గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -౩
18-నైషధం లో ధర్మ శాస్త్రీయ ప్రతి ఫలనం రచించిన –హరే కృష్ణ మెహర్
జనన విద్యా విశేషాలు
సంస్కృత విద్వాంసుడు ,పరిశోధకుడు ,కవి రచయిత,విమర్శకుడు ,గీత రచయిత,స్వరకర్త ,వక్త ,అనువాదకుడు అయిన హరే కృష్ణ మెహర్ ఒరిస్సా లో న్యు పారా జిల్లా సినపాల లో 5-5-1956 న కవితా సంపన్న కుటుంబం లో జన్మించాడు .తండ్రి నారాయణ భారసా మెహర్ ప్రసిద్ధ కవి .తల్లి సుమతి మెహర్ .తాత మనోహర్ మెహర్ పశ్చిమ ఒరిస్సాలో గానకవి గా సుప్రసిద్ధుడు .హరే కృష్ణ విద్య లో ప్రతి స్థాయి లో ఉన్నత ప్రమాణాల తో పాసయ్యాడు .సంస్కృతం లో బి ఎ ఆనర్స్ ను ఉత్కల్ యూని వర్సిటి రవేన్ షా కాలేజి నుంచి ,సంస్కృతం లో ఏం ఎ ,పి హెచ్ డిలను బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం నుంచి సాధించాడు .
ఉద్యోగం
ఒరిస్సా విద్యా శాఖలో సంస్కృత లెక్చరర్ గా చేరిన మెహర్ బర్గాలోని ప్రభుత్వ పంచాయత్ కాలేజి ,బాలాసోర్ లోని ఫకీర్ మోహన్ కాలేజి లోను పని చేసి ఈమధ్యనే భవానీ పట్నం లోని ప్రభుత్వ అటానమస్ కాలేజి లో సీనియర్ రీడర్ గా సంస్కృత శాఖాధ్యక్షునిగా పదోన్నతి పొందాడు . ప్రస్తుతం సంబల్ పూర్ లోని గంగాధర్ మెహర్ అటానమస్ కాలేజి లో సంస్కృత పోస్ట్ గ్రాడ్యుయెట్ కాలేజిలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు .
రచనా మెహరీయం
సాహిత్యం సంగీతం లలో అనేక వ్యాసాలూ రాశాడు హరే కృష్ణ .ఆధునిక సంస్కృత సాహిత్యం లో ప్రసిద్ధ గీత రచయితగా ప్రసిద్ధి చెందాడు . సరళ సుందరం గా ఆధునిక భావ సంపద తో రాయటం మెహర్ ప్రత్యేకత .సుప్రసిద్ధ ఒరియా రచయిత గంగాధర్ మెహర్ రచించిన ‘’తపస్విని ‘’కావ్యాన్ని సంస్కృత ,హిందీ ,ఇంగ్లీష్ భాషలలో అనువాదం చేసి హరే కృష్ణ మెహర్ తన త్రిభాషా వైదుష్యాన్ని, ప్రతిభను ప్రదర్శించాడు .రాష్ట్రీయ ,జాతీయ అంతర్జాతీయ మైన అనేక వర్క్ షాప్ సెమినార్లలో పాల్గొని తన సాహిత్య సంపన్నత ను రుజువు చేసుకున్నాడు .ప్రపంచ సంస్కృత సమ్మేళనాల లోను పాల్గొన్న ఘనత మెహర్ ది .తన ప్రతిభా సర్వస్వాన్ని రుజువు చేసే అనేక గ్రంధాలను రచించి ప్రచురించాడు .
మెహర్ సృజన
1-పి .హెచ్ .డి.ధీసిస్ గా ‘’ఫిలసాఫికల్ రిఫ్లెక్షన్స్ ఇన్ నైషధీయ చరిత 2- నైషధీయ కావ్యే –ధర్మ శాస్త్రీయ ప్రతి ఫలనం ౩-సాహిత్య దర్పణ అనే అలంకార శాస్త్రం ను ఒరియా,సంస్కృత వ్యాఖ్యానాలతో రచించాడు .4-మనోహర్ మెహర్ రచించిన సంస్కృత శ్లోకాలను ‘’మనోహర్ పద్యావళి ‘’గా సంకలనం చేసి ప్రచురించాడు .5-శ్రీ కృష్ణ జన్మ 6-మాతృ గీతికాన్జలిః ‘’అనే ఆధునిక సంస్కృత గీతికావ్యం 7-గంగాధర్ మెహర్ కవి ఒరియా భాషలో రచించిన ‘’తపస్విని ‘’కావ్యానికి 8-హిందీ అనువాదం 9-ఇంగ్లీష్ అనువాదం, 10-సంస్కృతానువాదం 11-కాళిదాస మేఘ దూత కావ్యానికి ‘’కోసలీ భాష ‘’లో అనువాదం .
హరే కృష్ణ అనువాద ప్రతిభ
1-భర్తృహరి మహాకవి రచించిన నీతి శృంగార, వైరాగ్య శతకత్రయ అనువాదం 2-శ్రీ హర్ష మహాకవి నైషధీయ చరిత -9 వ కాండ అనువాదం ౩-కాళిదాస మహాకవి కుమార సంభవ కావ్యం లోని 1,2,5 7,8 సర్గల అనువాదం 4-రఘువంశం -2 వ సర్గ 5-శివ తాండవ స్తోత్రం 6 –రామ రక్షా స్తోత్రం ,శివ రక్షా స్తోత్రం తో కలిపి 7-విష్ణు సహస్ర నామ 8-గాయత్రీ సహస్ర నామ
బిరుదులు ,పురస్కారాలు
ప్రతిభకు తగిన గుర్తింపు లభించి అనేక బిరుదులూ సత్కార సన్మానాలు ,పురస్కారాలు అందుకున్నాడు హరే కృష్ణ మెహర్ .అందులో ముఖ్యమైనవి –1-గంగాధర సమ్మాన్ 2-గంగాధర సారస్వత సమ్మాన్ ౩-జయ కృష్ణ మిశ్ర కావ్య సమ్మాన్ 4-విద్యా రత్న ప్రతిభా సమ్మాన్ 5-జయదేవ ఉత్సవ ప్రశంసా పురస్కారం 6-అశోక్ చందన స్మ్రుతి గంగాధర పురస్కారం 7-ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే స్మారక పురస్కారం 8-హరిప్రియ ముండ మెమోరియల్ పురస్కారం 9-డా.నీల మాధవ పాణిగ్రాహి పురస్కారం 10-వాచస్పతి గణేశ్వర రధ్ వేదా౦తాలంకార పురస్కారం 11-విశ్వ సంస్కృత దివస్ సమ్మాన్ –
ఇంత ప్రతిభా ఉత్పత్తులున్న ఈ సంస్కృత కవికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన పురస్కారం ఇంత వరకు లభించక పోవటం ఆశ్చర్యమే కాదు ,మన ప్రభుత్వపు అలక్ష్యం కూడా .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-12-16-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్