గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
46-మను స్మృతికి మహా భాష్యం రాసిన –మేదాతిధి(క్రీ .శ.1000)
మనువు రాసిన మను స్మృతి అనే న్యాయ శిక్షా శాస్త్రానికి మహా భాష్యం రాసిన తొలి రచయిత మేదాతిది .మనుధర్మ శాస్త్రం గా ప్రాచుర్యం పొందిన ఆ బృహద్గ్రంధ సారాన్ని లోకానికి మేదాతిది భాష్యం రాసి మహోపకారం చేశాడు .మేదాతిది ఎక్కడి వాడు ఏ ప్రాంతం లో భాష్యం రాశాడు అనేది చర్చ నీయా౦శ౦ గా ఉన్నది . కాశ్మీరు కు చెందినవాడు అని అందరూ భావిస్తుంటే కాదు దక్షిణ భారత దేశానికి చెందినవాడు అన్నాడు జూలియస్ జాలీ .గార్గ్ బూలర్ చెప్పగా మహా పండితుడు కాణే అంగీకరించింది మేదాతిది కాశ్మీర్ వాడని ,కాదంటే కనీసం ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాడు అని .రాబర్ట్ లి౦గాత్ ఈ వాదాలు అనవసరమని మేధా తిది కాశ్మీర్ దేశ కవి అని నిశ్చితాభిప్రాయంగా చెప్పాడు .మేదాతిది తన వ్యాఖ్యానం లో తన ముందు రాసిన వ్యాఖ్యాన కర్తల పేర్లను పేర్కొన్నాడు అని కాణే పండితుడు చెప్పాడు .యాజ్ఞవల్క్య స్మ్రుతి వ్యాఖ్యానమైన ‘’మితాక్షర ‘’. లో ఉన్నదానిప్రకారం మేదాతిది మను స్మ్రుతి వ్యాఖ్యానాన్ని క్రీ.శ.820 -1050మధ్యకాలం లో రాసి ఉంటాడని నిర్ధారించవచ్చు .లింగాత్ మాత్రం మేధాతిధి ది 9- 10 శతాబ్దం కాలం అన్నాడు .డేవిడ్ బ్రిక్ తన 2010వ సంవత్సర’’ సతీ సహగమనం ‘’ సమీక్షలో మేధాతిధి జీవితకాలం క్రీ శ.1000అని తేల్చాడు .ఇంతకంటే ఆయన గురించి మనకు తెలిసినది ఏమీ లేదు .
47-శిలా ,తామ్రశాసన, నాణాల పరిశోధకుడు –వాసు దేవ విష్ణు మిరాసీ (1893 -1985 )
డా .వాసుదేవ విష్ణు మిరాసీ మహారాష్ట్ర లో మధ్యతరగతి కార్తేడ్ బ్రాహ్మణ కుటుంబం లోరత్న గిరి జిల్లా దియోగడ్ తాలూకా కావెల్ గ్రామం లో 1893మార్చి 13 న జన్మించాడు . 82 జీవించి 3-4-1985లో మరణించాడు . శాసన పరిశోధకుడు సంస్కృత విద్వాంసుడు ,ఇండాలజిస్ట్ .20 వ శతాబ్దపు మహా విద్వాంసులలో పేరెన్నిక గన్నవాడు .ప్రాచీన భారత దేశపు నాణాలు ,శిలా తామ్ర శాసన పరిశోధకుడు .వీరి మహా విద్వత్తుకు బ్రిటిష్ ప్రభుత్వం 1941 లో మహా మహోపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరిస్తే భారత స్వాతంత్ర్యానంతరం భారత రాష్ట్ర పతి 1975 లో పద్మ భూషణ్ పురస్కారం తో సత్కరించారు . కొల్హాపూర్ లో ప్రాధమిక విద్య పూర్తీ చేసి పూణే చేరి .డిగ్రీ పాసై ,పూనాలోని దక్కన్ కాలేజి నుండి సంస్కృతం లో ఎం .ఏ .పొందాడు .బొంబాయి వెళ్లి ,ఎల్ఫిన్ స్టోన్ కాలేజి లో సంస్కృత ప్రొఫెసర్ గా పని చేశాడు .తర్వాత నాగ పూర్ లో సంస్కృత పీఠాది పతి పోస్ట్ కు ఆహ్వాని౦ప బడి చేరాడు .1942లో ప్రిన్సిపాల్ అయ్యాడు .1947నుంచి 1950 వరకు అమ్రోతిలోని విదర్భ మహా విద్యాలయం ప్రిన్సిపాల్ గా పని చేశాడు .1957 నుంచి 9 ఏళ్ళు 1966 వరకు నాగపూర్ యూని వర్సిటిలో ‘’ఆనరరి ప్రొఫెసర్ ఆఫ్ ఏన్షేంట్ ఇండియన్ కల్చర్ అండ్ హిస్టరీ మరియు హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ఇన్ హుమానిటీస్ గా సేవలు అందజేశాడు .
మిరాశీ 30 కి పైగా ఇంగ్లీష్ హిందీ మరాటీ భాషలలో పరిశోధనా పత్రాలు రాశాడు .275 కు పైగా ఇండలాజికల్ జర్నల్స్ లో వ్యాసాలూ రాశాడు .ఆయన రాసిన ‘’ఇన్ స్క్రిప్షన్స్ఆఫ్ ది కాలచూరి –చేది ఎరా’’బాగా ప్రసిద్ధి పొందింది .;;ఇన్ స్క్రిప్షన్స్ఆఫ్ వాకాటాస్ ‘’,ఇన్ స్క్రి ప్షన్స్ ఆఫ్ సిలహరాస్ ‘’,శాతవాహన –క్షాత్రప శిలాశాసనాస్ ‘’అన్నీ అన్నే .విలువైన సమాచారం తో శోభిల్లేవే .ఇండాలజీ ,కాళిదాస ,భవభూతి మహాకవులపైనా గ్రంధాలూ వ్యాసాలూ రాశాడు .
లార్డ్ లిన్ లిత్ గొ 1941 లో మిరాశీకి ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదునిచ్చి సత్కరించాడు .1966 లోసంస్కృత భాషా సేవకు . రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు ’1977భారత రాష్ట్ర పతి శ్రీ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ‘’పద్మ భూషణ్ ‘’పురస్కారం ప్రదానం చేసి గౌరవించారు .1970 లో భారత పురాతత్వ శాఖ గౌరవ కరేస్పా౦ డెంట్ పదివినిచ్చి గౌరవించింది .నాగపూర్ సాగర్ మొదలైన యూని వర్సిటీలు డి.లిట్ ప్రదానం చేశాయి .ఆలిండియా హిస్తారికాన్గ్రేస్ అధ్యక్షునిగా ఉన్నాడు .నూమేస్మాటిక్సొసైటీ ఆఫ్ ఇండియా ఎపిగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ అందజేసి సత్కరించాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-23-1-17 –ఉయ్యూరు