గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
14-కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత –హర్ష దేవ మాధవ్
గుజరాతీ సంస్కృత భాషలలో దిట్ట మైనకవి హర్ష దేవ మాధవ్ 20-10-1954 న గుజరాత్ లోని భావనగర్ జిల్లా వార్తెజ్ లో మన్ సుఖలాల్ , నందన్ బెన్ దంపతులకు జన్మించాడు .ప్రాధమిక విద్య స్వగ్రామం లోనే పూర్తి చేసి, సెకండరీ విద్యను కొలియాక్ లోని మాధ్యమిక పాఠశాలలో చదివి 1971 లో ఎస్.ఎస్.సి పాసయ్యాడు .1975 లో గుజరాత్ యూనివర్సిటీ లో ఎక్స్టెర్నల్ విద్యార్ధిగా పరీక్ష రాసి బి ఏ డిగ్రీ అందుకొన్నాడు .టెలిఫోన్ ఆఫీస్ లో పని చేస్తూనే సౌరాస్ట్ర యూని వర్సిటి నుండి 1981 లో సంస్కృతం ఎం .ఏ. డిగ్రీ ప్రధమ శ్రేణి లో సాధించాడు .అహమ్మదా బాద్ లోని హెచ్ ,కె .ఆర్ట్స్ .కాలేజి లో లెక్చరర్ గా పని చేశాడు .1983 లో బి ఎడ్ ,1990 లో పి .హెచ్. డి.గుజరాత్ యూని వర్సిటి నుండి అందుకున్నాడు .’’ముఖ్య పురాణాలలో శాపాలు ప్రభావాలు ‘’అనే అంశం పై పరిశోధన చేసి గుజరాతీ భాషలో దిసీస్ రాసి పి హెచ్ డి.పొందాడు .శ్రీమతి సృతిజాని ని వివాహమాడి రుషి రాజ్ జానికి తండ్రి అయ్యాడు .
కవిత్వం లో ప్రత్యేకతలు
హర్ష దేవ మాధవ్ జపాన్’’ హైకూ’’ ,’’తంకా’’లను ,కొరియన్ ‘’సిజో ‘’నుసంస్కృత భాషలో రాసి గీర్వాణ భాషకు కొత్త వెలుగులు అద్ది తన ప్రత్యేకతను చాటుకొన్నాడు . .’’సంస్కృత కవులలో ఆధునిక ,విప్లవ కవులలో ఒకడు ‘’అని సమీర్ కుమార్ దత్తా, హర్షను ప్రశంసిస్తూ హర్షం వెలిబుచ్చాడు . Harshadev Madhav is a modern poet in true sense of the term. He thinks that poetry should appeal first to intellect and thereafter to emotion. In the eternal controversy between intellectuality and emotionalism Harshadeva takes side of intellectuality […] Harshadev happens to be one of the most profound modern Sanskrit poets. He betrays the great influence exerted on him by modern vernacular poetry and some of the images carved out by modern vernacular poets.
హర్ష దేవ్ సంస్కృత రచనలు
1-అలకానంద 2 మృగయా 3-బృహన్నల 4-లవ రస దిగ్దాఃస్వప్న మయా పర్వ తాః 5-ఆశిచ్చ మే మనసి 6-నిష్క్రాంతాః సర్వే 7-మృత్యుస్వం కస్తూరి మృగోస్తిఅనే పేరుతొ స౦స్కృత నాటకాలు వ్యాసాల సంకలనం 8-బుద్ధస్య భిక్ష పత్రే 9-భావాస్థిరాని జననాంతర సౌహృదాని 10-కన్నఖ్యా క్షిప్తం మాణిక్య నూపురం 11-భాతితే భారతం అనే సంస్కృత ప్రతికావ్యం . 1992 నాటికే 2,200 కవితలను సంస్కృతం లో రాసిన పోస్ట్ మోడరన్ సంస్కృత కవి హర్షదేవ మాధవ్ .
‘’మాధవ’’ గుజరాతీయం
1-హత్ ఫంఫోసే ఆంధియా సుగందినే(కావ్యం ) 2-మహాకవి మాఘ 3-శ్రీవాణి చిత్ర శబ్ద కోశ (సంస్కృతం –ఇంగ్లీష్ -హిందీ –గుజరాతి బొమ్మల నిఘంటువు (పిక్చర్ డిక్ష్ణ రి)
ఆంగ్ల ‘’దేవం’’
హర్ష దేవ మాధవ్ ఇంగ్లీష్ లో ‘’ మోడరన్ సాంస్క్రిట్ పోయెట్రి ఆఫ్ గుజరాత్ అప్ టు ది ఎండ్ ఆఫ్ 20త్ సెంచరి (కంట్రి బ్యూషన్ ఆఫ్ గుజరాత్ టు సాంస్క్రిట్ లిట రేచర్ -1998 ).
‘’హర్షా’’తిశయ పురాస్కారాలు
హర్ష దేవమాధవ్ 1994 లో గుజరాత్ సంస్కృత అకాడెమి అవార్డ్ అందుకొన్నాడు .1997 -98 లో భారతీయ భాషా పరిషత్ అవార్డ్ పొందాడు ఆయన రచించిన ‘’నిష్క్యాన్తయః సర్వే’’సంస్కృత రచనకు 1997 లో అఖిలభారత కాళి దాస సమ్మానాన్ని మధ్య ప్రదేశ్ కాళిదాస అకాడెమి నుండి పొందాడు .2006 లో ‘’’’తవ స్పర్శే స్పర్శే ‘’ సంస్కృత కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ అందుకొన్నాడు . 2010 లో గుజరాత్ సాహిత్య గౌరవ పురస్కారం గ్రహించాడు .ఎడిన్ బర్గ్ లో జరిగిన 13 వ ప్రపంచ సంస్కృత సభలో జరిగిన కవి సమ్మేళనం లోను.క్యోటో లో జరిగిన ప్రపంచ సంస్కృత సదస్సులోనూ పాల్గొని గౌరవ పురస్కారాలు అందుకొన్నాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-12-16- ఉయ్యూరు