గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
84-ముస్లిం మహిళకు వేదాంత౦లొ పి హెచ్ డి కి మార్గ దర్శి –డా.ఆర్ .గంగాధర నాయర్ (19 46)
2-10-19 46న కేరళలోని వజ్హూర్ లో జన్మించిన గంగాధర నాయర్ సంస్కృత పండిత వంశం వాడు. తండ్రి స్వాతంత్ర సమర యోధుడు ,సంస్కృత విద్వాంసుడు దేశీయ వైద్యుడు అయిన వి. కె .గోపాల పిళ్లే.నాయర్ చత్తంపి స్వామికల్ ప్రశిష్యుడైన స్వామి విద్యానంద తీర్ధ పాద వద్ద సంప్రదాయ పద్ధతిలో సంస్కృత వ్యాకరణం నేర్చాడు .సంస్కృత వ్యాకరణాన్ని ఇటు ఓరియెంటల్, అటు పాశ్చాత్య విధానం రెండిటి లోనూ తిరువనంతపురం లోని ప్రభుత్వ సంస్కృత కళా శాలలోను ,కేరళ యూని వర్సిటి లోను అధ్యయనం చేశాడు .కేరళ యూని వర్సిటిలోని రష్యన్ డిపార్ట్ మెంట్ ద్వారా రష్యన్ భాషా సాహిత్యం పై మాస్టర్ డిగ్రీ పొందాడు .ప్రొఫెసర్ ఎం .ఎస్ .శాస్త్రి ఆయన గురువు .గురువుతర్వాత నాయర్ ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రొఫెసర్ అయ్యాడు .ప్రొఫెసర్ వెంకట సుబ్రహ్మణ్య అయ్యర్ ,డా ఆర్ కరుణాకరన్ లవద్ద సంస్కృతం లో ప్రాచీన సంస్కృత శబ్ద వ్యుత్పత్తి శాస్త్ర గ్రంధాలలోని లో ‘’ఊనాది సూత్రా ల‘’పై పరిశోధన చేసి పి. హెచ్ .డి .అందుకున్నాడు . .
కాలడి లోని శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వ విద్యాలయం సంస్కృత వ్యాకరణ విభాగం అధిపతిగా ,ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ శాఖ డైరెక్టర్ గా పని చేశాడు .కొచ్చిన్ యూని వర్సిటి సైన్స్ అండ్ టెక్నాలజీ సెనేట్ మెంబర్ గా ,తిరుపతి రాష్ట్రీయ సంస్కృత యూనివర్సిటి సెనేట్ మెంబర్ గా కూడా ఉన్నాడు .మధ్య ప్రదేశ్ లోని రేవాలో ఉన్న ఓరియెంటల్ స్టడీస్ ఆఫ్ ఏ .పి .సింగ్ యూని వర్సిటి ఫాకల్టి ఎక్పర్ట్ మెంబర్ గా పని చేశాడు .కలకత్తాలోని రవీంద్ర భారతి యూని వర్సిటి డి .ఆర్. ఎస్. ప్రోగ్రాముల సలహా సంఘానికి యు జి సి నామినేట్ సభ్యుడు .కాలడి సంస్కృత యూని వర్సిటి డీన్ గా పని చేసి రిటైర్ అయ్యాడు .కొచ్చిన్ లోని సుక్రుతీంద్ర ఓరియెంటల్ రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ అకాడెమిక్ కౌన్సిల్ చైర్మన్ .దాని మేగజైన్ కు సంపాదకుడు .పురాతన సంస్కృత పత్రాల విశ్లేషణలో అవిశ్రాంతంగా విశేష కృషి చేసి ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందినవాడు గంగాధర నాయర్ .నారాయణ భట్ట పై పాణినీయేతర ప్రభావం అన్న ఆయన విశ్లేషనణాత్మక వివరణాత్మక పరిశోధన పెద్ద గుర్తింపు తెచ్చింది .ఇది పాణిని వ్యాకరణ అధ్యయనానికి కొత్త దారులు చూపింది .
