తెలియలేక, దిక్కు తోచక
సామాన్యులు కుదేలై కళ్ళు తేలేసి గుడ్లు మిటక రిస్తున్నారని –నువ్వైనా
పులి మీద స్వారీ చేస్తూ ఎవరినీ లెక్క చేయక
మీసం లేకున్నా తెల్ల గడ్డం దువ్వుతున్నాడని -నువ్వైనా
పార్టీ లో లుకలుకలు ,ఎంపీల్లో నైరాశ్యం ,సహమిత్రుల అసహాయత్వం
అన్నీ పెనవేసి కొంప ముంచుతుంటేను నీరోలా ఫిడేల్ వాయిస్తున్నాడని –నువ్వైనా
కాళ్ళు తెగిన కాంగిరేసుకు కాళ్ళు తెచ్చి ఇచ్చినాడని
తిరస్కరింప బడ్డ కమ్మీలకే కాక చిల్లర మల్లర పార్టీలకూ ప్రాణం పోసినాడని—నువ్వైనా
హోం వర్క్ చేయకుండా అర్ధ రాత్రి చేస్తే నిర్ణయాలు
బెడిసికొట్టి కొంప కూల్చిందనీ ,కొల్లేరు చేసిందనీ –
నువ్వైనా చెప్పవమ్మ నీ కొడుకు మోడికి
పెద్ద నోట్ల రద్దు గొడవ నీ బాబు మోడికి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-12-16 –ఉయ్యూరు