రద సప్తమి ఎలా చేయాలి ?
మాఘ శుద్ధ సప్తమిని రధ సప్తమి అంటారు .రేపే 3-2-17 శుక్రవారం రధ సప్తమి .ఉదయం జిల్లేడాకులు లేక చిక్కుడాకులు,లేక రేగు పళ్ళు తల పైనా ,బుజాలపైనా పొట్ట మీద ఉంచుకొని ఈ క్రింది శ్లోకాలు చదువుకుంటూ చన్నీళ్ళతో 3 సార్లు తలనిండా స్నానం చేయాలి
1-సప్త సప్తి ప్రియే దేవి –సప్త లోకైక పూజితే –సప్త జన్మార్జితం పాపం –హర సప్తమి సత్వరం
2-లోల కిరాణా సప్తమ్యాం-స్నాత్వా గంగాది సంగమం –సప్త జన్మ క్రుతైః పాపైః—ముక్తిర్భవతి తక్షణాత్
3-మాఘే మాసే సితే పక్షే –సప్తమీ కోటి భాస్కరా –కుర్వాత్ స్నారార్ఘ్యం దానాభ్యాం –ఆయురారోగ్య సంపదః
4-నమస్తే రుద్ర రూపాయ –రసానాం పతయేనమః –అరుణాయాచ నమస్తేస్తు-హరివాస నమోస్తుతే .
స్నానం చేసిన తర్వాత ,ఆరు బయట తులసి మొక్క దగ్గర ఆవు పిడకలపై పొంగలి వండి ,పాలు పొంగుతున్నప్పుడు ‘’నమో సూర్య నారాయణ ‘’అంటూ నమస్కరించి ,ఆ పొంగలిని 5 చిక్కుడాకులలో పెట్టి తులసి పూజ చేసి నైవేద్యం పెట్టాలి .మరొక 15 చిక్కుడుఆకులలో పొంగలి పెట్టి , సూర్యునికి నైవేద్యం పెట్టాలి .తర్వాత దీనినే ప్రసాదంగాకళ్ళకు అద్దుకొని అందరూ స్వీకరించి తినాలి .సూర్య దండకమో ఆదిత్య హృదయమో ,చదువుకోవాలి . వస్తే అరుణ పారాయణ౦ చేయాలి . .
చిక్కుడు కాయలతో రధం చేసి దాన్నే సూర్య రధంగా భావించాలీ .అవి దొరక్క పొతే బియ్యపు పిండితో రధం ముగ్గు వేయాలి .రధ సప్తమి అంటే సూర్యుని జన్మ దినం అన్నమాట .ప్రభవ నామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో ,మాఘ శుద్ధ సప్తమి ఆదివారం అశ్వినీ నక్షత్రం లో సూర్యుడు జన్మించినట్లుపురాణాలు చెప్పాయి . మాఘ శుద్ధ సప్తమి ఉదయకాలం లో ఆకాశం లో గ్రహాలూ నక్షత్రాలు రధం ఆకారం లో కనిపిస్తాయి అందుకే రధ సప్తమి అనే పేరు వచ్చింది .సూర్యుడికి ఎరుపు రంగు ప్రీతి .అందుకే ఆయన పూజకు యెర్రని అక్షింతలు ,యెర్ర చందనం వాడాలి .సూర్యుడు సింహ రాశికి అధిపతి .ఆదివారం ఆయనకు చాలా ఇష్టం .దానినే భానువారం అంటారు .జగత్తుకు సాక్షి ,సర్వ సాక్షి ,ఆరోగ్య ప్రదాత భాస్కరుడు .సూర్యనమస్కారాలు గొప్ప ఆరోగ్యాన్నిస్తాయి .ఏ శ్లోకాలూ రాని వారు 1-ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర –దివాకర నమోస్తుతే 2-సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం –శ్వేతపత్ర (ఏక చక్ర )ధరం దేవం –తమ్ సూర్యం ప్రణమామ్యహం ‘’చదువుకోవచ్చు .
రధ సప్తమినాడే ఆడవాళ్ళు కొత్త నోము నోయ టానికి పూను కొంటారు .నీనినే నోము పట్టటం అంటారు .ఇదీ రధ సప్తమి చేసే విధానం .
3-2-17 శుక్రవారం రధ సప్తమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-2-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
.