కాలడి యూని వర్సిటి లో రిటైర్ అయ్యాక నాయర్ ప్రపంచ వ్యాప్తంగా సంస్కృతాన్ని వాడుక భాషగా మలచటానికి తీవ్ర కృషి చేస్తున్నాడు .ఇండియా అమెరికాల యూని వర్సిటీలలో విస్తృతంగా పర్యటించి ప్రసంగాలు చేస్తూ సంస్కృతాన్ని జీవద్భాషగా, ప్రజలు మాట్లాడుకొనే భాషగా మార్చటానికి సర్వ శక్తులు ధార పోస్తున్న సంస్కృతాభిమాని నాయర్ .తాను పదవిలో ఉండగా ఎంతో ధైర్యం తో ఒక ముస్లిం మహిళ శ్రీమతి ఫాతిమా బీవి కు భారతీయ వేదాంతం లో పి. హెచ్. డి .పొందటానికి రిసెర్చ్ గైడ్ గా నాయర్ ఉండి అందరి అభిమానాన్ని పొందాడు .
85-కాశికా వృత్తిపై వ్యాఖ్యానించిన –పదమంజరి (11 వశతాబ్దం )
11 వశతాబ్ది కి చెందిన పదమంజరి పాణిని వ్యాఖ్యానమైన కాశిక వృత్తికి వ్యాఖ్యానం రాసినట్లు తెలుస్తోంది .ఈ కీర్తి హరిదత్తు నిది అనే వాదం కూడా ఉంది .హరిదత్తుడు ఆపస్థంభ ధర్మ సూత్రాలు ,గౌతమ ధర్మ సూత్రాలు మొదలైన వాటిపై వ్యాఖ్యానం రాశాడు .
86-మీమాంసలో తన స్వంత మార్గాన్ని ఏర్పరచిన –ప్రభాకరుడు (7 వ శతాబ్ది )
భారతీయ తత్వవేత్త వ్యాకరణ వేత్త అయిన ప్రభాకరుడు 7వ శతాబ్దపు కవి .కుమారిల భట్టు మీమా౦స పై ఖండనం చేసి తన మార్గం ను వేరుగా ఏర్పాటు చేసుకొన్నాడు .ఇదే ప్రభాకర విధానం (ప్రభాకర స్కూల్ )అని పిలువబడుతోంది .8 వశతాబ్దం లో శైలకాంత ప్రభాకర సిద్ధాంతం పై వ్యాఖ్యానించాడు .పూర్వ మీమాంస సిద్దా౦త కర్తగా ప్రభాకరుని గుర్తిస్తారు .
ప్రభాకరుని సిద్ధాంతం ప్రకారం -పదాలు సూటిగా అర్ధాన్ని ఇవ్వలేవు .మిగిలిన శబ్దాలతో సంబంధం ఉన్నప్పుడే దాని అర్ధం తెలుస్తుంది .దీనికే అన్వితాభిధానం అన్నాడు. అన్వితఅంటే అనుసంధానమైనది అని అర్ధం .అభిద అంటే వ్యక్తీకరణ అని అర్ధం . వాక్యం లో పదం ఏ సందర్భంగా ప్రయోగింప బడిందో తెలియాలంటే మిగతా పదాలమధ్య సంబంధం తెలియాలి .అప్పుడు ఆ వాక్యం మొత్తం భావం అవగాహన అవుతుంది .ఇది ఆధునిక లింగ్విస్టిక్స్ లోని ‘’అండర్ స్పెసిఫికేషన్ ‘’అన్నమాట .అనగా నిర్దేశిత ప్రయోజనం .
ప్రభాకర వాదాన్ని భట్టకులు వ్యతిరేకించారు . అభిహితాన్వయం ను వాళ్ళు అంగీకరించారు .అంటే ప్రతి పదం యొక్క అర్ధం తెలిస్తేనే వాక్యం యొక్క మొత్తం భావం తెలుస్తుంది అని వీళ్ళ వాదం .వీరి భావనలో శబ్దాలు స్వతంత్రమైనవి ,సంపూర్ణ స్వరూపమైనవి .ఇది ఈ నాటి ‘’ఫోడోరియన్’’వాదానికి దగ్గర లో ఉంది .
87-ప్రకరణ పంచిక కర్త –శైలకాంత(క్రీ.శ.900)
7 వ శతాబ్దానికి చెందిన ప్రభాకరుని అనుయాయుడు 9 వ శతాబ్ది శైలకాంత .భట్టవాద వ్యతిరేకి .ప్రభాకరుని పూర్వ మీమాంస పై విపులమైన వ్యాఖ్యానం’’ ప్రకరణ పంచిక ‘’ రాశాడు .ప్రభాకర సిద్ధాంతాన్ని పూర్తిగా తెలుసుకోవటానికి శైల కాంత వ్రాసిన ప్రకరణ పంచిక ఒక్కటి మాత్రమే మిగిలింది .
