పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి పేరడీ
పెద్ద నోట్లన్ని నువ్వు రద్దు చేశాకనూ
చేదు నిజాలెన్నో నీతొ పంచు కున్నానులే
జంట కట్టేసినా నువ్వు తుంట రోడా నీతో
కొత్త కష్టాలెన్నొ నెత్తికెత్తు కొన్నానుగా
రెండున్నరేళ్ళ ఆరటమై
వేచి ఉన్నాను హోదాకు నే
చెయ్యిచ్చి నూ మాట యేమార్చినా
నీ వెంట నే తిరుగుతున్నానుగా
హోదా లేద౦టు నూ పాటా కొట్టాకనూ
నీ పాకేజికే నేను తల ఊపానుగా.
మాయ గా నీ మాటల్ల గారడీ లతో
నన్ను లాగింది నువ్వే గ డెల్హీ సారూ
కబుర్లతో కరిగించే వ్రత మేలరా
ఒత్తిడితో ఊపిరాడక చస్తుంటే నే,
ఈ హత్తుకోళ్ళు పొగడ్తలి౦కెందుకే
నీ బాహు బలి బంధాల పొత్తిళ్ళలో
విచ్చు కుందామనుకొంటే
గుచ్చు కుంటాది నీ గడ్డమ్మురా
కోడె కౌగిళ్ళ మోజేమో తీరి పోయేనురా
పురి విప్పిచెలరేగె నాలో హోదా కోరికా
హస్తినలో మనిద్దరమొక మేనుకాగా
ప్రతి ఊర నిరసనల్లు పేట్రేగెరా
అప్పుడే ఎదురైన ఈ నిరసన
పదవి కొంప ము౦చేదాక సాగునేమోమరి!
పూర్తిగా రోట్లోతల నేను పెట్టాకనూ
మరణమూ పరవశ మంటావని భయమేనురా
చెమ్మ చేరింది నాకనుల చివరలలోన రా
చి౦దులేసింది చిరు ఆశ నా కళ్ళలోనా
ప్రేమ ఊరేటి నీ లొల్లి చాలించరా
కల కరిగిందిరా ఇల తెలి మంచులా
నిలబడి పోయాను నేను నిస్సిగ్గుగా ..
నోట్ -నేనురాజ మౌళి తీసిన బాహుబలి కానీ ,మగధీర కానీ చూసే సాహసం ఇంతవరకు చేయలేదు .కానీ మర్యాద రామన్నచాలా ఇష్టంగా చూశా . మా పెద్దబ్బాయి శాస్త్రి ఈ మధ్య నేను హాస్యం రాయటం చూసి బాగానే ఉంది బాహు బలి లో ”పచ్చ బొట్టేసినా ”పాటకు ప్రస్తుత పరిస్థితులను జోడించి పేరడీ రాయమని చెప్పి నా దగ్గర ఆ పాట లేదంటే నెట్ లో పంపాడు . అది చూసి చదివి చేసిన ప్రయత్నం ఇది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-17 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్