శ్రీ సువర్చలా౦జ నేయ శతక త్రయం ఆవిష్కరణ
దాదాపు రెండు నెలల క్రితం మనసులో మెదిలిన శ్రీ సువర్చలాంజనేయ స్వామి వారిపై శతకం –శతక త్రయం గా రూపు దాల్చి నిన్న 5-2-17 ఆదివారం కార్యరూపం ఆవిష్కరి౦ప బడి ఒక అద్భుతం అని పించింది .శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు గారు రాసిన శ్రీ సువర్చలా సుందర వాయునందన శతకం ,శ్రీమతి ముదిగొండ సీతా రావమ్మగారు రాసిన శ్రీ సువర్చలా వల్లభ మారుతీ శతకం ,శ్రీ మంకు శ్రీను గారు రాసిన శ్రీ సువర్చేలేశ్వర శతకం నిన్న శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారి దేవాలయం లో ఉదయం 8-30 గం.లకు సామూహికంగా పాలు పొంగించటం ,9-గం.లకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నేనే చేయించి .పూర్తీ అయ్యాక మధ్యాహ్నం 12 గం లకు శాసన మండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ,శ్రీనివాసా విద్యాసంస్థల అధినేత శ్రీ పరుచూరి శ్రీనివాసరావు ,రోటరీ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గార్లు ఆవిష్కరించారు .ఆతర్వాత శతకత్రయాన్ని భక్తులకు అందజేయటం జరిగింది .
శతకం రచించిన కవులకు ఆలయ మర్యాదలతో అర్చక స్వామి శ్రీ వేదాంతం మురళీ కృష్ణచేత చందన తాంబూలాలతో పుష్పహారం తో సత్కరింప జేసి స్వామి వారి శేష వస్త్రాన్ని ఇప్పించాం. తరువాత సరసభారతి ఒక్కొక్కకవికి 10 వేల రూపాయలు ,పట్టు బట్టలు ,కాశ్మీర్ శాలువా ,శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఫోటో జ్ఞాపిక తో పాటు వారి శతకాలను 25 కాపీలు ,మిగిలిన రెండు శతకాలు పదేసి కాపీలు అందజేశాం .ఉయ్యూరులో ఉన్న దేవాలయలయాలలో ఏ స్వామి పైనా ఎవ్వరూ శతకం రచించినట్లు నాకు తెలిసినంతవరకు జరగలేదు .మరి 3 శతకాలు అంటే అసలు ఊహించలేనిది .అలాంటిది మా స్వామిపై 3 శతకాలు రచి౦పజేసి ,మూడూ ఒకే సారి ఆవిష్కరింప జేయటమూ చాలా అద్భుతమైన విశేషమే .ఆ అదృష్టం సరస భారతి కి శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారల అనుగ్రహం తో దక్కింది .దీనికి కారణమైన భక్తులు ,స్వర్గీయ శ్రీ గోవిందరాజు పరబ్రహ్మానంద శర్మగారి జ్ఞాపకార్ధం వారికుమారులు శ్రీ శ్రీనివాస్, శ్రీ వేణు మాధవ్ సోదరులు ఒక శతకానికి స్పాన్సర్లు అవటం అదృష్టం .
పై కవిత్రయం శతకానికి ఎంత డబ్బు ఇస్తారు అని అడగకుండా అత్యంత భక్తీ శ్రద్ధలతో స్వామి అనుజ్నగా భావించి రచించటం వారి సౌజన్యానికి ప్రతీక . 4-12-16 ఆదివారం నేను రచించిన గీర్వాణ కవుల కవితా గీర్వాణం రెండవ భాగం ఆవిష్కరింప జేసినప్పుడు జరిపిన ‘’గీర్వాణ భాషా వైభవం ‘’పై నిర్వ హించిన పద్య కవి సమ్మేళనం లో శ్రీ తుమ్మోజు వారి కవితకు విపరీతంగా ఆనంద పడిన సరసభారతి కి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతలు (అమెరికా )సరస భారతి ద్వారా శ్రీ తుమ్మోజు వారికి 5 వేల రూపాయలు అందజేయమని డబ్బు పంపారు. ఆ నగదు పారితోషికాన్ని నిన్న అందజేశాము .నాకు తెలిసినంతవరకూ తెలుగు దేశం లో ఒకే ఒక కవితకు 5 వేల భారీ పారితోషికం అంద జేసిన వారెవ్వరూ లేరని అనుకుంటున్నాను .బహుశా భారత దేశం లోనూ కూడా అరుదేమో .