88 –గణిత మేధావి –విరహంక (6 వ శతాబ్దం )
6 వ శతాబ్దికి చెందిన విరహంక గొప్ప ఛందస్ శాస్త్ర వేత్త ,గణిత మేధావి .8 వ శతాబ్దం వాడు అనే అభిప్రాయమూ ఉన్నది .క్రీ పూ. 4 వ శతాబ్దానికి చెందిన పింగళ కుని ఛందస్సూత్రాల నాధారంగా ఛందశ్శాస్త్రం రాశాడు .దీనికి వ్యాఖ్యానాన్ని 12 వ శతాబ్దానికి చెందినగోపాలకవి రాశాడు .
89-ఛందశ్శాస్త్ర కర్త పింగళ –(క్రీ పూ. 4 వ శతాబ్దం )
చందశ్శాస్త్రం పై వెలువడిన అతి ప్రాచీన గ్రంధాన్ని పింగళ క్రీ పూ 4 వశతాబ్దం లో రాశాడు .పాణిని తమ్ముడుగా లోక ప్రసిద్ధి .లేకక్రీ పూ .2 వ శతాబ్దం లో మహా భాష్యం రాసిన పతంజలి సోదరుడు .8 అధ్యాయాల ఈ చందో శాస్త్రం లోని సూత్రాలను అర్ధం చేసుకోవాలంటే వ్యాఖ్యానం తప్పనిసరి గా ఉండాల్సిందే . ఈ గ్రంథం క్రీ పూ లో చివరికాలం లో కాని క్రీ.శ .ప్రారంభ కాలం లో కాని రాయబడి ఉంటుందని ఊహిస్తున్నారు .అంటే వేద ఛందస్సుకు ,లౌకిక ఛందస్సుకు మధ్యకాలం లో సంధియుగం లో రాయబడి ఉండాలి .మౌర్యకాలానికి దగ్గర లో ఉండి ఉంటుంది .10 వ శతాబ్దికి చెందిన హలయూథ దీనిపై వ్యాఖ్యానం రాయటమేకాక విస్తృత పరచాడు కూడా . .
ఛందశ్శాస్త్రంలో గురు,లఘువుల చర్చ ఉన్నది .ద్విసంఖ్యామానం ఆధారంగా రాశాడు .వివిధ ఛందస్సులు వాటి కలయికలు చూస్తే బైనామియన్ ధీరం (ద్విపద సిద్ధాంతం )గుర్తుకు వస్తుంది .దీనికి హలయూధుని ‘’మృతసంజీవిని ‘’వ్యాఖ్యానం చూస్తుంటే’’ పాస్కల్ త్రిభుజం ‘’ గుర్తుకు వస్తుంది .ఈ శాస్త్రం లో ‘’మాత్రా మేరు లేక మేరు ప్రస్తార ‘’విధానం ఈ నాటి గణితం లోని ‘’ఫైబో నాసి నంబర్ ‘’లను పోలి ఉంటుంది . Pingala’s system ranks binary patterns starting at one (four short syllables—binary “0000”—is the first pattern), the nth pattern corresponds to the binary representation of n-1 (with increasing positional values). Positional use of zero dates from c. the 7th century (Brahmagupta) and would have been known to Halāyudha but not to Pingala.
90-మృత సంజీవిని రాసిన –హలయూధుడు (10 వ శతాబ్దం )
గణిత మేధావి అయిన హలయూధుడు 10 వ శతాబ్దానికి చెందినవాడు .పింగళుని చందశ్శాస్త్రానికి ‘’మృత సంజీవిని ‘’వ్యాఖ్య రాశాడు .ఇది ఈనాటి పాస్కల్ త్రిభుజానికి ఆనాడే చెప్పిన సిద్ధాంతం .ఈ కవి రాష్ట్ర కూట రాజుల రాజధాని ‘’మాన్య ఖేట ‘’లో నివసించాడు .రాష్ట్ర కూట రాజు మూడవ కృష్ణుని ఆస్థానం లో ఉండి ఈ వ్యాఖ్యానం రాశాడు .ఈ కవి రాసిన ‘’కవి రహస్యం ‘’రాజు మూడవ కృష్ణుని స్తుతిస్తూ రాసినదే .తరువాత ఉజ్జయినికి పారమార రాజులకాలం లో చేరాడు .పారమార రాజు ముంజ ను స్తుతిస్తూ మృతసంజీవని వ్యాఖ్య రాశాడు .పై రెండు గ్రంధాలే కాక ‘’అభిదాన రత్నమాల ‘’ అనే సంస్కృత నిఘంటువు కూడా హలయూధుడు కూర్చాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-3-17 –ఉయ్యూరు