ఈ రికార్డ్ శ్రీ మైనేనివారి ద్వారా సరసభారతికి దక్కింది . కిందటి నెలలో శ్రీ త్యాగ రాజ స్వామి ఆరాధనోత్సవం ను,శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారి సంస్మరణ కార్యక్రమాన్ని స్వర నీరాజనం గా అయిదుగురు గాయనీ మణుల చేత నిర్వహి౦ప జేసి ,ఒక్కొక్కరికి 1 ,11 6 రూపాయలను నగదు పారితోషికాన్ని ‘’శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారి స్మారక పురస్కారం ‘’గా మా అమ్మాయి శ్రీమతి కోమలి విజయ లక్ష్మి అల్లుడు శ్రీ సా౦బా వధాని గార్ల (అమెరికా ) గారి సౌజన్యం తో అందజేశాం .బాలమురళీ కృష్ణ గారు మరణించిన రెండు నెలల లోపు వారి పేర స్మారక పురస్కారం ఏర్పాటు చేయటం ,వెంటనే అందించటం బహుశా ప్రపంచం లోనే ఎవరూ చేయలేదు. ఆ గౌరవం సరసభారతికి దక్కి రికార్డ్ అయింది .అంతేకాదు శ్రీ బాపు గారు మరణించిన మూడు నెలలలోపే సరసభారతి ‘’బాపు –రమణ స్మారక పురస్కారం ‘’ఏర్పాటు చేసి మా ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )సౌజన్యం తో మొదటి సారిగా శ్రీ వేదగిరి రాంబాబు గారికి ,శ్రీ శీలా వీర్రాజు గారికీ అందజేసి న అదృష్టం పొందాం
. శతక త్రయం ఆవిష్కరణ తరువాత దాదాపు ౩౦౦ భక్తులకు స్వామి ప్రసాదంగా విందు ఏర్పాటు చేశాం .అందరూ చాలా సంతృప్తి చెందారు .కార్య్కక్రమం, భోజనాలు పూర్తీ అయ్యేసరికి మధ్యాహ్నం 3 గంటలు అయింది .కార్యక్రమం జరిగిన తీరుకు తమ ఆనందాన్ని శ్రీ మంకు శ్రీను గారు ఒక కంద పద్యం లో బంధించి వెళ్ళే టప్పుడు నాకు అందజేశారు-
‘’అబ్బుర మందగ నెల్లరు-ఇబ్బడి ముబ్బడి కపీంద్రు డెన్నగ శతకాల్
గొబ్బున లిఖింప జేసిన-గబ్బిట దుర్గా ప్రసాదు గారికి వినతుల్ .’’
—————————————————————————————————-
ఎక్స్ రే సంస్థ కవి సమ్మేళనం
నిన్న సాయంత్రం6-గం లకు విజయవాడ శ్రీ చండ్ర రాజేశ్వర రావు లైబ్రరీలో ఎక్స్ రేసంస్థవారు ప్రతినెలా మొదటి ఆదివారం జరిపే ‘’నెల నెలా వెన్నెల ‘’కార్యక్రమం లో ‘’అద్భుతం ‘’అనే అంశం పై కవి సమ్మేళనం నిర్వహించి నన్ను సాహిత్య అతిధిగా ఆహ్వానించారు .శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ గారు సమ్మేళనం నిర్వహించారు .సుమారు 20 మందికవులు కవితలు అల్లి వినిపించారు . సంస్థ అధ్యక్షులు శ్రీ కొల్లూరి రాలేక పోయారు .వారి బదులు కార్యదర్శి శ్రీ ఆంజనేయ రాజు ,ఉపాధ్యక్షులు శ్రీ కందికొండ రవికిరణ్ గార్లు జాగ్రత్తగా నిర్వహించారు. నేను ‘’అద్భుతోద్భుతః ‘’కవిత అక్కడికక్కడ రాసి చదివాను –‘’ఎక్స్ రే కంటికి నేను చిక్కటం ఒక అద్భుతం –నన్ను అతిధిని చేయటం పరమాద్భుతం –అంతే కదా ఎక్స్ రే కు చిక్కనిదేదీ లేదు –పరీక్షించి చూడటమే తపన అయితే –చిక్కనిది దక్కనిది ,నయం కానిదేముంది ?-అందుకే ఎక్స్ రే సంస్థ ఒక అద్భుతం –అందులో నెల నెలాపాఠశాల మరో అద్భుతం –దాని రేడియేషన్ ఉయ్యూరు దాకా పాకి –నేను పట్టుబడటం పరమాద్భుతం –అద్భుతోద్భుతః ‘’
తరువాత కవుల పేర్లతో చీటీలు లాటరీతీసి వచ్చిన 5 గురు కవులకు ఒక్కొక్కరికి వందరూపాయలు అందజేయటం అద్భుతమైన ఆలోచన . అతిధి నైన నాకూ ,సమ్మేళనం నిర్వహించిన వాణీ గారికి శాలువా కప్పి జ్ఞాపిక అందజేసి సత్కరించారు .నేను ఎక్స్ రే సంస్థకు సన్మానం గా శ్రీ ఆంజనేయ రాజుగారిని శాలువాతో సత్కరించి శతక త్రయాన్ని బహూకరించాను .అలాగే వాణీ గారికీ శతకత్రయం అందించాను .అందరికీ ఇడ్లీ ఊతప్పం తో టిఫిన్ ఏర్పాటు చేశారు .పొద్దున్నించీ పని ఒత్తిడిలో ఉన్నందున ఏమీ తిన బుద్ధికాలేదు . ఏదో తిన్నట్లు నటించాను .రాత్రి ఇంటికి చేరే సరికి 10 -30 గం అయింది .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-2-17 –ఉయ్యూరు